Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Jun 2024 17:01 IST

1. అక్రమ కేసులు రద్దు చేయాలి: లోకేశ్‌కు సీపీఎస్‌ ఉద్యోగుల విజ్ఞప్తి

మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు నిర్వహిస్తోన్న ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న అనేక సమస్యలపై తనకు పూర్తిస్థాయి అవగాహన వస్తోందని ఆయన ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించారు. పూర్తి కథనం

2. ఐటీఐలను ఆధునికీకరిస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధి అంశాలే కీలకంగా మారాయి. నిరుద్యోగ యువతకు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఐటీఐలను ప్రక్షాళన చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు వాటిని అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేయాలనే నిర్ణయించాం.  పూర్తి కథనం

3. డిప్యూటీ సీఎం పవన్‌కు అమరావతిలో ఘనస్వాగతం

అమరావతిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు రాజధాని ప్రాంత రైతుల నుంచి ఘన స్వాగతం లభించింది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వద్దకు వాహనశ్రేణి చేరుకోగానే భారీ గజమాలతో పవన్‌ను సత్కరించారు. వెంకటపాలెం నుంచి మందడం వరకు దారి పొడవునా పూలు చల్లుతూ నీరాజనాలు పలికారు.  పూర్తి కథనం

4. గత ప్రభుత్వ తప్పిదాలపై క్రిమినల్‌ చర్యలకూ వెనుకాడొద్దు: కోదండరాం

భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. బీఆర్కే భవన్‌లో కమిషన్‌ కార్యాలయానికి తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, విద్యుత్‌శాఖ అధికారి రఘు వచ్చారు. ఇద్దరి వద్ద కమిషన్‌ వివరాలు అడిగి తెలుసుకుంది. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. పూర్తి కథనం

5. దాని నుంచి బయటకు రావాలనుకుంటున్నా: బాబీ దేవోల్‌

 ‘యానిమల్‌’ సినిమాతో అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యారు బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ (Bobby Deol). ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా మారారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్రమత్తంగా లేకపోతే ఇక్కడ అందరూ సలహాలిస్తుంటారని పేర్కొన్నారు.  పూర్తి కథనం

6. రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా.. తొలి ఇండియన్ సినిమాగా రికార్డు

ప్రభాస్‌ హీరోగా నాగ్‌అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది.  విడుదల నేపథ్యంలో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ చిత్రం రికార్డులను సొంతం చేసుకుంటుంది. ప్రీ బుకింగ్స్‌లో హవా చూపిస్తోంది. పూర్తి కథనం

7. 5 రోజుల వ్యవధిలో 3 మ్యాచ్‌లు.. భారత్ కెప్టెన్‌ రోహిత్ కీలక వ్యాఖ్యలు

టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) భారత్ సూపర్-8 పోరును అఫ్గానిస్థాన్‌తో (IND vs AFG) గురువారం నుంచి ప్రారంభించనుంది. ఇప్పటివరకు యూఎస్‌ఏ పిచ్‌లపై ఆడిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు విండీస్‌ వేదికగా జరిగే మ్యాచుల్లో తలపడనుంది. ఐదు రోజుల వ్యవధిలో మూడు మ్యాచులు ఆడటంపై కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పందించాడు. పూర్తి కథనం

8. ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు సూచీలు.. 23,500 ఎగువన ముగిసిన నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 77,367 పాయింట్లు, నిఫ్టీ 23,579 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకాయి. పూర్తి కథనం

9. నీట్ వివాదంపై ప్రధాని మౌనంగా ఎందుకున్నారు?

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)పై మంగళవారం విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా నీట్‌ (NEET)  పరీక్షపై విద్యార్థులు, విపక్షాలు ధర్నాలు చేస్తున్నా ప్రధాని ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. నీట్ పరీక్ష విషయంలో మౌనం వహిస్తున్న ప్రధానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ తమ గళాన్ని వినిపిస్తుందన్నారు.  పూర్తి కథనం

10. నేను ఆమెలా ఉంటా.. అందుకే బాలీవుడ్‌లో అవకాశాలు: తాప్సీ

‘ఝుమ్మంది నాదం’ (Jhummandi Naadam) చిత్రంతో తెరంగేట్రం చేసి.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసింది తాప్సీ (Taapsee Pannu). ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసి ఇప్పుడు దూరమైంది. ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది. అక్కడ అన్ని అవకాశాలు రావడానికి గల కారణమేంటో స్వయంగా తాప్సీనే వెల్లడించింది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని