Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Jun 2024 17:02 IST

1. తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంక.. ప్రచారానికి దీదీ..!

రానున్న లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ(Priyanka Gandhi) వయనాడ్‌(Wayanad) నుంచి రాజకీయ అరంగేట్రం చేయనున్నారని ఇటీవల కాంగ్రెస్‌(Congress)  ప్రకటించింది. ఇందులోభాగంగా ప్రియాంకకు మద్దతుగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) వయనాడ్‌లో ప్రచారం చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తుండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పూర్తి కథనం

2. ఉస్మానియాలో కళ్లకు గంతలతో జూనియర్‌ వైద్యుల నిరసన

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా మెడికల్‌ కళాశాల జూనియర్‌ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకొని నినాదాలు చేశారు. పూర్తి కథనం

3. ఏపీ, తెలంగాణలోని వ్యాపారవేత్తలకు డ్రగ్స్‌ సరఫరా.. పోలీసుల అదుపులో నిందితుడు

మాదాపూర్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్‌ తీసుకొస్తున్న సాయిచరణ్‌ని టీజీ న్యాబ్‌, మాదాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చే ట్రావెల్స్‌ డ్రైవర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు  గుర్తించారు. పూర్తి కథనం

4. సోనాక్షి పెళ్లి సందడి షురూ.. మెహందీ వేడుక ఫొటో వైరల్‌

బాలీవుడ్‌ నటులు సోనాక్షి సిన్హా (Sonakshi Sinha)- జహీర్‌ ఇక్బాల్‌ (Zaheer Iqbal) పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఆ రూమర్స్‌పై ఇద్దరూ ఇప్పటివరకూ స్పందించలేదు. పూర్తి కథనం

5. ‘‘ఆప్షన్లు ఎక్కువ ఉండటం మంచిదే.. కానీ ఫైనల్‌ XI ఎంపికే కీలకం’’

పొట్టి కప్‌ను నెగ్గాలంటే అన్ని విభాగాలూ బలంగా ఉండాలని భారత మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్ (Sanjay Manjrekar) వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం భారత్‌ జట్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఆప్షన్లు ఎక్కువగా ఉన్నాయని.. సరైన తుది జట్టును ఎంపిక చేసుకుంటే కప్‌ను నెగ్గడం పెద్ద కష్టమేం కాదని తెలిపాడు.  పూర్తి కథనం

6. ఆంటిగ్వాలో నేను ఇలా.. రవిశాస్త్రి పోస్టు వైరల్‌

భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇవాళ ఆంటిగ్వాలోని వివ్‌ రిచర్డ్స్‌ మైదానంలో భారత్ - బంగ్లాదేశ్‌ జట్ల మధ్య సూపర్‌-8 పోరు జరగనుంది. అయితే, రవిశాస్త్రి లగేజీ ఇంకా ఆంటిగ్వా చేరుకోలేదు. దీంతో బాత్‌రోబ్‌ను ధరించిన అతడు.. టిఫిన్‌ చేస్తున్న ఇమేజ్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. పూర్తి కథనం

7. ఇకపై లైవ్‌స్ట్రీమ్‌ ప్రారంభించాలంటే సబ్‌స్క్రిప్షన్‌ ఉండాల్సిందే..! ‘ఎక్స్‌’లో కీలక మార్పు

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు (Elon Musk)కు చెందిన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’.. తన ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకొనే పనిలో పడింది. అందులోభాగంగా త్వరలో కొత్త మార్పును తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇకపై లైవ్‌స్ట్రీమ్‌ను ప్రారంభించాలంటే కచ్చితంగా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉండాలని పేర్కొంది.  పూర్తి కథనం

8. రక్షణ సహకారంపై విస్త్రృత చర్చ.. షేక్‌ హసీనా, మోదీ కీలక భేటీ

దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వెల్లడించారు. రెండు రోజుల భారత్‌ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా (Sheikh Hasina)తో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పూర్తి కథనం

9. స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి బయటకురాగానే కుప్పకూలి.. బాలుడి మృతి

 ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ బాలుడు ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోయాడు. స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే కుప్పకూలి చనిపోయాడు. పూర్తి కథనం

10. తిరుగు ప్రయాణంలోనూ సునీతా విలియమ్స్‌కు తిప్పలు.. ఇంకా అంతరిక్ష కేంద్రంలోనే..!

సాంకేతిక సమస్యల కారణంగా పలుమార్లు వాయిదాపడిన తర్వాత ఎట్టకేలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams). ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు ప్రయాణించిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక జూన్‌ 5న ఐఎస్‌ఎస్‌ (ISS)కు చేరుకున్న సంగతి తెలిసిందే. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని