Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Mar 2023 09:05 IST

1. విశాఖలో భారీ వర్షం.. క్రికెట్‌ అభిమానుల్లో తీవ్ర నిరాశ

విశాఖలో భారత్‌-ఆస్ట్రేలియా(IND Vs AUS) మధ్య నేడు జరగనున్న రెండో వన్డేకు వరుణుడి అడ్డంకులు తప్పేలా లేదు. నగరంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. శుక్ర, శనివారం కురిసిన వర్షాలతో మ్యాచ్‌ జరగనున్న ఏసీఏ-వీడీసీఏ మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఆదివారం ఉదయం కూడా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటంతో క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అధికార పక్షానికి దిమ్మతిరిగే తీర్పు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఘోర పరాభవం ఎదురవడం, తెదేపా అనూహ్య విజయం సాధించడం రాజకీయ నేతల్లోనే కాదు.. మేధావులు, సామాన్యుల్లోనూ ఎన్నో విశ్లేషణలను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ.. ప్రతిపక్షాలనూ, ప్రశ్నించినవారినీ అక్రమ కేసులు, అరెస్టులతో భయపెడుతూ.. వైకాపా సాగిస్తున్న అరాచక పాలనకు ఈ తీర్పు చెంపపెట్టులా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రవీణ్‌కు పాస్‌వర్డ్‌ ఇచ్చిందెవరు?

సంచలనం రేకెత్తించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. 9మంది నిందితులను ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు. తొలిరోజు వీరిని హిమాయత్‌నగర్‌ సిట్‌ కార్యాలయంలో విచారించారు. ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు అనుసరించిన వ్యూహంపై ప్రశ్నించారు. కంప్యూటర్లలో భద్రపరచిన అంశాలను గుర్తించగలిగారు. వీరికి కార్యాలయంలో సహకరించిన ఉద్యోగులు ఎవరనే విషయమై కూపీ లాగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విజేతగా ప్రకటించినా.. డిక్లరేషన్‌ ఇవ్వడంలో జాప్యం

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి గెలుపొందారు. శనివారం రాత్రి 8 గంటలకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినా, అర్ధరాత్రి 12 గంటల వరకూ ధ్రువీకరణపత్రం అందించలేదు. దీనిపై ఆగ్రహించిన తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారు జేఎన్‌టీయూ గేటు ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సభ జరుగుతుండగా జగన్‌ దిల్లీ ఎందుకు వెళ్లారు?

‘సభ జరుగుతున్న సమయంలో సీఎం దిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లారు? రాష్ట్ర ప్రయోజనాల కోసమే పర్యటిస్తే వివరాలను సభ్యులకు తెలపాలి’ అని తెదేపా ఎమ్మెల్సీలు మండిపడ్డారు. దీనిపై శాసనమండలిలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని మండలి ఛైర్మన్‌ మోషేను రాజు తిరస్కరించడంతో పోడియంలోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు. ఛైర్మన్‌ వారించి.. మాట్లాడే అవకాశం ఇస్తాననడంతో తమ స్థానాల్లో కూర్చున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టీఎస్‌పీఎస్సీ పరీక్షల రీషెడ్యూలు

ప్రశ్నపత్రాల లీకేజీతో పలు పరీక్షలను రీషెడ్యూలు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. వేటిని రీషెడ్యూలు చేసే అవకాశముంది? వేటిని యథాతథంగా కొనసాగించవచ్చన్న విషయమై కసరత్తు చేస్తోంది. తక్కువ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షల్ని వీలైనంత త్వరగా ముగించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షల్ని టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఊబకాయులూ తస్మాత్‌ జాగ్రత్త!

సాధారణంగానే ఊబకాయుల్లో క్యాన్సర్‌ ముప్పు అధికం. దీనికితోడు నియంత్రణలో లేని అధిక రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండడం, నడుము చుట్టుకొలతలు తగ్గకపోవడం... వంటి జీవక్రియ రుగ్మతలు (మెటబాలిక్‌ సిండ్రోమ్‌) కూడా జతకూడితే... మహమ్మారి వచ్చే ముప్పు రెట్టింపు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, జీవక్రియ రుగ్మతలు రెండూ ఉన్న వారిలో ‘విజరల్‌ కొవ్వు కణజాలం (విజరల్‌ ఎడిపోస్‌ టిష్యూ) అధికంగా ఉంటుందనీ, ఇది క్యాన్సర్‌ కణాల వృద్ధికి కారణం అవుతుందని చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమెరికా వీడాల్సిందేనా..!

అమెరికాలో ఇటీవల ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బి వీసాదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వీసా గడువు సమయమైన (గ్రేస్‌పీరియడ్‌) 60 రోజుల్లో ఉద్యోగం దొరకక వేల మంది భారతీయ సాఫ్ట్‌వేర్‌ నిపుణులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. కుటుంబాలతో వీరంతా అమెరికాను వీడి రావాల్సిన పరిస్థితి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఈక్వెడార్‌, పెరూలో భారీ భూకంపం.. 14 మంది మృతి!

ఈక్వెడార్‌, పెరూలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు 14 మంది మృత్యువాతపడ్డారు. మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రిక్టర్‌ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. చాలా భవనాలు నేలమట్టం కాగా.. భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. తెలుగు రాష్ట్రాల నుంచి తొలి భారత్‌ గౌరవ్‌ రైలు 

 దేశంలోని విశిష్ఠ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు సికింద్రాబాద్‌ నుంచి తొలిసారిగా బయలుదేరిన ‘భారత్‌ గౌరవ్‌’ రైలును దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో ప్రయాణించే వారికి కూచిపూడి నృత్యకళాకారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఐఆర్‌సీటీసీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రజనీ హసిజా, ఇతర సీనియర్‌ రైల్వే అధికారులతో కలిసి జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ యాత్రికులకు స్వాగత కిట్‌లు అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని