Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...

Updated : 28 Jan 2023 17:02 IST

1. వివేకా హత్య కేసు.. సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. తొలిసారి సీబీఐ విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే 248 మంది వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. ఈ వాంగ్మూలాల ఆధారంగా.. ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలోని సీబీఐ బృందం అవినాష్‌ రెడ్డిని ప్రశ్నిస్తోంది. ఆయన తరఫు న్యాయవాదిని అధికారులు గదిలోకి అనుమతించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి: వైద్యులు

నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని బెంగళూరు హృదయాలయ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వర్గాలు తాజాగా ఆయన హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశాయి. తారకరత్నకు ప్రత్యేక బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌, ఇతర స్పెషలిస్ట్‌లు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వివేకా హత్య కేసు.. ఆ ఐదుగురికి హైదరాబాద్‌ సీబీఐ కోర్టు సమన్లు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణ హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో ప్రారంభమైంది. ఈ కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్‌లను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. వివేకా హత్య కేసుకు సీబీఐ కోర్టు ఎస్‌సీ/01/2023 నంబర్‌ కేటాయించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌, ఉమాశంకర్‌, దస్తగిరి, శివశంకర్‌ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మీకిష్టమైన బిర్యానీ దొరకలేదని.. ఇక రెస్టారంట్‌కు వెళ్లకుండా ఉంటారా..?: వాషింగ్టన్‌

న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లోనూ వాషింగ్టన్ సుందర్ రాణించినా విజయం మాత్రం టీమ్‌ఇండియా దరిచేరలేదు. అర్ధశతకం సాధించిన వాషింగ్టన్ సుందర్ (50) బౌలింగ్‌లోనూ కీలకమైన రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్ అనంతరం వాషింగ్టన్‌ సుందర్‌ మాట్లాడుతూ.. ఇదొక మ్యాచ్‌గానే పరిగణిస్తానని, ఓటమి నుంచి త్వరగా పాఠాలను నేర్చుకొంటామని చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మార్కెట్‌ మూడ్‌.. గత12 బడ్జెట్లకు సూచీల స్పందన ఇలా..!

బడ్జెట్‌ నాడు మార్కెట్‌ పల్స్‌ పట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. పార్లమెంట్‌లో పద్దు ప్రవేశపెట్టిన రోజు ఒక రకంగా స్పందించిన మార్కెట్లు.. కొద్ది రోజుల్లోనే పూర్తి భిన్నమైన దిశగా పయనించాయి. గత పదేళ్లలో తాత్కాలిక బడ్జెట్లతో సహా మొత్తం నలుగురు ఆర్థిక మంత్రులు 12 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. వీటిల్లో కేవలం ఆరు సార్లు మాత్రమే మార్కెట్‌ సూచీలు సానుకూలంగా స్పందించాయి. ఆ రోజుల్లో మార్కెట్లు చాలా తీవ్రమైన కుదుపులకు గురయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అన్ని హంగులున్న ‘వందే భారత్‌’లో చెత్తా చెదారం

వందేభారత్‌ రైళ్లలో పరిశుభ్రత లోపిస్తోంది. బోగీల్లో ఎక్కడిక్కడ వదిలేసిన వాటర్‌ బాటిళ్లు, ఆహార పదార్థాలు, పాలిథీన్‌ కవర్లు దర్శనమిస్తున్నాయి.  ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఈ సెమీ హైస్పీడ్‌ రైళ్లను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రయాణికులు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమ్మా.. అని దీనంగా కేకలేసినా..! కనికరించని పోలీసులు

అగ్రరాజ్యం అమెరికా(US)లో పోలీసుల తీరు మరోసారి తీవ్ర వివాదాస్పదమైంది. కొద్దిరోజుల క్రితం వారు ఓ యువకుడిపై హింసాత్మకంగా ప్రవర్తించడంతో అతడు మృతి చెందాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫుటేజ్‌ను అధికారిక వర్గాలు విడుదల చేయగా.. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. మృతుడు పేరు టైర్ నికోల్స్‌. ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ ఫెడ్‌ఎక్స్‌లో పనిచేసేవాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 30, 31 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయ్‌.. ఉద్యోగుల సమ్మె వాయిదా..

తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. జనవరి 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్‌ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ శనివారం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దిగ్గజాల వారసత్వాన్ని కొత్తవారు కొనసాగించడం కష్టమే: పద్మశ్రీ గురుచరణ్‌ సింగ్‌

ఎందరో క్రికెటర్లను తయారు చేసిన అనుభవం కోచ్‌ గురుచరణ్ సింగ్ సొంతం. అందుకే 87 ఏళ్ల వయస్సులో కేంద్ర ప్రభుత్వం గురుచరణ్‌ సింగ్‌కు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ క్రమంలో సీనియర్‌ కోచ్ పలు విషయాలపై స్పందించారు. చాలా మంది కోచ్‌లు తమ అకాడమీలలో శిక్షణ పొందిన కారణంగానే అథ్లెట్లు విజయం సాధించారనే క్రెడిట్‌ని తీసుకొంటారని.. ఇది సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అర్ష్‌దీప్‌ ఎనర్జీ అంతా అక్కడే వృథా అవుతోంది: భారత మాజీలు

గత సంవత్సరం తన సంచలన బౌలింగ్‌తో అదరగొట్టిన భారత యువ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్.. కొత్త ఏడాదిలో మాత్రం తడబాటుకు గురికావడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో నో బాల్స్ వేసి ఒక్కసారిగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లోనూ అర్ష్‌దీప్‌ భారీగా పరుగులు సమర్పించాడు. నాలుగు ఓవర్లలో ఒక వికెట్‌ తీసి 51 పరుగులు ఇచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని