Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 న్యూస్‌

Top News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని టాప్‌ పది వార్తలు

Updated : 19 Aug 2022 09:04 IST

1. త్వరలో అందరికీ ఈ-హాజరు

త్వరలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ ఆధారిత హాజరు (ఈ-హాజరు) నమోదు విధానాన్ని ప్రభుత్వం తీసుకురానుందని.. ఇందులో భాగంగా మొదట విద్యాశాఖలో దీన్ని అమల్లోకి తెచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉపాధ్యాయులంతా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా సెల్‌ఫోన్‌ పాఠశాలకు తీసుకురాలేకపోయినా ఇతరుల ఫోన్లలో హాజరు వేయొచ్చని, సిగ్నల్స్‌ లేకపోయినా ఆఫ్‌లైన్‌లో హాజరు వేస్తే నెట్‌వర్క్‌ వచ్చిన తర్వాత సర్వర్‌లో నమోదు అవుతుందని హామీ ఇచ్చారు.   మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. డిస్కంలకు షాక్‌

తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి జరిపే రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించింది. విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొన్న కరెంటుకు నిర్దేశిత వ్యవధిలో బిల్లులు చెల్లించలేదన్న కారణంతో ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ కారణంగా రెండు రాష్ట్రాల డిస్కంలు ఎక్స్ఛేంజీ ద్వారా విద్యుత్‌ కొనుగోలు, మిగులు విద్యుత్‌ అమ్మకాలకు శుక్రవారం అవకాశం ఉండదు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. మెట్రోకు ప్రత్యామ్నాయం నియో

 ‘నగరాల సమీపంలో వేగంగా జరుగుతున్న విస్తరణతో మున్ముందు వలసలు మరింత పెరుగుతాయి. జనాభాకు తగ్గట్టుగా ప్రజారవాణా సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. అయిదు నిమిషాల్లోనే ఏదో ఒక స్టేషన్‌ చేరుకునేలా ప్రజారవాణా వ్యవస్థను తీర్చిదిద్దుకోగల్గితే మున్ముందు ట్రాఫిక్‌, కాలుష్య సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. పాతికేళ్లలో హైదరాబాద్‌ను ప్రపంచ అగ్రశ్రేణి 20 నగరాల్లో ఒకటిగా చూడొచ్చు’ అని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. రూ.8 వేలిస్తే.. రూ.50 వేలు

జిరాక్స్‌ సెంటర్‌ మాటున నకిలీ కరెన్సీ ముద్రించి హైదరాబాద్‌ సహా వేర్వేరు నగరాల్లో చలామణి చేస్తున్న ముఠా గుట్టును నగర పోలీసులు ఛేదించారు. కర్ణాటక కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠాలోని ఇద్దరు సభ్యుల్ని ఎంజీబీఎస్‌ దగ్గర దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌, మీర్‌చౌక్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు హైదరాబాదీ ఉన్నారు. వీరినుంచి రూ.2.5 లక్షల(100, 200, 500, 2వేల నోట్లు) నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. అందరూ ఉన్నా ఒంటరితనాన్ని అనుభవించా

క్రీడాకారులు ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని, లేదంటే అది పతనానికి దారితీస్తుందని స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. తాను కెరీర్‌ను నిర్మించుకునే క్రమంలో మానసిక ఒత్తిడికి గురయ్యానని చెప్పాడు. ‘‘క్రీడ అథ్లెట్‌లోని ఉత్తమ ఆటను బయటకు తీసుకురాగలదు, నిరంతరం ఒత్తిడిలో ఆడటం వల్ల అది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చు. ఇది తీవ్ర సమస్య. దృఢంగా ఉండటానికి ఎంత ప్రయత్నించినా, కొన్నిసార్లు మానసిక ఒత్తిడి క్రీడాకారుడిని కుంగదీసే ప్రమాదముంది. నేనూ ఈ సమస్యతో బాధపడ్డాను. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. టిడ్కో..పేదలను బాదుకో!

పట్టణ మౌలిక వసతుల అభివృద్ది సంస్థ నిర్మిస్తున్న ఇళ్లు లబ్ధిదారులకు భారంగా మారాయి. ఇంటిని స్వాధీనం చేయకుండానే బ్యాంకులు వాయిదాలు కట్టమని ఒత్తిడి చేస్తున్నాయి. రుణం మంజూరైన నుంచి లెక్కించి వడ్డీ కట్టాలని తాఖీదులు ఇస్తూ వసూలు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు రూ.150కోట్ల వడ్డీ భారం లబ్ధిదారులపై పడింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. నిండా ముంచేసి..నిర్దయగా వదిలేసి

మురుగు పారదు.. ముంపు తొలగదు.. ఇళ్లలోంచి బయటకొచ్చే పరిస్థితి లేదు... బయట అడుగుపెట్టాలంటే యాతనే.. నివాసాల చుట్టూ ముక్కుపుటాలు అదిరిపోయే దుర్వాసన నిండిన నీరు. మోకాళ్లలోతు ముంపులో వీధి రహదారులు..  రాకపోకలకు నరకయాతన అనుభవించాల్సిందే.. ఒకపక్క దోమల బెడద.. మరోవైపు వెంటాడుతున్న అంటువ్యాధులు. ఇదీ హకుంపేట పరిధిలోని రామకృష్ణానగర్‌లోని కొన్ని ప్రాంతాలు, సావిత్రినగర్‌, నాగిరెడ్డి నగర్‌, ఆదర్శనగర్‌, బొమ్మూరు పంచాయతీ నేతాజీనగర్‌, ఆదర్శనగర్‌ తదితర కాలనీల్లోని పరిస్థితి. సరిగ్గా నెల రోజుల కిందట గోదావరికి వరదలు వచ్చినప్పుడు సుమారు పదిరోజులు ఈ కాలనీలన్నీ మురుగునీటితో నిండిపోవడంతో జనం పడవలపై ప్రయాణం సాగించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. విద్యుత్‌ వేగంతో దూసుకొస్తున్నాయ్‌

వీసమెత్తు పొగరాకుండా... ధడ్‌ధడ్‌మంటూ శబ్దాల్లేకుండా విద్యుత్‌ వాహనాలు దూసుకొస్తున్నాయ్‌... కాలుష్యానికి చెక్‌పెట్టేందుకు తప్పనిసరిగా ఈవీలు వినియోగించాలన్న నిబంధనలతో రహదారులపైకి వస్తున్న విద్యుత్‌ వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది ప్రథమార్థం ముగిసేసరికి బెంగళూరు నగరంలో 53వేల ఎలక్ట్రిక్‌ వాహనాలు రహదారులపైకి వచ్చేశాయి... రెండోస్థానంలో దిల్లీ ఉండగా.. ప్రజారవాణా, ప్రభుత్వ వినియోగానికి విద్యుత్‌ వాహనాలను వినియోగించడంలో కోల్‌కతా ముందుంది.. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. నగరంపైనా భద్రతా కవచం

ఆధునిక సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు  మహా నగరపాలక సంస్థ అడుగులేస్తోంది. ఆకర్షణీయ నగరం(స్మార్ట్‌ సిటీ) పథకం ద్వారా సుమారు రూ.90 కోట్లతో సమీకృత నిఘా నిర్వహణ కేంద్రం(ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌) ఏర్పాటు చేస్తున్నారు. బల్దియా నూతన కౌన్సిల్‌ హాల్‌ భవనంలో తాత్కాలికంగా అందుబాటులోకి తెచ్చారు. కమిషనర్‌ ఛాంబర్‌ భవనం రెండో అంతస్తులో శాశ్వతంగా ఈ  కేంద్రం పనులు మొదలయ్యాయి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. హంపీ చరితం.. చూడర సిత్రం..!

ఓ వెయ్యి పదాల భావం..ఒక్క చిత్రంలో చూపవచ్చు.. చిత్రానికున్న ఘనత అలాంటిది.. అందుకే చిత్రం చెప్పే భావాలు, అర్థాలెన్నో.. ఆధునిక కాలంలో ఛాయాచిత్రగ్రాహకుల అద్భుత సృజన, కళానైపుణ్యం మేలిమి ఆవిష్కారాలకు కారణమవుతోంది. నేడు అంతర్జాతీయ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా చారిత్రక హంపీ క్షేత్రంపై ప్రత్యేక కథనం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు