Top Ten News @ 9 AM: బడ్జెట్ ప్రత్యేకం.. ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 02 Feb 2023 09:16 IST

1. సబ్బండ సంక్షేమం..అభివృద్ధి ఆవిష్కరణం

వేతనజీవులకు ఊరట కలిగిస్తూ.. ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తూ.. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తూ.. విద్యకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ.. ఆవిష్కరణలకు అందలమేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌ నగరంలోని మెజార్టీ వర్గాలను ఆకట్టుకుంది. ప్రత్యేకంగా హైదరాబాద్‌కు కేటాయింపుల వివరాలు వెల్లడి కాకపోయినా.. పద్దులో వివిధ విభాగాలకు కేటాయింపులు అవి భాగ్యనగరానికి ఏ మేరకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం.. పూర్తి  కథనం కోసం క్లిక్‌ చేయండి

2. రూ. కోట్ల బాటలో.. ఆశల పల్లకి!!

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బుధవారం ప్రవేశ పెట్టిన 2023-2024 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ అన్ని వర్గాల్లో ఆశలు నింపింది. ‘మౌలిక’ రంగానికి కేటాయింపుల వల్ల వివిధ కేంద్ర సంస్థలున్న విశాఖకు ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. పర్యాటక పరంగానూ ఎంతో ప్రయోజనం కలిగే అవకాశం ఉందంటున్నారు. పూర్తి  కథనం కోసం క్లిక్‌ చేయండి

3. ఓరుగల్లు ప్రగతికి సప్త స్వరాలు

కేంద్ర విత్తన పద్దును బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆర్థిక వృద్ధి ఏడు శాతం ఉంటుందనే అంచనాతోపాటు, పద్దులో ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి వాటిని ‘సప్తర్షి’గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఇది ఓరుగల్లు సప్త స్వరాల పద్దుగా అభివర్ణించొచ్చు. మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా  కీలక రంగాలకు కేటాయింపులు చేయడం వల్ల మన ప్రాంతానికి మేలు జరిగే అవకాశం ఉంది. పూర్తి  కథనం కోసం క్లిక్‌ చేయండి

4. మనకు దక్కిందేమిటి?

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లా వాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపుపై ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, పీఎం ఆవాస్‌ యోజన ప్రకటనపై ఇళ్లు నిర్మించుకునేవారు కొంత సంతృప్తికరంగా ఉన్నా.. భాగస్వామ్య వ్యాపారుల పన్ను పరిమితిని సడలించకపోవడం, వ్యవసాయానికి మరిన్ని నిధులు కేటాయించకపోవడంపై అసంతృప్తి గళం వినిపిస్తోంది. పూర్తి  కథనం కోసం క్లిక్‌ చేయండి

5. నిర్మలమ్మ కరుణ కొంతే!

ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లా ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.. దేశవ్యాప్తంగా అమలయ్యే వివిధ పథకాలు మినహా ప్రత్యేకంగా ఎలాంటి వరాలు దక్కలేదు.. వేతన జీవులకు ఆదాయ పన్ను పరిమితి పెంపుతో కొంత ఊరట లభించగా.. బడ్జెట్‌లో నేతన్నల ఊసే లేదు. రైల్వేలకు సంబంధించి కేటాయింపులపై స్పష్టత కొరవడటం.. ఐఐఐటీ, నవోదయ వంటి కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు ప్రకటనలు లేకపోవడం నిరాశ కలిగించింది. పూర్తి  కథనం కోసం క్లిక్‌ చేయండి

6. పర్యాటకం.. ప్రాధాన్యం

చిత్తూరు జిల్లా పంచాయతీ, వ్యవసాయం, కలెక్టరేట్‌, విద్య, నగరం : ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆధ్యాత్మికానికీ పర్యాటకానికీ అనువైన ప్రాంతం. కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 50 ప్రాంతాలను (గమ్యస్థానాలు) ఎంపిక చేసి అక్కడ స్థానిక, విదేశీ పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నాయి. పూర్తి  కథనం కోసం క్లిక్‌ చేయండి

7. సీతమ్మ మాట... ఇందూరుకు బాసట

ఆర్థిక మాంద్యం భయాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌లో కేంద్రం పెద్దగా జనాకర్షక పథకాల జోలికి వెళ్లకుండా మౌలిక వసతులు, మహిళా సాధికారతతోపాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చింది. ఆదాయ పన్ను చెల్లింపుల్లో మార్పులు చేయడం వేతనజీవులకు ఊరటనిచ్చింది. సహకార మార్కెటింగ్‌ను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. పూర్తి  కథనం కోసం క్లిక్‌ చేయండి

8. ఆక్వా రంగానికి ఊరట

జిల్లాలోని ప్రధాన రంగాల్లో ఆక్వా ఒకటి. రొయ్యల మేతలు, రసాయనాల ధరలు విపరీతంగా పెరిగి మార్కెట్లో రొయ్యల ధరలు పతనమై సాగుదారులు సంక్షోభంలో చిక్కుకుని కేంద్రం చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. రొయ్యల మేత తయారీకి ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని పది నుంచి పదిహేను శాతం తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పన్ను తగ్గింపు గురువారం నుంచి అమలులోకి రానున్నది. ఈ మేరకు రొయ్యల మేత ధరలు కంపెనీలు తగ్గిస్తే రైతులకు ప్రయోజనం ఉంటుంది. పూర్తి  కథనం కోసం క్లిక్‌ చేయండి

9. ఊరడించి.. ఉసూరుమనిపించె

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉమ్మడి జిల్లాలోని వివిధ వర్గాలకు కొంత ఆశాజనకంగానే ఉంది. వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో వీటికి బడ్జెట్‌లో నిధులు ఎక్కువగా కేటాయించడం రైతులకు ఊరట కలిగించే అంశం. సన్న, చిన్నకారు రైతులకు రుణాల పెంపు ఆసరాగా నిలవనుంది. మహిళా సంఘాలకు రుణాలు పెంచనుండటంతో ఆర్థిక స్వావలంబనకు బాటలు పడనున్నాయి. పాలమూరుకు ప్రత్యేక ప్రాజెక్టులు రాకపోవడం నిరాశకు గురిచేసింది. ప్రాజెక్టులు, విద్య రంగానికి ప్రత్యేక ప్రకటనలు ఉంటాయని ఆశించగా మొండిచెయ్యే చూపారు. పూర్తి  కథనం కోసం క్లిక్‌ చేయండి

10. సీతమ్మ పద్దులో సిరుల పంట

ఎన్నో ఆశలు, అంచనాల మధ్య కేంద్ర బడ్జెట్‌ 2023-24ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. సమ్మిళత అభివృద్ధి, చిట్టచివరి వ్యక్తికి సత్ఫలితాలు అందడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడి, హరిత వృద్ధి, ప్రజల శక్తి సామర్థ్యాలు వినియోగించుకోవడం, యువశక్తిని ప్రోత్సహించడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం వంటి ఏడు అంశాలు ప్రాధామ్యాలుగా బడ్జెట్‌ను పెట్టినట్లు ఆమె తెలిపారు. పూర్తి  కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని