Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 05 Dec 2022 17:02 IST

1. Modi: గుజరాత్‌ ఓటింగ్‌.. వివాదంలో మోదీ ‘నడక’

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) రెండో విడత పోలింగ్‌ సోమవారం కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi) ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటేసేందుకు వచ్చిన ప్రధాని.. కొద్ది దూరం నడుచుకుంటూ పోలింగ్  కేంద్రానికి వెళ్లడంపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పోలింగ్‌ (Gujarat Polling) వేళ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మోదీ ‘రోడ్‌ షో’ చేపట్టారని ఆరోపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Janasena: అది ముమ్మాటికీ వైకాపా వికృత రాజకీయంలో భాగమే: నాదెండ్ల మనోహర్‌

చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ ఇంటిపై దాడి.. వైకాపాసర్కారు ఆలోచనా విధానాన్ని మరోసారి బయటపెట్టిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రైతు సభ నిర్వహించాలనుకోవడమే రామచంద్ర యాదవ్‌ చేసిన నేరమా? అని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Amazon: 10 కాదు 20 వేలు.. భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధమైన అమెజాన్‌!

అమెరికాకు చెందిన ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. 10వేల మందిని తొలగించాలని (lay off) ఆ కంపెనీ భావిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ.. ఆ సంఖ్య 20 వేల వరకు ఉండనుందని తాజాగా తెలిసింది. కరోనా సమయంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్న ఆ సంస్థ.. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఇప్పుడు ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. IND Vs BAN : ఓటమికి సాకులు చెప్పట్లేదు.. మా బ్యాటింగ్‌ విధానాన్ని మార్చుకోవాలి: రోహిత్‌ శర్మ

తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ ఆఖరి వికెట్‌ పడగొట్టలేక.. ఓటమిని మూటగట్టుకుంది టీమ్‌ఇండియా. దీంతో చేతులదాకా వచ్చిన భారత్‌ విజయాన్ని బంగ్లా లాగేసుకుంది. ఇక ఈ ఓటమిలో ప్రధానంగా టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ వైఫల్యంపైనే అందరూ చర్చించుకుంటున్నారు. ఇదే విషయమై మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. తమ బ్యాటింగ్‌ విధానంపై ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. CM Jagan: రైతులకు చేసే చెల్లింపులు పారదర్శకంగా ఉండాలి: జగన్

ఏఎంఎస్‌పీ (Maximum Selling Price) కంటే పైసా తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ధాన్యం కొనుగోళ్లపై కొత్త విధానాన్ని తీసుకొచ్చామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ధాన్యం సేకరణలో తొలిసారి మిల్లర్ల ప్రమేయాన్ని తొలగించామన్నారు. ఖరీఫ్‌ ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మిల్లర్ల ప్రమేయం లేని కొత్త విధానం అమలు తీరుపై ఆరా తీశారు. కొత్త విధానం ఎలా అమలవుతోందో అధికారులు గమనించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Revanth Reddy: కేటీఆర్‌ దత్తత తీసుకోవడం వల్లే కొడంగల్‌కు ఆ పరిస్థితి: రేవంత్‌రెడ్డి

వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ను దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్‌.. ఈ నాలుగేళ్లలో అక్కడ ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెరాస పాలనలో కొడంగల్ నియోజకవర్గానికి తుప్పు పట్టిందన్నారు. కేటీఆర్‌ దత్తత తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కొడంగల్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ తెరాస వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Term insurance: అదే ప్రీమియంతో బీమా పెంచుకోండి.. ఇంక్రిమెంటల్‌ టర్మ్‌ ప్లాన్‌ వివరాలివీ..

ప్యూర్‌ టర్మ్‌ పాలసీ తీసుకుంటే పాలసీదారుడు పాలసీ కాలవ్యవధిలో మరణిస్తే నామినీకి హామీ మొత్తాన్ని అందిస్తారు. ఒకవేళ పాలసీదారుడు పాలసీవ్యవధి వరకు జీవించి ఉంటే ఎలాంటి హామీ అందదు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి.. తనపై ఆధారపడిన కుటుంబ సభ్యుల భవిష్యత్‌కు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ  టర్మ్‌పాలసీ సహాయపడుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Akira: పవర్‌స్టార్‌ కొత్త ప్రాజెక్ట్‌పై అకీరా ఆనందం.. అడివి శేష్‌ కామెంట్స్‌ వైరల్‌

తన తండ్రి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) కొత్త ప్రాజెక్ట్‌ విషయంలో అకీరా నందన్‌ (Akira) ఆనందంగా ఉన్నాడని, ఈ సినిమా కోసం అతడు ఎదురుచూస్తున్నాడని నటుడు అడివి శేష్‌ (Adivi Sesh) తెలిపారు. ‘హిట్‌-2’ (HIT 2) ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శేష్‌.. తన మిత్రుడు సుజిత్ (Sujeeth)‌, పవన్‌తో సినిమా చేయడంపై స్పందిస్తూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Buggana: జగన్నాథగట్టుపై హైకోర్టు కడతాం: ‘సీమగర్జన’లో మంత్రి బుగ్గన

కర్నూలులో హైకోర్టు (AP High Court) ఏర్పాటుకు తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (Buggana) డిమాండ్‌ చేశారు. నగరంలోని జగన్నాథగట్టుపై హైకోర్టు కట్టబోతున్నట్లు ప్రకటించారు. హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ వైకాపా ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ‘సీమ గర్జన’ సభ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Hardik pandya: పాండ్యా భారత జట్టును నడిపించగల సమర్థుడే: రషీద్‌ ఖాన్‌

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌(IND vs NZ) సందర్భంగా టీమ్‌ఇండియా(Team india) ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా(Hardik pandya) కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అతడి నేతృత్వంలో ఈ సిరీస్‌ను భారత్‌ గెలుపొందడంతో పాండ్యాపై సీనియర్లు ప్రశంసలు కురిపించారు. పొట్టి ఫార్మాట్‌లో పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలను పాండ్యాకు అప్పగిస్తే బాగుంటుదని పలువురు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని