Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...   

Published : 05 Jul 2024 16:59 IST

1. వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయలేదు: స్పీకర్‌ అయ్యన్న

ఐదేళ్లు పాలించిన వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వేయలేదని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అమరావతిలోని ఎమ్మెల్యేల క్వార్టర్స్‌, అసెంబ్లీ పరిసరాలను ఆయన పరిశీలించారు. స్పీకర్ వెంట ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, విష్ణుకుమార్ రాజు, అధికారులు ఉన్నారు. పూర్తి కథనం

2. కేసీఆర్‌పై విశ్వాసం లేకే కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు: ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్

భారాస అధ్యక్షుడు కేసీఆర్‌పై విశ్వాసం లేకపోవడంతోనే ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టిందెవరో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. పూర్తి కథనం

3. హైదరాబాద్‌ నుంచి విదేశాలకు పెద్దఎత్తున ఫార్మా ఎగుమతులు: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌ నుంచి పెద్దఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన ఇండియన్‌ ఫార్మాస్యుటికల్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పూర్తి కథనం

4. కృష్ణాడెల్టాకు సాగునీరివ్వడం ఆగస్టు వరకు సాధ్యం కాదు: మంత్రి నిమ్మల

కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరివ్వడం ఆగస్టు వరకు సాధ్యం కాదని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు. పూర్తి కథనం

5. 2007 కంటే.. 2024 విక్టరీ నాకెంతో స్పెషల్: రోహిత్ శర్మ

రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024)ను అందుకొన్న ఏకైక భారత క్రికెటర్ కెప్టెన్ రోహిత్ శర్మ. మొదట 2007లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో విజేతగా నిలిచిన జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి కెప్టెన్సీలోనే టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలిచింది.  పూర్తి కథనం

6. ఎయిర్‌టెల్‌ కస్టమర్ల డేటా లీక్‌?.. ఖండించిన టెలికాం సంస్థ

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ను ఓ వివాదం చుట్టుముట్టింది. దాదాపు 37.5 కోట్ల మంది కస్టమర్ల వ్యక్తిగత వివరాలు (Airtel Data Leak) హ్యాకింగ్‌కి గురైనట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వీటిని ఎయిర్‌టెల్‌ తీవ్రంగా ఖండించింది. పూర్తి కథనం

7. ఆప్ పార్లమెంటరీ ఛైర్‌పర్సన్‌గా సంజయ్ సింగ్

ఆమ్ఆద్మీ పార్టీ (AAP) సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ (Sanjay Singh)ను ఆప్ పార్లమెంటరీ ఛైర్‌పర్సన్‌గా ఆ పార్టీ నియమించింది. సంజయ్‌ సింగ్‌ 2018లో తొలిసారిగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పూర్తి కథనం

8. జమ్మూకశ్మీర్‌ ఎన్నికలు అప్పుడేనా..?

అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra) ముగిసిన అనంతరం జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) నిర్వహించనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆ రాష్ట్ర భాజపా (BJP) నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) ఆదేశించినట్లుగా సమాచారం.  పూర్తి కథనం

9. అందుకే బిహార్‌లో వరుసగా బ్రిడ్జ్‌లు కూలుతున్నాయట! నివ్వెరపరుస్తున్న కేంద్రమంత్రి సమాధానం

బిహార్‌లో గత కొద్దిరోజులుగా వరుసగా బ్రిడ్జ్‌లు కూలిపోతున్నాయి. 17 రోజుల వ్యవధిలో 12 వంతెనలు కూలిపోవడం (Bihar Bridge Collapse) చర్చనీయాంశంగా మారింది. దీనికి కేంద్ర మంత్రి, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ ఇచ్చిన వివరణ నివ్వెరపరుస్తోంది. పూర్తి కథనం

10. బాధ్యత వహించినా.. సునాక్‌ కేవలం బాధితుడేనా!

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయంతో 14ఏళ్ల కన్జర్వేటివ్‌ల పాలనకు తెరపడింది. కష్టకాలంలో పాలనా పగ్గాలు చేపట్టిన రిషి సునాక్‌.. ఓటమిని అంగీకరిస్తూ, ఇదో ‘కష్టమైన రాత్రి’ అని పేర్కొన్నారు. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నప్పటికీ అంతకుముందు అధికారం చేపట్టిన టోరీల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని