Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 05 Feb 2023 09:01 IST

1. ‘అగ్నివీరుల’ నియామక ప్రక్రియలో మార్పు

భారత సైన్యంలో చేరేందుకు ఉద్దేశించిన అగ్నివీరుల నియామక ప్రక్రియ విధానం మారింది. గతంలో మాదిరి కాకుండా ఇకపై మొదట్లోనే ఆన్‌లైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (సీఈఈ) ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు భారత సైన్యం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి  నెలలోనే నియామక ప్రకటన జారీ చేయనున్నట్లు పేర్కొంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. వైద్య వీలునామా అంటే...

రోగులకు అనాయాస మరణాన్ని ప్రసాదించే విషయంలో వారు రాసుకునే వైద్య వీలునామాను ప్రామాణికంగా గుర్తించాలని సుప్రీంకోర్టు 2018 తీర్పు పేర్కొంది. దాని ప్రకారమే వైద్యం/ప్రాణాధార వ్యవస్థలు కొనసాగించాలో వద్దో నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొంది. గౌరవప్రదంగా మరణించే హక్కును గుర్తించింది. వైద్య వీలునామా ఎలా ఉండాలో ఆ తీర్పులో పేర్కొంది. అసలు వైద్య వీలునామా అంటే ఏంటో తెలుసుకుందామా..? పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. సెకండ్‌ ఒపీనియన్‌ కావాలా..?

కంటి సమస్యలుంటే నేత్ర వైద్యుడిని సంప్రదించడం... కీళ్లనొప్పులకు ఆర్థోపెడిక్‌ సర్జన్‌ దగ్గరకు వెళ్లడం... గుండెలో అసౌకర్యంగా ఉందనిపించినప్పుడు కార్డియాలజిస్టును కలవడం అందరూ చేసేదే. మరి సెకండ్‌ ఒపీనియన్‌ కావాలంటే... ఏముందీ ఇంకో డాక్టర్‌ని వెతుక్కోవడమే అంటారేమో.  ఆ కష్టాన్ని తగ్గించేస్తూ... కొన్ని ఆసుపత్రులూ, సంస్థలూ ప్రత్యేకంగా సెకండ్‌ ఒపీనియన్‌ సేవల్ని అందుబాటులోకి తెచ్చాయిప్పుడు. ఒక రోగికి ఉన్న సందేహాలన్నింటినీ తీర్చి సరైన పరిష్కారాల్నీ, ప్రత్యామ్నాయ మార్గాల్నీ సూచిస్తాయివి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. ఈసారి.. మండే కాలం?

వరుస ఎన్నికలతో దేశంలో పెరుగుతున్న రాజకీయ వేడికి ఈసారి వాతావరణం కూడా తోడయ్యేలా ఉంది. 2023లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కారణం- ఎల్‌ నినో! గత రెండున్నరేళ్లుగా సాగుతున్న లా నినా పోయి... మళ్లీ ఎల్‌ నినో ఈఏడాది రాబోతుండటమే ఇందుకు కారణం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. ఇప్పుడు గుర్తొచ్చామా సారూ.. ఎమ్మెల్యేని ప్రశ్నించిన మహిళ

ఎన్నికల ముందు ఇళ్ల పట్టాలిస్తామన్నామని చెప్పారూ.. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి.. ఇప్పుడు గుర్తొచ్చామా సార్‌ అంటూ సుల్తానాబాదు ఎస్సీ కాలనీకి చెందిన రమావత్‌ గాయత్రి అనే మహిళ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను ప్రశ్నించింది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఇక్కడ అరవైళ్ల నుంచి బీ ఫారాలతోనే ఉంటున్నారు కదా అని ఆయన అడిగారు. ఎన్నాళ్లు ఇలా ఉండమంటారు..? పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. కోడ్‌.. కుర్ర మనసు గెలిచెన్‌

పుస్తక పఠనం విజ్ఞానంతోపాటు వికాసానికి దోహదం చేస్తుంది. సృజనాత్మకంగా ఆలోచించేలా చేస్తుంది. అయితే ఈతరం పుస్తకాలు చదవడమే తగ్గిపోయిందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అందునా మొబైల్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ వచ్చాక గంటల తరబడి వాటిలోనే గడిపేస్తుండటంతో చదవడం అనేది మరింత తగ్గిపోయిందనేది అధ్యయనాలు చెబుతున్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో పుస్తక పఠనం పెంపొందించేందుకు రచయితలు, ప్రచురణకర్తలు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇవి క్రమంగా సత్ఫలితాలు ఇస్తున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. Crime News: ఎందుకు చంపావ్‌ నాన్నా?

పెళ్లికి పోయొద్దాం బిడ్డా అంటే.. ఎంతో ఆనందపడితిమి.. వెళ్లేటప్పుడు ఎన్నో ముచ్చట్లు   చెబితివి.. విందులో కొసరి కొసరి తినిపిస్తివి.. ఇంతలో ఏమైంది నాన్నా.. మమ్మల్ని ఇలా బావిలో తోసేస్తివి.. అప్పటివరకు మాతో ఆనందంగా గడిపిన నీకు మమ్మల్ని చంపాలని ఎందుకు అనిపించింది..  నా ముద్దుల పట్టీలు అంటూ గారాం చేసేవాడివి.. పెద్ద స్థాయికి చేరుకుంటరని అందరికీ చెబుతుండే నువ్వేనా.. ఈ పని చేసింది.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. కలిసిమెరిసి..

ఉద్యోగం, కుటుంబ బాధ్యతలతో నిత్యం తలమునకలయ్యే మహిళలకు విహారయాత్రలు ఊరట కలిగిస్తున్నాయి. ఖమ్మం నగరంలోని కొంతమంది అతివలు బృందాలుగా ఏర్పడి ఎంచక్కా పర్యాటక ప్రదేశాలను చుట్టేసి వస్తున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా స్వీయవిశ్వాసంతో భారతదేశంలోని ప్రసిద్ధ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. నేపాల్‌, సింగపూర్‌, దుబాయ్‌ ప్రాంతాలకు సైతం వెళుతున్నారు. కలిసికట్టుగా ప్రయాణిస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. కుటుంబ విభజనా.. పెళ్లిపత్రిక తప్పనిసరి

హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ నుంచి కుటుంబాల విభజనకు అనుమతించిన ప్రభుత్వం.. ఇందుకు మ్యారేజి సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేసింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 20-30 ఏళ్ల క్రితం వివాహమైన వారిలో చాలామంది సర్టిఫికేట్ల కోసం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వివాహ ఆహ్వాన పత్రిక, పెళ్లినాటి ఫొటో, జనన ధ్రువీకరణ వంటివి సమకూర్చితే తప్ప స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మ్యారేజి సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. రాష్ట్ర బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లు!

తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఆదివారం ఉదయం 10.30కి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరగనుంది. వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చించి ఆమోదం తెలపనుంది. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది భారాస ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మంత్రివర్గంలో చర్చించి ఏ రంగానికెంత కేటాయించాలనేది నిర్ణయించనున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌ సుమారు రూ.3 లక్షల కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని