Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు

Published : 29 Nov 2022 17:03 IST

1. Andhra News: ఇవాళ్టికి ఏపీ రాజధాని అమరావతే: సజ్జల

రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజధానిపై ప్రభుత్వ వైఖరి మేరకే సుప్రీం నిర్ణయం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 3 రాజధానులపై గతంలో తెస్తామని చెప్పిన బిల్లును వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. లేని చట్టంపై గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఈసారైనా కాంగ్రెస్‌ ‘KHAM’ వ్యూహం పని చేసేనా?

గుజరాత్‌ ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గర పడుతోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం కాంగ్రెస్‌పై అంచనాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కానీ, సుదీర్ఘ అనుభవం కలిగిన ‘హస్తం’ పార్టీ.. ఎప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చుకుంటూ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ గతంలో అనుసరించిన ‘KHAM’ ( క్షత్రియ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం) వ్యూహం మరోసారి తెరమీదకు వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నువ్వు సీఎంగా ఉండగా కేసు బదిలీ.. తలెక్కడ పెట్టుకుంటావ్‌ జగన్‌రెడ్డీ?: చంద్రబాబు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేయడంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘సొంత బాబాయ్‌ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ అయింది. అది కూడా నువ్వు సీఎంగా ఉండగా! తలెక్కడ పెట్టుకుంటావ్‌ జగన్‌రెడ్డీ?’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం పదవికి జగన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. china: చైనాలో ఏమిటీ ‘తెల్లకాగితం విప్లవం’..?

చైనాలో జీరో కొవిడ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. తియానన్మెన్‌ స్క్వేర్‌ ఆందోళన తర్వాత ఇవే అతిపెద్ద నిరసనలు. చైనా కమ్యూనిస్టు పార్టీలో చాలా మంది నేతలు చదువుకున్న ప్రఖ్యాత సింగ్వా విశ్వవిద్యాలయంలో కూడా ఇవి చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రజలు తమ నిరసనలు తెలియజేయడానికి తెల్ల కాగితాలను గుర్తుగా ఎంచుకొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. YS Sharmila: ధ్వంసమైన కారులోనే షర్మిల నిరసన.. క్రేన్‌తో తరలించిన పోలీసులు

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రగతిభవన్‌ ముట్టడికి  కారులో ఆమె వెళ్తుండగా పోలీసులు పంజాగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. షర్మిల డ్రైవింగ్‌ సీట్లో ఉండగానే కారును పోలీసు క్రేన్‌ వాహనంతో తరలించారు. పోలీసుల వైఖరిపై వైతెపా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Mallikarjun Kharge: రావణుడిలా మీకేమైనా 100 తలలు ఉన్నాయా?: మోదీపై ఖర్గే వ్యాఖ్యలు

గుజరాత్‌ తొలి విడత ఎన్నికల(Gujarat election2022) ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనున్న వేళ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోదీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ‘రావణుడు’తో పోల్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు గుజరాత్‌లో రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. తనను చూసి ఓటేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను కోరుతూ ఎన్నికల క్యాంపెయిన్‌ నిర్వహించడంతో ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Kashmir Files Row: నిజాన్ని చూడలేకపోతే.. నోరు మూసుకోండి: అనుపమ్ ఖేర్‌

అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం(ఇఫి)లో ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ చిత్రంపై జ్యూరీ హెడ్‌, ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. లాపిడ్‌ వ్యాఖ్యలను ఆయన సొంత దేశ దౌత్యవేత్తలే తీవ్రంగా ఖండిస్తూ భారత్‌కు క్షమాపణలు తెలిపారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌.. ఇజ్రాయెల్‌ దర్శకుడి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Drone: పాక్‌ నుంచి డ్రగ్స్‌తో డ్రోన్‌.. కూల్చేసిన బీఎస్‌ఎఫ్‌ మహిళా సిబ్బంది

పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్‌ సరిహద్దులో డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా కుట్రలను సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్‌) భగ్నం చేశాయి. పాకిస్థాన్‌ నుంచి నార్కోటిక్స్‌ తీసుకొస్తున్న ఓ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ మహిళా సిబ్బంది దాన్ని కూల్చేశారు. అందులో 3.1 కేజీల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Loan Against Car: కారు తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చా?

ఆర్థిక అత్యవసరాలు ఎప్పుడైనా రావచ్చు. అత్యవసరంగా డబ్బు కావాల్సినప్పుడు మన వద్ద బంగారం ఉన్నా లేక మరేదైనా ఆస్తి ఉన్నా.. దాన్ని బ్యాంకులో తనఖా ఉంచి రుణం తీసుకోవచ్చు. ఇది దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. మరి కారును తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చా? బ్యాంకులు రుణం ఇస్తాయా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. BCCI: సెలెక్టర్ల పదవి కోసం 50 మందికిపైగా దరఖాస్తు.. ముందు వరసలో వీరేనా..?

బీసీసీఐ పురుష సీనియర్‌ జట్టు సెలెక్టర్ల పదవి కోసం దరఖాస్తు చేసుకొనే గడువు సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఐదు పోస్టుల కోసం దాదాపు 50 మందికిపైగా దరఖాస్తు చేసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్ మనిందర్‌ సింగ్‌, మాజీ ఓపెనర్ శివ్‌సుందర్ దాస్‌, వినోద్ కాంబ్లి ఉన్నారు. దరఖాస్తుదారుల్లో సుపరిచితమైన ఆటగాళ్లు వీరే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని