Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. బిర్లా సంస్థల్లో చేరాలని ఉందా?
దేశంలో ఇంజినీరింగ్ విద్యకు ప్రతిష్ఠాత్మకమైనవాటిలో బిర్లా విద్యాసంస్థలు ముఖ్యమైనవి. పిలానీ, గోవా, హైదరాబాద్‌ల్లో ఇవి బీఈ, బీఫార్మసీ, ఎమ్మెస్సీ కోర్సులు అందిస్తున్నాయి. ప్రవేశపరీక్ష బిట్‌శాట్ స్కోరుతో అవకాశం కల్పిస్తున్నాయి. ఏటా సుమారు మూడు లక్షల మంది ఈ సంస్థల్లో సీట్ల కోసం పోటీ పడుతున్నారు. ఇటీవలే ప్రకటన వెలువడిన నేపథ్యంలో పూర్తి వివరాలు... పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
2. 136 ఏళ్ల చరిత్రలో మన అమ్మాయి!
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ మూలాలున్న అప్సరా అయ్యర్ చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక ‘హార్వర్డ్ లా రివ్యూ (హెచ్‌ఎల్‌ఆర్)కి ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి ఇండియన్ అమెరికన్‌గా నిలిచింది. యేల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, మేథ్స్, స్పానిష్‌ల్లో బ్యాచిలర్స్, ఆక్స్‌ఫర్డ్ నుంచి ఎంఫిల్ పూర్తిచేసిన అప్సర ప్రస్తుతం హార్వర్డ్ లా స్కూల్‌లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్‌లో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
3. Hyderabad Traffic: హైదరాబాద్‌లో మరో 10 రోజులు ట్రా‘ఫికర్’
అంబులెన్స్‌లు గగ్గోలు పెడుతున్నాయి. వాహనదారులు అల్లాడిపోతున్నారు. రోడ్డు దాటేందుకు పాదచారులు వణకిపోతున్నారు. గమ్యం చేరేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఎటుచూసినా ట్రాఫిక్ జామ్‌లే. మూడ్రోజులుగా ముప్పుతిప్పలు పడుతున్న నగర ప్రజలకు మున్ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవనేలా పరిస్థితులు నెలకొన్నాయి. మంగళ, బుధవారాలు ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
4. జగనన్న ఇళ్లకు బీటలు
నున్నలోని జగనన్న లేఔట్‌లో ఇళ్లు బీటలు వారుతున్నాయి. ప్రభుత్వమే పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా.. పునాది స్థాయిలోనే వదిలేయడంతో వాటి గోడలు, పిల్లర్లు బీటలు వారుతున్నాయి. నున్న లేఅవుట్‌లోని నున్న లబ్ధిదారులు 760 మందికి, రామవరప్పాడుకు 600 మందికి ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాప్తాడు వైకాపా ఎమ్మెల్యేకు చెందిన సంస్థ ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
5. ఉపాధికి జనరిక్
జనరిక్ మందులు.. మధ్య, పేద తరగతి ప్రజలకు వరం. చాలా తక్కువ ధరకు లభిస్తాయి.. అయితే అవగాహన అంతంత మాత్రమే.. దుకాణాలు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. వీటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. షాపుల ఏర్పాటుకు సహకారం అందిస్తోంది. వీటి ద్వారా మహిళలకు ఉపాధి కల్పించాలని సరికొత్తగా అడుగులు వేస్తోంది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు స్త్రీ నిధి ద్వారా జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
6. ఫోన్ పోయిందా..హాయ్ అని వాట్సాప్ చేయండి..
మొబైల్ చోరీకి గురైందా..? ఆదమరుపులో ఎక్కడైనా వదిలేశారా..? ఎక్కడైనా పోగొట్టుకున్నారా..? ఇకపై కంగారు పడాల్సిన అవసరం లేదు. పోలీసుస్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేయాల్సిన పని లేదు. మీ సేవలో ఫిర్యాదు చేసిన రసీదు, ఫోన్‌కు సంబంధించిన వివరాలు దగ్గర పెట్టుకుని హెల్ప్ లేదా హాయ్ వాట్సాప్ సందేశం పంపితే చాలు.. మొత్తం మొబైల్ నుంచే ఫిర్యాదు చేయవచ్చు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
7. ఇక బలమిచ్చే బియ్యం
నిరుపేదలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించి వారిని ఆరోగ్యవంతంగా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం ఏప్రిల్ నుంచి ‘పోషకాలతో మిళితమైన బలవర్ధక బియ్యం’ ను పంపిణీ చేసేందుకు ( ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్) ఏర్పాట్లు చేస్తోంది. సంచార జాతులు, నిరుపేదలు ఎక్కువగా ఉండే జిల్లాలు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వం ప్రజాపంపిణీ ద్వారా ఈ ‘ పోషకాలతో మిళితమైన బలవర్ధక బియ్యం’ పంపిణీ చేస్తుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
8. TS EAMCET: ఇంటర్ ఫస్టియర్‌లో 70% సిలబస్ నుంచే ఎంసెట్ ప్రశ్నలు
రాష్ట్రంలో మే 7 నుంచి జరిగే ఎంసెట్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తారు. సెకండియర్‌లో మాత్రం 100 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. ఎంసెట్ రాయబోయే విద్యార్థులు 2021-22లో ఫస్టియర్ పరీక్షలు రాశారని, కరోనా కారణంగా అప్పుడు 70 శాతం సిలబస్‌తోనే వార్షిక పరీక్షలు నిర్వహించినందున ఎంసెట్‌లో ప్రథమ సంవత్సరంలో అదే సిలబస్ ఉంటుందన్నారు.
9. ‘మరుపు’ రానివ్వని మంచి అలవాట్లు
వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధులూ ముసురుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె, మెదడు జబ్బుల బారినపడే అవకాశాలుంటాయి. ఇవన్నీ నియంత్రణలో లేకపోతే మెదడులోని కొన్ని భాగాల్లో సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు. ఫలితంగా ప్రాణవాయువు సరిగా అందక మెదడు కణాలు బలహీనమవుతాయి. ఆ ప్రభావం జ్ఞాపకశక్తిపై పడి మతిమరుపునకు దారితీస్తుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
10. అదానీకి 60 ఎకరాలు
నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తుల నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు 250 ఎకరాల్ని లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో అదానీ సంస్థ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్, ఐటీ, బిజినెస్ పార్క్, స్కిల్, రిక్రియేషన్ సెంటర్ల ఏర్పాటుకు 60.29 ఎకరాల భూమిని వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ (వీటీపీఎల్)కు కేటాయించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Siddharth: రియల్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే
-
Crime News
Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై
-
Crime News
Crime News: దిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హత్య..!
-
Crime News
Nizamabad: ఇందల్వాయి టోల్ గేట్ వద్ద కాల్పుల కలకలం
-
Movies News
Kamal Haasan: ఆ రోజు వాళ్లెవ్వరూ నా మాటలు పట్టించుకోలేదు: కమల్ హాసన్