Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Jun 2024 20:54 IST

1.భాజపా జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ఇన్‌ఛార్జిగా కిషన్‌ రెడ్డి

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు భాజపా ఇన్‌ఛార్జులను నియమించింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ తరఫున ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతల్ని పలువురు కేంద్రమంత్రులు, సీనియర్‌ నేతలకు అప్పగించింది. ఇందులోభాగంగా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌కు భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నియమించింది. పూర్తి కథనం

2.విశాఖలో రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నలకు ఘన స్వాగతం

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు విశాఖలో ఘన స్వాగతం లభించింది. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో వీరు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో తెదేపా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. పూర్తి కథనం

3. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం, షేక్‌పేట, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో జోరుగా వర్షం పడింది. పూర్తి కథనం

4.బస్టాండ్‌లో గర్భిణికి కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది.. సీఎం అభినందనలు

కరీంనగర్ బస్ స్టేషన్‌లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్‌ఆర్టీసీ మహిళా సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు సీఎం ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు. పూర్తి కథనం

5. ఆ సినిమా ఫలితం తర్వాత వారం రోజులు ఎంజాయ్‌ చేశా: రామ్‌చరణ్‌

ప్రస్తుతం కెరీర్‌తో పాటు.. ఫ్యామిలీ టైమ్‌ను కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ (Ram Charan). కుమార్తెతో సమయం గడుపుతూనే సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చరణ్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.  పూర్తి కథనం

6. అభిమాని సూసైడ్‌.. అలా ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదన్న సోనాలి

ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి సోనాలి బింద్రే (Sonali Bendre). కొంతకాలం నటనకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్‌ కల్చర్‌ గురించి మాట్లాడారు.  పూర్తి కథనం

7. మరో కొత్త రకం స్కామ్.. అడ్వర్టైజ్‌మెంట్‌ పేరుతో ₹81 లక్షలకు టోకరా!

అమాయకుల నుంచి డబ్బులు కొట్టేసేందుకు సైబర్‌ నేరగాళ్లు (Cyber fraudsters) కొత్త కొత్త పంథాల్ని అనుసరిస్తున్నారు. ఒకతరహా స్కామ్ గురించి ప్రజల్లో అవగాహన రాగానే.. మరో కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నారు.  పూర్తి కథనం

8. క్రికెట్‌లో మా ప్రాభవం తగ్గుతోంది.. పీసీబీ లుక్కేయాలి: పాక్‌ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌

టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) నుంచి పాకిస్థాన్‌ లీగ్ స్టేజ్‌లో నిష్క్రమించింది. తన చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై కష్టంగానే గెలిచింది. తమ టీమ్‌ కనీసం సూపర్-8కి కూడా అర్హత సాధించకపోవడంపై మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారత్, యూఎస్‌ఏ చేతిలో ఓటమితో పాక్‌కు అవకాశాలు గల్లంతయ్యాయి. పూర్తి కథనం

9. క్రోమ్‌లో కొత్త సదుపాయం.. ఆండ్రాయిడ్ యూజర్లు ఇక వెబ్‌ పేజీలు వినొచ్చు

 ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ (Google) తన క్రోమ్‌ బ్రౌజర్‌లో (Google chrome) కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం ‘లిజన్‌ టు దిస్‌ పేజ్‌’ (Listen to this page) ఫీచర్‌ను జోడించింది. దీనిద్వారా మీకు నచ్చిన వెబ్‌ పేజీలోని టెక్ట్స్‌ను ఇక ఆడియో రూపంలో వినొచ్చు.  పూర్తి కథనం

10. స్పీకర్ పదవిపై ఉత్కంఠ.. తమ దగ్గరే ఉండాలనుకుంటున్న భాజపా..!

ఈ నెల 24 నుంచి 18వ లోక్‌సభ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ సందర్భంగా నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో ఆ స్థానంలో కూర్చునే వ్యక్తి ఎవరా అనే చర్చ నడుస్తోంది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని