Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 09 Mar 2023 09:00 IST

1. ‘ఎడ్యుటైన్‌మెంట్‌’ అంటే? దీనితో ఎన్ని లాభాలో తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: గంటలతరబడి కూర్చుని ఒక వెబ్‌ సిరీస్‌ ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు గ్యాప్‌ లేకుండా చూసేస్తాం. నచ్చిన ఫ్రెండ్స్‌తో మాటలు మొదలుపెట్టి టైం ఎంతయ్యిందో కూడా తెలీకుండా కబుర్లలో మునిగిపోతాం. ఇలాంటి సమయాల్లో అస్సలు అలసట తెలియదు, ఎక్కడా బోర్‌ కొట్టదు... కానీ పుస్తకం తీస్తే మాత్రం అరగంటకోసారి ఆవులిస్తూ అవస్థలు పడతాం. అందుకే ఈ మధ్య లెర్నింగ్‌లో ఒక కొత్త పంథాను అనుసరిస్తున్నారు. నేర్చుకోవడాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాలనే ఉద్దేశంతో చాలాచోట్ల అనుసరిస్తున్న విధానమే ‘ఎడ్యుటైన్‌మెంట్‌’! మనమూ తెలుసుకుందామా? పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. అక్రమ అంతస్తుల్లో కాసుల వర్షం

నగరంలో ఎక్కడైనా అనధికార అంతస్తు నిర్మాణం జరుగుతుంటే కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురుస్తోంది. మహావిశాఖ నగరపాలక సంస్థకు మాత్రం నష్టం వాటిల్లుతోంది. నగరంలో 60శాతం వరకు అదనపు అంతస్తులు, అనుమతుల్లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లు అంచనా.. ఆయా నిర్మాణదారులతో కొందరు అధికారులు కుమ్మక్కవుతున్నారు. రూ.లక్షల్లో లంచాలు తీసుకుంటూ, స్థానిక ప్రజాప్రతినిధులకు వాటాలు పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. 5,903మందిలో మీరు చేరొద్దు

5,903.. ఈ సంఖ్య ఏంటని అనుకుంటున్నారా? జీవన్‌దాన్‌ ట్రస్టులో కిడ్నీ దాతల కోసం ఎదురు చూస్తున్న బాధితుల సంఖ్య. వివిధ కారణాలతో మూత్రపిండాలు పాడై కిడ్నీ దాత కోసం నిరీక్షిస్తున్నారు. తమ వంతు వచ్చేలోపు వీరిలో కొందరు తనువు చాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూత్రపిండాల వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. వేధిస్తున్న.. ఎడతెగని పొడిదగ్గు

తొలుత గొంతు నొప్పి.. ఆపై పొడిదగ్గు.. జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఫ్లూ జ్వరాలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జ్వరాలతో బాధపడుతూ కేజీహెచ్‌ మెడిసిన్‌ ఓపీ విభాగాలకు వస్తున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. మరణంవైపే.. మనసు పయనం

వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు దారుణ హత్యలకు దారితీస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవల ఇలాంటి హత్యలు కలవరపెడుతున్నాయి. ఒకప్పుడు జిల్లాలో రాజకీయ హత్యలు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం వివాహేతర సంబంధాలు, భూవివాదాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో కుటుంబ సభ్యులు దిక్కులేని వారుగా మారుతున్నారు. జీవితాలను చీకటిమయంగా మార్చుకుంటున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. ఫైబర్‌ నెట్‌కు ఆదరణేదీ?

పలమనేరు పట్టణంలో మొత్తం 12 వేల కుటుంబాలు ఉంటే.. అన్ని కుటుంబాలకూ ఈ నెట్‌ కనెక్షన్‌ అవసరం ఉంటుంది. అయితే కేవలం వందల్లోనే ఏపీ ఫైబర్‌ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన వారంతా ఇతర కంపెనీల నెట్‌ కనెక్షన్లతో బిల్లులు చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వం అన్ని ప్రాంతాల ప్రజల కోసం, రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నెట్‌ కనెక్షన్‌ ఇవ్వడానికి ఏపీ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. చాలా వరకు కనెక్షన్లు పొందిన ప్రజలు నెట్‌ సేవలను అందుకుంటున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ ఆదరణ మాత్రం ఈ పథకానికి అందలేదు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. జనాభా పెంచేందుకు చైనా అవస్థలు

చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా జననాలను పెంచేందుకు మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పెళ్లి సమయంలో వధువుకు పెళ్లి కుమారుడు సొమ్ము ముట్టజెప్పే సంప్రదాయాన్ని కట్టడి చేయడం మొదలుపెట్టింది. జననాల రేటు పతనాన్ని అడ్డుకునేందుకు చైనా అధికారులు ఈ సంప్రదాయంపై దృష్టి పెట్టారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. కిడ్నీ భద్రం సుమా!

మూత్రపిండాలు.. గట్టిగా పిడికెడంత పరిమాణంలో కూడా ఉండవు గానీ.. ఈ రెండూ మన శరీరంలో ఉన్న భారీ శుద్ధి కర్మాగారాల వంటివి. నిరంతరం రక్తం నుంచి మలినాలను వడబట్టేస్తూ.. మన శరీరంలో శుభ్రతా కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూనే ఉంటాయి. చక్కటి ఆరోగ్యంతో మన జీవితం సాఫీగా సాగిపోవాలంటే.. ఇవి సజావుగా పని చేస్తుండటం, వీటి వడపోత సమర్థంగా ఉండటం చాలా అవసరం. దీనిపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. ఒక ఛార్జింగుతో 40 కి.మీ.ప్రయాణం

టాటాల మద్దతు ఉన్న స్ట్రైడర్‌ సంస్థ సరికొత్త శ్రేణి ఇ-బైక్‌లను విడుదల చేసింది. 3 గంటల ఛార్జింగుతో 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించేందుకు అనువుగా లిథియం అయాన్‌ బ్యాటరీలను ఈ స్ట్రైడర్‌ జీటా ఇ-బైక్‌లకు అమర్చినట్లు పేర్కొంది. ఈ వాహన ధర రూ.31,999 కాగా, 20% రాయితీపై రూ.25,599కి విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ బైక్‌కు అమర్చిన 36వీ  250 వాటేజీ బీఎల్‌డీసీ మోటార్‌ నిశ్శబ్దంగా పనిచేస్తుందని వివరించింది. ఈ బైక్‌పై  ప్రయాణానికి ఖర్చు కిలోమీటరుకు 10 పైసలే అవుతుందని పేర్కొంది.

10. టిడ్కో.. ఆలస్యం ఎందుకో..?

ఉమ్మడి జిల్లాలు విజయనగరం, పార్వతీపురం మన్యంలోని టిడ్కో ఇళ్లను మార్చి నాటికి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ.. ఇప్పటి వరకు పూర్తయిన పరిస్థితి కనిపించలేదు. గత ప్రభుత్వం 300, 365, 430 చదరపు అడుగుల్లో గృహాలు నిర్మించాలని నిర్ణయించారు. వైకాపా ప్రభుత్వం 300 చ.అ ఇళ్లను లబ్ధిదారులకు రూ.1కే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని