Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు
1. Cm Kcr: ఏ తెలంగాణను కోరుకున్నామో అది సాకారమవుతోంది: సీఎం కేసీఆర్
ఏ తెలంగాణను కోరుకున్నామో అది సాకారమవుతోందని.. అద్భుతమైన లక్ష్యం దిశగా సాగుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏదైనా సాధించామనే సంతృప్తి జీవితంలో చాలా ముఖ్యమైందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తెరాస జిల్లా కార్యాలయంతో పాటు కలెక్టరేట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక నేతలతో సీఎం కాసేపు ముచ్చటించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. IND vs BAN: బంగ్లాతో తొలి వన్డే.. అభిమానుల మద్దతుపై రోహిత్ శర్మ కామెంట్
టీమ్‌ఇండియాతో తొలి వన్డే కోసం భారత బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా ఈసారి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. Pakistan: శత్రువుతో యుద్ధానికి సిద్ధమే : పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
తమ దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. ప్రతి ఇంచు భూమిని రక్షించుకోవడమే కాకుండా శత్రుదేశంపై దాడి చేస్తామని పాకిస్థాన్ నూతన ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి నియంత్రణ రేఖలోని (Line of Control) రాఖ్‌చిక్రీ సెక్టార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి సైనికులు, ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన భారత్‌ను ఉద్దేశించి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. Morality Police: దిగొచ్చిన ఇరాన్.. నైతిక పోలీసు విభాగం రద్దు!
రెండు నెలలకుపైగా కొనసాగుతోన్న హిజాబ్ ఆందోళనల క్రమంలో.. ఇరాన్(Iran) ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహ్సా అమీని మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని(Morality Police) రద్దు చేసింది. ‘నైతిక పోలీసు విభాగానికి.. న్యాయవ్యవస్థతో సంబంధం లేదు. దాన్ని రద్దు చేశాం’ అని దేశ అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ మోంతజేరి ప్రకటించినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. FIFA: మెరిసిన మెస్సీ.. మురిసిన అర్జెంటీనా..!
ఫిఫా ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో పరాజయం పాలైన అర్జెంటీనా ఆ తర్వాత వేగంగా పుంజుకుంది. శనివారం రౌండ్-16లో ఆస్ట్రేలియాతో పోరులో 2-1 తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. తన 1000వ మ్యాచ్‌లో కళ్లు చెదిరే గోల్‌తో ఆకట్టుకున్న కెప్టెన్ లియోనల్ మెస్సీ.. ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా రికార్డును బద్దలుకొట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. Viral news: దేవుడి పాదాలపైనే ప్రాణం విడిచాడు..వీడియో వైరల్
ఎప్పటిలాగే గుడికి వెళ్లాడు. ప్రార్థన అనంతరం దేవుడి పాదాలపై తలపెట్టి అలా ఉండిపోయాడు. మిగతా భక్తులంతా మొక్కుతున్నాడేమో అనుకున్నారు.తీరా చూసేసరికి ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటు ఎంత సులువుగా ప్రాణం తీస్తుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. Ukraine: యుద్ధం ఆగదు.. కానీ నెమ్మదిస్తుంది..: అమెరికా ఇంటెలిజెన్స్
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఆగదని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనావేశాయి. శీతాకాలం నేపథ్యంలో దాడుల వేగం మందగిస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆవ్రిల్ హెయిన్స్ వెల్లడించారు. శీతాకాలం తర్వాత దాడులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యేందుకు ఇరు దేశాలు యత్నిస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికీ ఉక్రెయిన్ మౌలిక వసతులపై రష్యా దాడులు చేస్తోనే ఉంది. ఈ యుద్ధం తొమ్మిదో నెలకు చేరుకోగా.. స్వాధీనం చేసుకొన్న భూభాగాల్లో సగానికిపైగా రష్యా కోల్పోయిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. Naxalites: నక్సల్స్ నుంచి అమెరికా ఆయుధం స్వాధీనం!
ఇటీవల నక్సలైట్లతో ఎదురుకాల్పులు జరిగిన సమయంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో కొన్ని అమెరికాలో తయారైనవి ఉన్నాయని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆదివారం వెల్లడించారు. బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలు-మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు 40 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. Pushpa The Rule: ‘పుష్ప2’ అక్కడ ఇక్కడ ఒకేసారి విడుదల..
పుష్ప టీం ప్రస్తుతం రష్యాలో ప్రమోషన్స్‌తో బీజీగా ఉంది. డిసెంబర్ 8న ఈ చిత్రం రష్యాలో విడుదల సందర్భంగా బన్నీ, రష్మికలు అక్కడ సందడి చేస్తున్నారు. ఇక ఈ సినిమా సీక్వెల్‌పై ఇప్పటికే అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇక పుష్ప2 కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. MCD polls 2022: ఓటేయాలని ఎంతో ఆశతో వచ్చాం.. కానీ!: దిల్లీ ఓటర్ల ఆగ్రహం
దేశ రాజధాని దిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల(MCD Polls 2022) నిర్వహణలో అధికారుల వైఫల్యం ఓటర్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్ కేంద్రాలకు ఎంతో ఆశగా తరలివస్తోన్న పలువురు ఓటర్లకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. తమ పోలింగ్ బూత్ ఎక్కడో తెలియని అయోమయ పరిస్థితుల్లో కొందరు, ఓటరు జాబితాలో పేర్లులేకపోవడంతో మరికొందరు చివరకు ఓటేయకుండానే వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Cyber Crime : ఇంట్లో కూర్చోబెట్టే కాజేత
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత
-
Politics News
Raghurama: నాడు తెదేపాలో లక్ష్మీపార్వతిలాగా నేడు వైకాపాలో సజ్జల వ్యవహరిస్తున్నారు
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక