Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Jun 2024 17:00 IST

1. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా: జీవన్‌రెడ్డి

కాంగ్రెస్‌లో తాజా పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదనీ.. ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని వెల్లడించారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సిందంతా జరిగిందని వ్యాఖ్యానించారు. పూర్తి కథనం

2. మాజీ మంత్రి అనిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

వైకాపాకు చెందిన మాజీ మంత్రి అనిల్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన స్థలం కబ్జా చేశారని ఆరోపిస్తూ కౌసర్‌ జాన్‌ చిన్నబజార్‌ సీఐకు ఫిర్యాదు అందజేశారు.  నెల్లూరు భగత్‌సింగ్‌ కాలనీలోని తమ స్థలంలో వైకాపా ఆఫీసు కడుతున్నారని అందులో పేర్కొన్నారు. పూర్తి కథనం

3. హంద్రీనీవా కాల్వపనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి విచ్చేసిన చంద్రబాబుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పూర్తి కథనం

4. ఓటీటీలో మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇటీవల కాలంలో ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను ఓటీటీ వేదికలు మిగిలిన భాషల్లో అనువాదం చేసి అందుబాటులోకి తెస్తున్నాయి. గత కొన్ని నెలలుగా మలయాళంలో విజయవంతమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో మలయాళం మూవీ అందుకు సిద్ధమైంది. పూర్తి కథనం

5. కత్రినా కైఫ్‌ ప్రెగ్నెంట్‌ అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన టీమ్‌

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ప్రెగ్నెంట్‌ అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. వదులుగా ఉండే దుస్తులు వేసుకొని కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్‌ అంటూ నెటిజన్లు మరోసారి పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై కత్రినా (Katrina Kaif) టీమ్ స్పందించింది.  పూర్తి కథనం

6. ఎంపీగా రాహుల్‌ గాంధీ ప్రమాణం

18వ లోక్‌సభ (18th Lok Sabha) తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌.. సభ్యులతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. రాజ్యాంగం చిరు పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఆంగ్లంలో ఆయన ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. పూర్తి కథనం

7. అంతర్జాతీయ క్రికెట్‌కు డేవిడ్‌ వార్నర్‌ గుడ్‌బై

ప్రముఖ ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇప్పటికే  టెస్టు, వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన వార్నర్‌.. తాజాగా టీ20ల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.  పూర్తి కథనం

8. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా మరో బైక్.. ఇండియాకు రానున్న బ్రిటీష్‌ బ్రాండ్‌

దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో రెట్రో లుక్‌తో మోటార్‌ సైకిళ్లకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతానికి ఈ విభాగంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌దే హవా. ఈ విభాగంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు (Royal Enfield) గట్టి పోటీనిచ్చేందుకు వివిధ కంపెనీలు ఆతరహా మోడళ్లను తీసుకొస్తున్నాయి. పూర్తి కథనం

9. కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. బెయిల్‌పై హైకోర్టు స్టే

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో బెయిల్‌పై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు దిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ట్రయల్‌ కోర్టు మంజూరుచేసిన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది.  పూర్తి కథనం

10. జులైలో రష్యా పర్యటనకు మోదీ..!

ప్రధాని నరేంద్రమోదీ(Modi) జులైలో రష్యాలో పర్యటించనున్నారని సమాచారం. భారత్‌-రష్యా మధ్య వార్షిక చర్చల నిమిత్తం ఈ పర్యటన జరగనుంది. అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వర్గాలను ఉటంకిస్తూ రష్యా అధికారిక మీడియా సంస్థ వెల్లడించింది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని