Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 08 Jul 2024 17:00 IST

1. అక్రమ కట్టడాల పేరుతో చిరుద్యోగుల ఇళ్లు కూల్చివేయటం దారుణం: ఈటల

అక్రమ కట్టడాల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం చిరుద్యోగుల ఇళ్లు కూల్చివేస్తోందని భాజపా నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సాయిప్రియ ఎన్‌క్లేవ్‌లో చిన్న చిన్న ఉద్యోగులు, నిరుపేదలు 30 ఏళ్ల కిందట భూములు కొనుగోలు చేశారు. పూర్తి కథనం

2. ఈనెల 16 వరకు అఫిడవిట్లు దాఖలు చేయండి: ఇంజినీర్లకు కాళేశ్వరం కమిటీ ఆదేశాలు

కాళేశ్వరం అంశంపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కమిషన్‌కు కాగ్ నివేదిక సమర్పించింది. అధ్యయన నివేదికను నిపుణుల కమిటీ అందజేసింది. కమిషన్‌ ముందు 14 మంది పంప్‌హౌస్‌ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పలువురు ఇంజినీర్లు హాజరయ్యారు. పూర్తి కథనం

3. ఆ విషయంలో హర్భజన్‌ సింగ్ తప్పును అంగీకరించాడు: పాక్‌ మాజీ క్రికెటర్

ఇంగ్లాండ్‌ వేదికగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం (జులై 6న) పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 68 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ (Harbhajan Singh), పాక్ మాజీ వికెట్‌కీపర్‌ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) ముఖాముఖిగా ఎదురుపడ్డారు. పూర్తి కథనం

4. డబ్బులిస్తామని కిడ్నీ మాయం చేసిన వైనం.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు

విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్‌ ముఠా మోసాలు వెలుగుచూశాయి. బాధితులు సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు. బాధితుడు గుంటూరుకు చెందిన మధుబాబు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు.  పూర్తి కథనం

5. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతిపాదిత షెడ్యూల్ విడుదల.. భారత్‌-పాక్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

పాకిస్థాన్‌ వేదికగా వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy 2025) జరగనుంది. ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఐసీసీకి పాక్‌ క్రికెట్ బోర్డు అందజేసింది. అయితే, ఈ డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌కు బీసీసీఐ నుంచి ఇంకా సమ్మతి రాలేదు.  పూర్తి కథనం

6. జెరోదాలో మళ్లీ సాంకేతిక సమస్య.. సోషల్‌ మీడియా వేదికగా యూజర్ల అసహనం!

ప్రముఖ స్టాక్‌ బ్రోకరేజ్‌ ప్లాట్‌ఫామ్‌ జెరోదాలో (Zerodha) మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ దృష్టికి తీసుకెళ్లేందుకు సోషల్‌ మీడియా వేదికగా తమ అసహసనాన్ని వెలిబుచ్చుతున్నారు. పూర్తి కథనం

7. 15 నిమిషాలు.. ఒకే వ్యక్తి.. రెండుసార్లు మంత్రిగా ప్రమాణం!

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. ఇటీవల భాజపాలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో చోటు కల్పించింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సమయంలో జరిగిన ఓ చిన్నతప్పిదం కారణంగా రామ్‌నివాస్‌ రావత్‌ (Ramniwas Rawat) రెండుసార్లు మంత్రిగా ప్రమాణం చేయాల్సి వచ్చింది.  పూర్తి కథనం

8. ఓ ప్రైవేటు వ్యక్తి కోసం రాష్ట్రానికి ఎందుకంత ఆసక్తి? - సుప్రీం

సందేశ్‌ఖాలీలో చోటుచేసుకున్న అరాచకాలు, భూకబ్జాల ఆరోపణలపై సీబీఐ విచారణ చేయాలంటూ కలకత్తా హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను భారత సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేయడంపై మండిపడిన న్యాయస్థానం.. సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తుందని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. పూర్తి కథనం

9. బల పరీక్షలో నెగ్గిన హేమంత్‌ సోరెన్

అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన బల పరీక్షలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌ (Hemant Soren) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించింది. 81 మంది చట్టసభ సభ్యులకు గానూ 45 మంది ఆయనకు అనుకూలంగా ఓటేశారు. ఈ ఓటింగ్ జరుగుతోన్న సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి. పూర్తి కథనం

10. నెపోలియన్‌ తుపాకుల వేలం.. ధర ఎంతంటే..?

ఐరోపా చరిత్రపై తిరుగులేని ముద్ర వేసిన ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌ బోనాపార్టే (Napoleon Bonaparte)కు చెందిన అరుదైన వస్తువులు వేలం వేశారు. వీటిల్లో రెండు పిస్తోళ్లు ఉన్నాయి. వీటిల్లో ఒకటి తన ఆత్మహత్యకు వినియోగించాలని నెపోలియన్‌ భావించాడు. వీటిని వేలం వేయగా 1.69 మిలియన్‌ యూరోలకు అవి అమ్ముడుపోయాయి.  పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని