Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News At 1 PM: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Dec 2022 17:15 IST

1. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రో విస్తరిస్తాం : కేటీఆర్‌

ట్రాఫిక్‌ రద్దీ పెరిగిన దృష్ట్యా ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోరైల్‌ను పొడిగించాలని స్థానికులు కోరుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ స్పందించారు. రానున్న ఎన్నికల్లో  వచ్చేది తెరాస ప్రభుత్వమేనని, అప్పుడు ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. పూర్తివార్త కోసం క్లిక్‌ చేయండి


2. అధికారులమంటూ కాల్‌ చేస్తే.. ట్రూకాలర్‌ చెప్పేస్తుంది!

కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, మంత్రిత్వశాఖల నంబర్లను సులువుగా గుర్తించవచ్చని తెలిపింది. ఇందుకోసం ట్రూకాలర్‌ ‘గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ’ పేరుతో ఫోన్‌ నంబర్ల జాబితాను సిద్ధం  చేసింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, మంత్రుల కార్యాలయాల నంబర్లు ఉంటాయి. ఈ డిజిటల్ డైరెక్టరీతో యూజర్లకు స్పామ్‌కాల్స్‌ నుంచి భద్రత లభించడమే కాకుండా.. ప్రభుత్వ అధికారులకు తమ సమస్యలను ఫోన్‌ ద్వారా తెలియజేసే అవకాశం ఉంటుందని ట్రూకాలర్‌ చెబుతోంది. పూర్తివార్త కోసం క్లిక్‌ చేయండి

3. నలభై నిమిషాల్లోనే నాలుగు గోల్స్‌ కొట్టేసి..!

 ఫిఫా ప్రపంచకప్‌ (FIFA world cup 2022) నాకౌట్‌ రౌండ్‌ మ్యాచ్‌లో ఓ జట్టు ప్రతి పదినిమిషాలకో గోల్‌ చొప్పున కొడుతుంటే.. అవతల జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇటువంటి పరిస్థితినే నేడు దక్షిణ కొరియా(south korea) ఎదుర్కొంది. నేడు జరిగిన రౌండ్‌-16 మ్యాచ్‌లో బ్రెజిల్‌-దక్షిణ కొరియా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ పూర్తి ఏకపక్షంగా సాగింది. గ్రూప్‌ దశలో గాయపడి విశ్రాంతి తీసుకొన్న స్టార్‌ ఆటగాడు నెయ్‌మార్‌ ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేయడంతోపాటు ఓ గోల్‌ కూడా సాధించాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.ప్రధాని మోదీ సూచన.. నీతి ఆయోగ్‌ సీఈవోతో చంద్రబాబు భేటీ

నీతి ఆయోగ్‌ సీఈవో పరమేశ్వరన్‌ అయ్యర్‌(Parameswaran iyer)తో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) భేటీ అయ్యారు. జీ-20 సదస్సు (g20 summit) నిర్వహణపై సోమవారం ప్రధాని మోదీ (PM Modi) అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో డిజిటల్‌ నాలెడ్జ్‌ అంశంపై చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన సూచించిన అంశాలను తన ప్రసంగంలో ప్రధాని ప్రస్తావించారు. డిజిటల్‌ నాలెడ్జ్‌ విజన్‌ డాక్యుమెంట్‌పై నీతి ఆయోగ్‌ (Niti Aayog) అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు ప్రధాని సూచించారు. దీనిలో భాగంగానే నీతి ఆయోగ్‌ సీఈవోతో ఆయన సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఒక కుటుంబంలో ఎన్ని పీపీఎఫ్‌ ఖాతాలు తెరవొచ్చు?

పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి.. ఏ మాత్రం నష్టభయం ఉండకూడదనుకునే వారికి పీపీఎఫ్‌ (PPF) ఒక మంచి మార్గం. పెట్టుబడులకు ప్రభుత్వ హామీ ఉండడంతో పాటు ఈఈఈ (EEE) కేటగిరీ కింద పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. అంటే, పెట్టుబడులపై సెక్షన్‌ 80సి (80c) కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే రాబడి, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను వర్తించదు. అయితే ఒక వ్యక్తి ఎన్ని పీపీఎఫ్‌ ఖాతాలు తెరవచ్చు? భార్య, పిల్లల పేరుపై కూడా పీపీఎఫ్‌ ఖాతాలను తెరవొచ్చా? అన్ని ఖాతాలకూ పన్ను మినహాయింపు లభిస్తుందా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.  ఎయిర్‌పోర్టుకు మెట్రో.. ఈనెల 13 వరకు బిడ్‌ల స్వీకరణ

నగరంలోని విమానాశ్రయం మెట్రో నిర్మాణం కోసం ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీల ప్రీ బిడ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డితో పాటు ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. నేటి నుంచి ఈనెల 13 వరకు కన్సల్టెన్సీల నుంచి బిడ్‌లను స్వీకరించనున్నారు. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,250 కోట్ల అంచనాతో 31 కి.మీ దూరం మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఈనెల 9న మెట్రో నిర్మాణానికి రాయదుర్గంలో సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేయనున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘యశోద’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

  సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘యశోద’ (Yashoda) చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో ఈ నెల 9 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని సదరు సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. హరి- హరీశ్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో నవంబరు 11న విడుదలైన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దక్షిణ కోస్తాంధ్రకు తుపాను ముప్పు.. అప్రమత్తమైన రెవెన్యూ యంత్రాంగం

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింత బలపడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ సాయంత్రానికి ఇది క్రమంగా వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. వాయువ్య దిశగా కదులుతూ కోస్తాంధ్ర-తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తూ మరింత బలపడి 8వ తేదీ ఉదయానికి తుపానుగా మరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర-తమిళనాడు తీరాలకు దగ్గరగా తుపానుగా మారిన అనంతరం తీవ్ర ప్రభావం చూపే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆద్యంతం నష్టాల్లో దేశీయ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు మరికొంతకాలం కొనసాగించనుందనే అంచనాలతో యూఎస్‌ సూచీలు నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. దాని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపైనా పడింది. సెన్సెక్స్‌ 208.24 పాయింట్ల నష్టంతో 62,626.36 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 58.20 పాయింట్ల నష్టంతో 18,642.80 వద్ద ముగిసింది. పూర్తివార్త కోసం క్లిక్‌ చేయండి 

10. Bengaluru: నడిరోడ్డుపైనే పట్టుకుని.. రాళ్లతో మోది దారుణ హత్య!

కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో దారుణ హత్యాఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది కలిసి ఇటీవల ఓ వ్యక్తిని నడిరోడ్డుపైనే రాళ్లతో మోది హత్య చేయడం కలకలం రేపింది. నగరంలోని కేపీ అగ్రహార ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని