Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 19 Jun 2024 17:00 IST

1. జగన్ నిర్లక్ష్యం వల్లే అనిశ్చితిలోకి పోలవరం ప్రాజెక్టు: మాజీ మంత్రి దేవినేని ఉమ

జగన్ అవినీతి, నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు అనిశ్చితిలోకి వెళ్లిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. వైకాపా హయాంలో పనిచేసిన మంత్రులు తమకు అసలు ప్రాజెక్టు కట్టే తీరే అర్థం కాలేదని చెప్పడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. పూర్తి కథనం

2. జగనన్న కాలనీలకు నిధులన్నీ కేంద్రానివే: మంత్రి కొలుసు పార్థసారథి

జగన్ ప్రభుత్వంలో పథకాలన్నీ నేతి బీరకాయ తరహాలోనే అమలయ్యాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో 26 లక్షల ఇళ్లలో కేవలం 6 లక్షలు మాత్రమే నిర్మించారని తెలిపారు. పూర్తి కథనం

3. రాజధాని అమరావతిలో నిర్మాణాలను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి ఉదయం 11 గంటలకు పర్యటన ప్రారంభం కానుంది. 2015 అక్టోబరు 22న ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన  ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. పూర్తి కథనం

4. మీకు కమెడియన్‌గా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది: హరీశ్‌ శంకర్‌

ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సామాజిక మాధ్యమాల వేదికగా జరిగే విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు తగినవిధంగా స్పందిస్తారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar). ఆ కౌంటర్‌ ఎలా ఉంటుందంటే ఎన్‌కౌంటర్‌ రేంజ్‌లో ఉంటుంది. పూర్తి కథనం

5. ‘RC16’పై అప్‌డేట్‌ ఇచ్చిన దర్శకుడు.. కథ అద్భుతమన్న విజయ్‌ సేతుపతి

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘RC16’గా ఇది ప్రచారంలో ఉంది. అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించి చాలా రోజులైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రంపై దర్శకుడు తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు.  పూర్తి కథనం

6. టీమ్‌ఇండియా కోచ్‌గా గంభీర్‌తో పోటీ.. రామన్‌ ఎక్స్‌ పోస్టు ఎవరి కోసం?

టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ నియామకం త్వరలోనే జరగనుంది. ఈ పోస్టు కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే విషయాన్ని బీసీసీఐ తెలపలేదు కానీ, మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌, భారత మహిళా జట్టు కోచ్‌గా పనిచేసిన డబ్ల్యూవీ రామన్‌లను మాత్రమే ఇంటర్వ్యూకు పిలిచింది.  పూర్తి కథనం

7. ఆరంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు ఆద్యంతం అదే జోరును కొనసాగించలేకపోయాయి.  పూర్తి కథనం

8. నిను వీడని నీడను నేనే: భర్తను చంపేందుకు ప్లాన్‌-ఏ, బీ అమలు..!

ఆమె ఓ పరాయి మగాడి మోజులో పడింది.. ఆ బంధానికి అడ్డంగా మారాడని భర్తను చంపాలనుకొంది. ఓ సారి ప్లాన్-ఏ అమలు చేసింది.. కానీ, భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక లాభం లేదని ప్లాన్‌-బీ అమలు చేసి హత్య చేయించింది. చివరికి అనుమానాస్పద ప్రవర్తనే ఆమె నేరాన్ని పోలీసులకు పట్టించింది.  పూర్తి కథనం

9. అమెజాన్‌ ఆర్డర్‌ పార్సిల్‌లో పాము..వీడియో వైరల్‌

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో భాగంగా అమెజాన్‌(Amazon)లో Xbox కంట్రోలర్‌ను ఆర్డర్‌ చేసిన ఓ జంటకు భయంకరమైన అనుభవం ఎదురైంది. బెంగళూరు (Bengaluru)కు చెందిన ఓ జంట తమకు వచ్చిన అమెజాన్‌ ఆర్డర్‌ను విప్పడానికి ప్రయత్నించగా అందులోంచి పాము(cobra) బయటకు రావడంతో వారు భయాందోళన చెందారు. పూర్తి కథనం

10. తైవాన్‌ చేతికి 1,000 అమెరికా సాయుధ డ్రోన్లు..!

తైవాన్‌(Taiwan)కు భారీ సంఖ్యలో సాయుధ డ్రోన్లు విక్రయించాలని అమెరికా నిర్ణయించింది. ఇప్పటికే ఆమోదముద్ర వేసిన విక్రయ డీల్‌లో ఇవి ఉన్నాయి. వీటి సంఖ్య 1,000 వరకూ ఉండొచ్చు. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాను ముప్పతిప్పలు పెట్టిన ఈ డ్రోన్లు తాజాగా తైవాన్‌ చేతికి అందనుండటం విశేషం.  పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని