Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్
Top News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్... రెండు స్టేషన్లే..
సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. సుదీర్ఘ పరిశీలన అనంతరం ద.మ.రైల్వే అధికారులు ప్రారంభించడానికి పచ్చజెండా ఊపనున్నారు. వచ్చేనెల మొదటివారంలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా సికింద్రాబాద్- తిరుపతి మధ్య ప్రయాణికులతో పాటు శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటి వరకు ఆ మార్గంలో వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి, రాయలసీమ, శబరి, సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మెట్రోరైల్ నెట్‌వర్క్ జాబితాలో మూడో స్థానానికి పడిపోయిన హైదరాబాద్
దేశంలోనే అత్యంత ఎక్కువ దూరం మెట్రోరైలు నెట్‌వర్క్ కల్గిన నగరాల్లో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్.. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. మెట్రో విస్తరణపై సంవత్సరాల తరబడి ప్రకటనలే తప్ప క్షేత్రస్థాయిలో పనులు మొదలు కాకపోవడం.. ఇతర మెట్రో నగరాలు ప్రాధాన్యం ఇచ్చి పెద్ద ఎత్తున విస్తరణ పనులు చేపట్టడంతో నెట్‌వర్క్ పరంగా హైదరాబాద్ మెట్రో వెనకబడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. పసిమొగ్గలపై వాయు కాలుష్యం
అడ్డూఅదుపూ లేని మానవచర్యల కారణంగా వాయు కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన గాలి అనేది మృగ్యమైపోతోంది. ఫలితంగా అనునిత్యం భారీగా కాలుష్యకారకాలు ఊపిరితిత్తుల్లోకి వచ్చి చేరుతున్నాయి. ప్రధానంగా పిల్లలకు ఇది శరాఘాతమవుతోంది. ఎదుగుతున్న దశలో ఉన్న వారి శ్వాస, నాడీ వ్యవస్థలను దెబ్బతీసి, వారి భవితను ఛిద్రం చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
రాజస్థాన్‌లోని సీకర్‌కు చెందిన మహిళా వైద్యురాలు అనిత.. పానీపూరీ వ్యాపారిగా మారిపోయారు. రోగులను పరీక్షించి మందులు ఇవ్వాల్సిన ఆమె.. రోడ్డుపై పానీపూరీ బండి నడుపుతున్నారు. తాళం వేసిన ఆస్పత్రి ఎదుటే ఆమె ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. రాజస్థాన్‌లోని అశోక్ గహ్లోత్ ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చిన ఆరోగ్య బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే డాక్టర్ అనిత ఇలా నిరసన తెలుపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రూ.26,379 కోట్లు మురిగిపోయాయి!
రాష్ట్ర ప్రభుత్వం 2021-22లో రూ.26,379.81 కోట్ల నిధులను మురగబెట్టింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు తగ్గించి చూపడానికి ఇది దారి తీసింది. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. వివిధ కేంద్ర పథకాలు, వాటికి రాష్ట్ర వాటా నిధులు.. ఆర్థిక సంఘం గ్రాంట్లు, రాష్ట్ర పథకాలకు సంబంధించి ఇలా పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేయకుండా పీడీ ఖాతాల్లోనే చూపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. యువికా.. నవ శాస్త్రవేత్తలకు ఇస్రో వేదిక
విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి చదువుతోన్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. యువికా (యువ విజ్ఞాని కార్యక్రమం) పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా ఛార్జీలు, బస, భోజన వసతితోపాటు అన్ని సౌకర్యాలను ఇస్రో కల్పించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ట్రాక్‌కు ఇరువైపులా రక్షణ కంచెలు?
రైల్వే ట్రాక్‌పైకి జంతువులు రాకుండా దక్షిణ మధ్య(ద.మ.) రైల్వే కసరత్తు చేస్తోంది. ఇటీవలి కాలంలో జంతువుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే అధికారులు నివారణ చర్యలపై దృష్టి సారించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో కొన్నిరోజుల క్రితం ట్రాక్‌పైకి అకస్మాత్తుగా వచ్చిన ఎద్దును వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన విషయం తెలిసిందే. గతంలో ఇతర ప్రాంతాల్లోనూ ‘వందేభారత్’ ఈ తరహా ప్రమాదాలకు గురైంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. Fact Check: ₹239 ఉచిత రీఛార్జ్ పేరుతో వాట్సాప్‌లో నకిలీ మెసేజ్!
వాట్సాప్ (WhatsApp)లో మరో మెసేజ్ చక్కర్లు కొడుతోంది. దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 239 రీఛార్జ్ చేస్తుందని, ఉచిత రీఛార్జ్ కోసం మెసేజ్‌లోని వెబ్ లింక్‌పై క్లిక్ చేయాలనేది అందులోని సారాంశం. అయితే, ఈ మెసేజ్ నకిలీదని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) విభాగం నిర్థారించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్వీట్ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. మీ పిల్లలతో మాట్లాడుతున్నారా?
ఉరుకుల పరుగుల జీవితాలివీ.. తెల్లారి లేచింది మొదలు పొద్దుపోయే వరకు తీరిక దొరకడమే కష్టం.. ఉడికీ ఉడకని అన్నాన్నే తీసుకెళ్తుంటారు కొందరు ఉద్యోగులు.. రోజు కూలీల పరిస్థితి ఇక మరింత దయనీయమే.. ఈక్రమంలో పిల్లలేం చేస్తున్నారు..? చదువుతున్నారా లేదా..? చరవాణి ఎంతసేపు ఉపయోగిస్తున్నారు..? పోనీ పాఠశాలకైనా వెళ్తున్నారా..? అన్న ధ్యాసే ఉండడం లేదు చాలామంది తల్లిదండ్రులకు. దీంతో పలువురు పక్కదారి పడుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారు. కొందరు ఆడపిల్లలైతే తమ సమస్యలను సైతం కుటుంబ పెద్దలకు చెప్పుకోలేని పరిస్థితి. వారితో మాట్లాడకపోవడం.. కాస్త సమయం వెచ్చించేందుకు వెనకడుగు వేయడమే దీనికి కారణమంటున్నారు వైద్యులు, మానసిక నిపుణులు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. WPL 2023: ముంబయికే పట్టం
ముంబయి ఇండియన్స్ అదుర్స్. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఈ ఫ్రాంఛైజీ.. మొట్టమొదటి మహిళల ప్రిమియర్ లీగ్ ఛాంపియన్‌గా అవతరించింది. టోర్నీ ఆరంభం నుంచి మెరుగైన ఆటతో ఆకట్టుకున్న హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని ముంబయి.. రసవత్తరంగా సాగిన ఫైనల్లోనూ పైచేయి సాధించింది. దిల్లీకి నిరాశ. పోరాడినా ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. బంతితో వాంగ్, హేలీ, అమేలియా.. బ్యాటుతో నీట్ సీవర్ ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
రజనీకాంత్‌కు ‘సన్నాఫ్ ఇండియా’ కథ చెప్పా.. అలా చేసి ఉంటే హిట్ అయ్యేది: డైమండ్ రత్నబాబు
-
General News
Tractor Accident: ప్రత్తిపాడులో విషాద ఛాయలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Janasena: కత్తిపూడి సభ తర్వాత వారాహి యాత్ర ప్రారంభం: నాదెండ్ల
-
Sports News
WTC Final:పేపర్‌పై ఆస్ట్రేలియా ఫేవరెట్.. ఆ విషయంలో మాత్రం భారత ప్లేయర్స్ బెస్ట్ : రవిశాస్త్రి
-
Movies News
Adah Sharma: నాకు కొత్త అవకాశాలను సృష్టించుకోవడం రాదు.. కానీ.. : అదాశర్మ