Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Jun 2024 17:00 IST

1. చెల్లితో రాజీ చేయాలని జగన్‌ తల్లిని కోరారు: భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

రాజంపేట వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి భాజపాలో చేరేందుకు అగ్ర నాయకత్వంతో టచ్‌లోకి వెళ్లారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. పూర్తి కథనం

2. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలగకుండా చూస్తాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

బొగ్గు గనుల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. సింగరేణిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. పూర్తి కథనం

3. హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో మూడురోజులు వానలే

హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతబస్తీ, రాయదుర్గం, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొత్తపేట, సరూర్‌నగర్‌, చంపాపేట్‌, సైదాబాద్‌, మాదన్నపేట్‌, మలక్‌పేట్‌, చాదర్‌ఘాట్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురిసింది.  పూర్తి కథనం

4. సీజనల్‌ వ్యాధుల కట్టడిపై డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్‌ వ్యాధుల కట్టడిపై అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ప్రశ్నలతో అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ సమావేశానికి వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌, పురపాలకశాఖ మంత్రి నారాయణ, సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు. పూర్తి కథనం

5. ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ద్వారకా తిరుమలరావు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. పూర్తి కథనం

6. సినీ తారల ‘యోగా’ ఫొటోలు.. రకుల్‌ప్రీత్‌ అలా.. మలైకా ఇలా

చాలామంది సినీ నటుల జీవితంలో యోగా ఓ భాగం. వారి ఫిట్‌నెస్‌కు అదో కారణం. తమ యోగా సెషన్‌కు సంబంధించిన ఫొటోలను అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటుంటారు. మరి, అంతర్జాతీయ దినోత్సవాన్ని వదిలేస్తారా? అభిమానులకు ‘యోగా డే’ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వారిలో మరోసారి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. పూర్తి కథనం

7. బంగ్లాతో పోరు.. గెలిస్తే భారత్‌ సెమీస్‌కే..!

టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) భారత్‌ జోరు కొనసాగుతోంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసిన టీమ్‌ఇండియా మరో కీలక పోరులో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన బంగ్లాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.  పూర్తి కథనం

8. ఇన్‌స్టా కొత్త ఫీచర్‌.. లైవ్‌స్ట్రీమ్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు మాత్రమే!

ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) మరో కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఇకపై లైవ్‌స్ట్రీమ్‌ను కేవలం క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు మాత్రమే అనుమతి ఇచ్చే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ‘క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఆన్‌ లైవ్‌’ పేరిట అందుబాటులోకి తెచ్చింది. క్లోజ్‌ ఫ్రెండ్స్‌ జాబితాలో యూజర్లు తమకు కావాల్సిన వారిని జత చేయడం లేదా తొలగించేందుకు అనుమతి ఉంటుంది. పూర్తి కథనం

9. మరో సమరానికి ఈసీఐ కసరత్తు.. జమ్మూకశ్మీర్‌ సహా 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

జమ్మూకశ్మీర్‌తో పాటు (jammu Kashmir) హరియాణా (Haryana), ఝార్ఖండ్‌ (Jharkhand), మహారాష్ట్ర(Maharashtra) శాసనసభ ఎన్నికల (Assembly Elections) నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది. ఆగస్టు 20 నాటికి ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తి చేసి తుది జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది. పూర్తి కథనం

10. రేప్‌, అక్రమ సంబంధాల కేసుల్లో అబార్షన్లకు ఓకే.. యూఏఈ చారిత్రక నిర్ణయం

మహిళలకు సంబంధించి కఠిన చట్టాలను అమలు చేసే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) ఈ మధ్య వారికి కొన్ని సడలింపులు కల్పిస్తోంది. మహిళల హక్కులు, వారి సాధికారత కోసం పలు సంస్కరణలు తీసుకొస్తూ లింగ సమానత్వం దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఆ దేశం గర్భవిచ్ఛిత్తి (Abortion)పై చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని