Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. కెరీర్ చివరి మ్యాచ్‌లో సానియాకు నిరాశ.. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఓటమి
గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో సానియా మీర్జా- రోహన్ బోపన్న జోడీ ఓటమి పాలైంది. ఫైనల్ మ్యాచ్‌లో 6-7, 2-6 తేడాతో బ్రెజిల్ జంట స్టెఫాని-రఫెల్‌లో చేతిలో ఓడిపోయింది. దీంతో ఓటమితో టెన్నిస్ కెరీర్‌కు సానియా వీడ్కోలు పలికినట్లయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. భారీ యంత్రాలతో.. దక్కన్‌మాల్ కూల్చివేత మొదలు
ఎట్టకేలకు గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దక్కన్ మాల్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. అంతకుముందు హైడ్రామా చోటు చేసుకుంది. కూల్చివేతకు సంబంధించి రూ. 33.86 లక్షల అంచనా వ్యయంతో టెండరు నోటిఫికేషన్ ఇవ్వగా..రూ.25.94లక్షలకే పని చేస్తామని ఎస్.కె.మల్లు కన్‌స్ట్రక్షన్స్ సంస్థ బుధవారం పని దక్కించుకుంది. గురువారం ఉదయాన్నే మాల్ కూల్చివేతకు యంత్ర సామగ్రితో సిద్ధమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయ దుకాణ సముదాయంలో అగ్ని ప్రమాదం
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం దుకాణ సముదాయంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయ ప్రాంగణంలోని బొమ్మల దుకాణంలో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే నెల అయిదో తేదీ నుంచి తిరునాళ్ల జరగనున్న నేపథ్యంలో వ్యాపారులు పెద్ద ఎత్తున సామగ్రి కొనుగోలు చేసి నిల్వ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. కల్యాణ మండపంలో కలకలం.. ఉన్నట్లుండి ఊడిపోయి పైకి లేచిన ఫ్లోరింగ్ టైల్స్
పెళ్లికొచ్చిన బంధువులు, కుటుంబసభ్యులు భోజనాలు చేస్తున్న హాలులో ఫ్లోరింగ్‌పై టైల్స్ ఒక్కసారిగా పగిలిపోయి పైకిలేవడంతో వారంతా భీతావహులై కల్యాణ మండపం నుంచి బయటకు పరుగులు తీశారు. పెళ్లి బృందం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా చినముషిడివాడకు చెందిన చిరంజీవి, మౌనిక వివాహ వేడుక స్థానిక దాట్ల మేన్షన్‌లో జరుగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 5.15 గంటలకు ముహూర్తం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. అవిశ్వాసాల అలజడి
రాష్ట్రంలోని పలు పురపాలికల్లో అవిశ్వాస తీర్మానాల అలజడి మొదలైంది. కొత్త పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కౌన్సిలర్లు సమాలోచనలు ప్రారంభించారు. తమ డిమాండ్లు సాధించుకోవడంపై వారు దృష్టిపెట్టారు. రాష్ట్ర పురపాలక చట్టం ప్రకారం మూడేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. 2020 జనవరి 27న కొలువుదీరిన పాలక వర్గాల మూడేళ్ల కాలపరిమితి శుక్రవారంతో ముగియనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఇలాంటి సీఎం.. మళ్లీ కావాలా?
‘మా బిడ్డ జైలుకెళ్లారు.. కష్టపడి నడుస్తున్నారు’ అంటూ జగన్‌ను నమ్మిన జనం ఎంతో మంది ఉన్నారు. కానీ అలాంటి ప్రజలనూ ఆయన మోసం చేశారు. అలాంటి జగన్‌పై జాలి ఎందుకు? తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా పైరవీలతో రూ.కోట్లు సంపాదించుకున్నారు. తండ్రి శవం పక్కన ఉండగానే సీఎం అవ్వాలనుకున్నారు. ఇదేమైనా రాచరికమా? యువకుడిగా ఉన్నప్పుడు ఒక పోలీసు అధికారిని పులివెందులలో కొట్టారు ఈ ముఖ్యమంత్రి’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. వృద్ధులకు ‘అధిక పింఛను’ షాక్
దేశవ్యాప్తంగా వృద్ధాప్యంలోని ఈపీఎఫ్ పింఛనుదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) షాక్ ఇచ్చింది. 70 ఏళ్లకు పైబడిన వయసులో వారిపై బకాయిల భారం మోపనుంది. 2014 సెప్టెంబరుకు ముందు ఉద్యోగ పదవీ విరమణ చేసి, అధిక వేతనంపై అధిక పింఛను పొందుతున్న పింఛనుదారులకు ఆ అధిక పింఛనును రద్దుచేసింది. ఉద్యోగుల పింఛను నిధి (ఈపీఎస్)లో వాస్తవిక వేతనంపై చందా చెల్లించేందుకు పింఛను పథకం సవరణకు ముందుగానే యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వని వారికి ప్రస్తుతం ఇస్తున్న అధిక పింఛను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కంచుకోట నుంచే తొలి అడుగు
ప్రజల గుండెచప్పుడు వినేందుకు... వారి కష్టాలు తెలుసుకుని, కన్నీళ్లు తుడిచి... భరోసా ఇచ్చేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కాలి నడకన తిరిగి క్షేత్ర స్థాయి పరిస్థితులను కళ్లారా చూసేందుకు ఆయన పయనమవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఏ నేతా తిరగనంత స్థాయిలో ఏకంగా 4వేల కిలోమీటర్ల పాదయాత్రకు శుక్రవారం శ్రీకారం చుడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. జగనన్న మాట.. నీటిమూట
హంద్రీ నీవా ప్రాజెక్టు తొలిదశలో మిగిలిపోయిన డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేస్తే ఒక్క అనంతపురం జిల్లాలోనే 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వచ్చు. ప్రాజెక్టు పూర్తి చేయకపోతే పోరాడతాం. లేదంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్ల సమయం ఇవ్వండి.. హంద్రీనీవా పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తాం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. కివీస్‌తో ఇక ధనాధన్
మరో ఆసక్తికర సమరానికి వేళైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి టీ20 శుక్రవారం జరగనుంది. రోహిత్, కోహ్లి వంటి సీనియర్ల గైర్హాజరీలతో హార్దిక్ నేతృత్వంలోని యువ జట్టు మరోసారి చెలరేగాలని తహతహలాడుతోంది. రాహుల్, షమి, సిరాజ్‌లకు కూడా ఈ సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. వన్డే సిరీస్‌ను 0-3తో కోల్పోయిన కివీస్ ఈ సిరీస్‌లో ఎలా ప్రతిఘటిస్తుందో చూడాలి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్