Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. Oscars 2023: భారతీయ చిత్రానికి తొలి ఆస్కార్.. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’
ఇంటర్నెట్‌డెస్క్: 95వ అకాడమీ అవార్డుల (Oscars 2023) ప్రదానోత్సవంలో భారతీయ చిత్రం తొలి అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మనదేశం నుంచి నామినేట్ అయిన ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ (The Elephant Whisperers) ఆస్కార్‌ను దక్కించుకుంది. ఈ మేరకు దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్, నిర్మాత గునీత్ మోగ్న.. అవార్డులను అందుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. Oscars 2023: ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు
లాస్ ఏంజిల్స్: బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు..’ ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్ వేదికపై ఆర్ఆర్‌ఆర్ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అవార్డును అందుకున్నారు. తద్వారా ఆస్కార్ గెలిచిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్‌ఆర్, తొలి భారతీయ గీతంగా ‘నాటు నాటు’ చరిత్ర సృష్టించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. SSC Jobs: కేంద్రంలో 5369 కొలువులు
కేంద్రంలోని వివిధ శాఖలు, విభాగాల్లో పలు పోస్టుల నియామకానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన వెలువరించింది. ఆన్‌లైన్ పరీక్షలో చూపే ప్రతిభతో ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. కొన్ని పోస్టులకు అదనంగా స్కిల్ టెస్టు ఉంటుంది. పది, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అన్నదాతలకు రూ.5కే భోజనం
తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులకు రూ.5కే భోజన సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ఖరారు చేయనుంది. రాష్ట్రంలో 192 ప్రధాన మార్కెట్ యార్డులు, 87 ఉప యార్డులున్నాయి. వీటన్నింటికీ కలిపి సీజన్ సమయంలో రోజూ 8 వేల నుంచి 10 వేల మంది వస్తుంటారు. మార్కెట్ యార్డుల్లో ప్రస్తుతం భోజన సౌకర్యాలు లేవు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. భద్రాచలం.. ప్రసాదాల కౌంటర్‌లో వినూత్న మార్పు
భద్రాచలం రామాలయంలోని ప్రసాదాల కౌంటర్‌లో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. ఈ విభాగంలో తరచూ వివాదాలు తలెత్తడంతో పొరపాట్లకు ఆస్కారంలేని విధంగా ఈవో రమాదేవి తనదైన శైలి మార్పును చాటుతున్నారు. ప్రత్యేక ట్రేలను తెప్పించడంతో లెక్కల్లో పారదర్శకతకు మార్గం ఏర్పడింది. తయారీ విభాగం నుంచి కౌంటర్ వరకు లడ్డూలను పంపించే విధానంలో కీలక పరిణామం తీసుకోవడంతో సిబ్బంది సంతోషంగా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. భావోద్వేగాలతోనే బలవన్మరణం
నేటితరం విద్యార్థులు కొందరు చదువును ఇష్టంగా కాకుండా కష్టంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. మరికొందరు కన్నవాళ్లకు దూరంగా హాస్టళ్లలో ఉండలేక మనస్తాపం చెందుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో వారిలోని భయాలు, ఆందోళనలు పారదోలడం ముఖ్యం. ఒత్తిడితో కాకుండా, సానుకూల ధోరణిలో విద్యనభ్యసించేలా అవగాహన కల్పించడం కీలకం. పిల్లల భావోద్వేగాలను గుర్తించి, తదనుగుణంగా మసలుకోవడం మేలన్నది నిపుణుల సూచన. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. కోట్ల మంది భక్తులొస్తున్నా..కాటేజీలు లేవు..!
దుర్గగుడికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఒక్క రోజు ఆలయ ప్రాంగణంలో నిద్రించాలన్నా సరైన సౌకర్యాలు లేవు. ప్రధానంగా ఆలయానికి సమీపంలో ఒక్క కాటేజీ కూడా లేదు. గతంలో ఉన్న ఒకటో అరో కాటేజీలను కూడా ఇతర అవసరాల కోసం ప్రస్తుతం వినియోగిస్తున్నారు. తిరుపతి, సింహాచలం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, అన్నవరం సహా రాష్ట్రంలోని ఏ పెద్ద ఆలయాన్ని చూసినా వచ్చే భక్తుల కోసం భారీ సంఖ్యలో కాటేజీలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కదిలేనా.. కలగా మిగిలేనా!
పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ప్రజాభిప్రాయ సేకరణకే పరిమితమైంది. స్థల పరిశీలన, ప్రజాభిప్రాయ సేకరణ జరిగి రెండేళ్లు దాటిపోయినా పనుల్లో కదలిక కనిపించడం లేదు. దీని నిర్మాణం జరుగుతుందని సీఎం జగన్ ప్రచారం చేసుకోవడం తప్ప పనుల్లో అంగుళమైనా ముందుకెళ్లలేదు. విశాఖహార్బర్ తరవాత ఎక్కువ చేపలవేట సాగించే పూడిమడకలో మినీ హార్బర్ నిర్మాణానికి మత్స్యకారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఎన్నిక ఏదైనా నగరంలో ప్రత్యేకమే
తిరుపతిలో నాలుగేళ్లుగా జరుగుతున్న ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నిక ఏదైనా విజయం కోసం అధికార పార్టీ నాయకులు చేస్తున్న దొడ్డిదారి పనులు మేధావులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఎన్నికల ప్రకటన సమయం నుంచి తెరవెనుక జరిగే కుట్రలు ఎన్నికల ముందు రోజు వరకు బయటకు పొక్కనీయడం లేదు. అప్రజాస్వామికంగా జరుగుతున్న ఎన్నికల తీరుతో విద్యావంతులు కూడా పోలింగ్‌కు దూరం అవుతున్నారు. ఈ కారణంగా అత్యల్ప పోలింగ్ నమోదయ్యే అసెంబ్లీ నియోజకవర్గంగా తిరుపతి నిలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఒత్తిడితో సహవాసం.. అనారోగ్య జీవితం
అసలే పోలీస్ శాఖ. ఆపై తీరికలేనంత పనిభారం. సెలవులు తక్కువ. కేసుల పర్యవేక్షణ, నిందితుల వేటకే సమయమంతా ఖర్చు. ఫలితంగా శారీరక, మానసిక ఒత్తిళ్లు.... ఇవే పోలీసుల పాలిట శాపంగా మారుతున్నాయి. మిగతా వారితో పోల్చితే వీరిలో అనారోగ్యానికి గురయ్యేవారు అధికంగా ఉంటున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్లు, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వేర్వేరుగా చేపట్టిన పరిశీలనలో ఇదే విషయం తేటతెల్లమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR vs Bandi sanjay: ఉగాది వేళ.. కేటీఆర్, బండి సంజయ్ పొలిటికల్ పంచాంగం చూశారా!
-
Movies News
Guna Sekhar: సమంతను అలా ఎంపిక చేశా.. ఆ విషయంలో పరిధి దాటలేదు: గుణ శేఖర్
-
Crime News
TSPSC: నిందితుల కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు.. 40మంది టీఎస్పీఎస్సీ సిబ్బందికి సిట్ నోటీసులు
-
World News
Rent a girl friend: అద్దెకు గర్ల్‌ఫ్రెండ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్...
-
India News
దేవుడా.. ఈ బిడ్డను సురక్షితంగా ఉంచు: భూప్రకంపనల మధ్యే సి-సెక్షన్ చేసిన వైద్యులు..!
-
Politics News
AP News: ఎవరి అంతరాత్మ ఎలా ప్రబోధిస్తుందో?.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి