Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Jul 2024 16:59 IST

1. అయోధ్య ఫలితం.. గుజరాత్‌లోనూ రిపీట్‌: రాహుల్

అయోధ్యలో (Ayodhya) భాజపాను ఓడించినట్లే.. గుజరాత్‌లోనూ (Gujarat) ఆ పార్టీపై ఇండియా కూటమి (India Bloc) విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత, రాయ్‌బరేలి ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. పూర్తి కథనం

2. మార్కెట్‌కు అనుగుణంగా నైపుణ్య శిక్షణ: ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గత ఐదేళ్లలో నైపుణ్య శిక్షణపరంగా రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విజయనగరంలోని టీటీడీసీ శిక్షణా కేంద్రం, జిల్లా సమాఖ్య కార్యకలాపాలను ఆయన పరిశీలించారు. పూర్తి కథనం

3. కాళేశ్వరం పంప్‌ హౌస్‌ ఇంజినీర్లను విచారించనున్న పీసీ ఘోష్‌ కమిషన్‌

కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌ హౌస్‌ ఇంజినీర్లను జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారించనుంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్‌హౌస్‌ ఇంజినీర్లను కమిషన్‌ ప్రశ్నించనుంది. ఈ మూడు పంప్‌హౌస్‌లకు చెందిన సీఈ నుంచి ఏఈఈల హోదాల్లో పనిచేసే ఇంజినీర్లు సోమవారం కమిషన్‌ ఎదుట హాజరుకానున్నారు.  పూర్తి కథనం

4. సికింద్రాబాద్‑గోవా బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కిషన్‌రెడ్డి

తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడగామా(గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనుంది.  ఇప్పటివ రకు వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి గుంతకల్‌ చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. పూర్తి కథనం

5. ఎంఎస్ ధోనీ ‘100’ అడుగుల కటౌట్‌..

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బర్త్‌డే ఆదివారం. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన ధోనీ ‘100’ అడుగుల కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు.  పూర్తి కథనం

6. సమంతకు క్షమాపణలు చెప్పిన డాక్టర్‌.. కానీ..

సమంతను విమర్శించినందుకు డాక్టర్‌ లివర్‌ డాక్‌ క్షమాపణలు చెప్పారు. కొన్ని రోజులుగా సమంతకు ఆయనకు మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆయన సమంత ఇచ్చిన హెల్త్‌ టిప్‌ను విమర్శించే క్రమంలో ఆమెను బలమైన పదాలతో దూషించారు. పూర్తి కథనం

7. కొనసాగుతోన్న ‘కల్కి’ హవా.. కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే!

ప్రభాస్‌ (prabhas) కీలక పాత్రలో నాగ్‌ అశ్విన్‌ (Director nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2829 ఏడీ’ హవా కొనసాగుతోంది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పూర్తి కథనం

8. ఎన్నో హెచ్చుతగ్గులు చూశా.. నన్ను గేలిచేశారు: మోదీతో హార్దిక్ పాండ్య

టీ20 ప్రపంచకప్‌లో (T20 WorldCup) విజయఢంకా మోగించిన రోహిత్‌ సేన.. ప్రధాని మోదీ (Modi) నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీమ్ఇండియా హార్దిక్ పాండ్య (Hardik Pandya) ప్రధానితో మాట్లాడుతూ.. గత కొద్దినెలలుగా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వెల్లడించాడు. పూర్తి కథనం

9. జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 23న కేంద్ర బడ్జెట్‌

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించి, నరేంద్రమోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే కూటమి కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ప్రభుత్వం జులై 23న బడ్జెట్‌ (Union Budget 2024)ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. పూర్తి కథనం

10. అస్సాం అతలాకుతలం.. ఉప్పొంగుతున్న నదులు

ఈశాన్య రాష్ట్రం అస్సాం (Assam)లో వరదల బీభత్సం ఇంకా కొనసాగుతోంది. బ్రహ్మపుత్ర నది దాని ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. డేంజర్‌ మార్కును దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలతో 24 లక్షల మంది ప్రభావితమయ్యారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని