Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 20 Jun 2024 17:01 IST

1. కొత్త బొగ్గు గనులు దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుంది: భట్టి

కొత్త బొగ్గు గనులు దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బొగ్గు గనులకు కేంద్రం వేలంపాట నిర్వహించనుంది. పూర్తి కథనం

2. వైకాపా ప్రభుత్వం ఒక్క బస్సూ కొనలేదు.. రిపేర్లూ చేయలేదు: మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి

నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విజయవాడ బస్టాండ్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  పూర్తి కథనం

3. వైకాపా నేత పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రోజు మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు మరో 3 కేసులను పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేశారు.  పూర్తి కథనం

4. 21వ శతాబ్దపు టాప్‌-25 చిత్రాల్లో రజనీ మూవీకి చోటు

రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా పా.రంజిత్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ డ్రామా ‘కాలా’ (Kalaa Movie). 2018లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, పా.రంజిత్‌ టేకింగ్‌, విజువల్స్‌, అధికారం కోసం ఉన్నత, అణగారిన వర్గాల మధ్య జరిగే పోరును రియలిస్టిక్‌గా చూపించారు. పూర్తి కథనం

5. ఆ బాలీవుడ్‌ హీరోతో గోపిచంద్‌ మలినేని సినిమా.. హీరోయిన్‌ ఎవరంటే!

టాలీవుడ్‌ డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని (Gopichand Malineni)కొత్త సినిమా ప్రకటించారు. బాలీవుడ్‌ హీరో సన్నీ దేవోల్‌తో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను (SDGM) రూపొందించనున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు.  పూర్తి కథనం

6. ‘‘ఒక్కసారి విరాట్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తే..’’

టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) భారత్‌కు ఉన్న ఏకైక ఆందోళన విరాట్ కోహ్లీ ఆటతీరు గురించే. ఐపీఎల్‌లో అదరగొట్టిన అతడు ఈసారి మాత్రం ఘోరంగా విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. పూర్తి కథనం

7. జపాన్‌లో ఓ తోటమాలి విలువైన పాఠం నేర్పాడు: ఎన్విడియా సీఈవో

జీవితంలో ఏదో ఒక దశలో ఎవరో ఒకరి నుంచి మనం స్ఫూర్తి పొందుతుంటాం. వారు మనకు తెలిసిన వాళ్లే అయిఉండనవసరం లేదు. తెలియకుండానే వారి మాటలు మనలో సానుకూల మార్పు తీసుకొస్తాయి. కొత్తగా ఆలోచించేలా ప్రేరేపిస్తాయి. మనం నిజంగా దేనిపై దృష్టి పెట్టాలో నేర్పుతాయి.  పూర్తి కథనం

8. యూజీసీ నెట్‌ పరీక్షకు త్వరలోనే కొత్త తేదీ: కేంద్ర విద్యాశాఖ

ఈ ఏడాది జరిగిన యూజీసీ నెట్‌ జూన్‌-2024 (UGC-NET) పరీక్షలో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర విద్యాశాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు.  పూర్తి కథనం

9. దేశానికి వడదెబ్బ.. 40వేల కేసులు.. దిల్లీలో 192 మంది నిరాశ్రయులు మృతి!

రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో అనేక రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదితోపాటు ఈశాన్య రాష్ట్రాలు అగ్నిగుండాలుగా మారాయి. ఈ క్రమంలో మార్చి 1 నుంచి జూన్‌ 18 మధ్యకాలంలో దాదాపు 40 వేల వడదెబ్బ అనుమానిత కేసులు, 110 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. పూర్తి కథనం

10. పుతిన్‌కు కిమ్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఏమిటో తెలుసా..?

రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin)కు ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) రిటర్న్‌గిఫ్ట్‌ ఇచ్చారు. అవేంటో తెలుసా..? పంగ్సన్‌ అనే వేటాడే శునకాలు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా సంస్థ కేసీఎన్‌ఏ వెల్లడించింది. పుతిన్‌, కిమ్‌ కలిసి తెల్లటి శునకాలను చూస్తున్న వీడియోను ప్రసారం చేసింది.  పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని