Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు @ 9 AM

Top news:  ఈనాడు.నెట్‌లో ముఖ్యమైన వార్తలు మీ కోసం...

Updated : 12 May 2022 09:03 IST


1. నల్లా నీరు..శివారుకు పరుగు

నగరం శరవేగంగా విస్తరిస్తోంది. కీలకమైన జీవో 111 ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో త్వరలో కొత్త ప్రాజెక్టులు రానున్నాయి. మరోవైపు అవుటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ కొత్త కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఐటీ పార్కులు ఇతర ప్రైవేటు సంస్థలు రానున్నాయి. భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పెద్ద సవాలుగా మారనుంది. ఈ నేపథ్యంలో జలమండలి రూ.1200 కోట్లతో అవుటర్‌ రింగ్‌రోడ్డు ఫేజ్‌-2 పనులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


2. ఖేదం.. మోదం

అసని తుపాను కొంతమేర పంటలను దెబ్బతీసి రైతును ఖేదంలో ముంచెత్తగా, దిశ మార్చుకుని బలహీనపడటంతో మరింత నష్టం రాకుండా కాస్త మోదం మిగిల్చింది. బుధవారం వేకువజాము నుంచి జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి.  ఓ వైపు గాలులు.. మరోవైపు వర్షంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు.  మొక్కజొన్న కండెలు కోసి కుప్పలు వేసి ఉండటంతో కుప్పలు తడవకుండా రైతులు పట్టాలు కప్పి లోనికి నీరుపోకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు.   పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


3. సైబర్‌ వల.. చిక్కుకుంటే విలవిల

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ నంబర్ల హ్యకింగ్‌, తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు ఆశ చూపి దోచుకోవడం, ఓఎల్‌ఎక్స్‌, స్నాప్‌డీల్‌ ద్వారా వల విసిరి డబ్బు గుంజడం, ఉద్యోగాల పేరుతో వల వేయడం ఇలా అనేక రకాలుగా సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ సామాన్య, మధ్యతరగతి వారి నగదు కాజేసి వారిని ఆర్థికంగా కుంగదీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


4. ‘ఆ మందిరం మయన్మార్‌ దేశానిది’

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఎం.సున్నాపల్లి సముద్రం ఒడ్డుకు తుపాను ప్రభావంతో మంగళవారం కొట్టుకొచ్చిన మందిరాన్ని పోలి ఉన్న రథం మయన్మార్‌ దేశానికి చెందిందని అధికారులు గుర్తించారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఆదేశాల మేరకు తహసీీల్దార్‌ చలమయ్య, మెరైన్‌ సీీఐ దేవుళ్లు, నౌపడ ఎస్‌.ఐ.సాయికుమార్‌లు వెళ్లి పరిశీలించారు. బంగారు వర్ణంతో కూడిన రథంపై విదేశీభాష ఉండటాన్ని గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


5. అవగాహన లేక.. అందని ఉచిత కరెంటు

దళిత, గిరిజన కుటుంబాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. వీటిలో భాగంగా తమ నివాసాల్లో వినియోగించే విద్యుత్తుపైనా రాయితీ అందిస్తోంది. ఇందుకోసం అర్హులైన ప్రతి ఒక్కరూ తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని సదరు విద్యుత్తు శాఖ అధికారికి సమర్పించాల్సి ఉంది. కానీ ఏళ్లు గడుస్తున్నా నూరు శాతం వినియోగదారులు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించలేకపోయారు.  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


6. ఆధార్‌ అనుసంధానమైతేనే సాయం

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం వర్తించాలంటే తప్పనిసరిగా రైతులు ఈ-కేవైసీ చేసుకోవాలనే నిబంధనలను జారీ చేసింది. గతంలో బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకున్న రైతులు సైతం మరోసారి ఈ ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ పూర్తయితేనే లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ అవుతాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


7. నాసైకిలే.. నా డాక్టర్‌ 

యిదు పదుల వయసు దాటుతున్నారో లేదో మధుమేహం, రక్తపోటు, మోకాళ్ల నొప్పులంటూ ఈ రోజుల్లో కొందరు సతమతమైపోతుంటారు. అయితే ఆయనకు తొమ్మిది పదుల వయసు పైబడింది. మనవలు, మనవరాళ్లతో ఆడుకునే వయసు. విశ్రాంతి కోరుకునే మనసు. ఆ వయసులోనూ ఏమాత్రం తరగని ఉత్సాహం ఆయన సొంతం. ఎంతో మంది క్రీడాకారులకు మెలకువలు నేర్పిస్తూ.. ఇప్పటికీ వారితో పోటీ పడుతూ.. మనసును పతకాల వెంట పరుగులు తీయిస్తున్నారు గుంటూరుకు చెందిన 93 సంవత్సరాల గింజుపల్లి శివరామకృష్ణయ్య.  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


8. ఆపద సమయంలో.. అమ్మగా.. 

ఎవరికైనా రోగమొస్తే మొదట గుర్తొచ్చేది వైద్యుడే.. అయితే ఏ దశలోనైనా వైద్యులకు అండగా, రోగులకు అమ్మగా సేవలందించేది నర్సులే.. వైద్య రంగంలో వారి బాధ్యతలు కీలకం.. కొవిడ్‌ సమయంలోనూ ఎంతో మంది బాధితులకు ప్రాణాలు పోసిన ప్రాణదాతలు. నేడు నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


9. ఏమైంది.. సీతంపేట ఊటీ

సీతంపేట ఐటీడీఏ కేంద్రానికి దగ్గరలో ఉన్న జగతిపల్లి పర్యాటకానికి అనుకూల ప్రాంతం. ఇక్కడున్న ఘాట్‌ రహదారి సమీపంలో ఎత్తయిన కొండ ప్రాంతాల్లో ఊటీ మాదిరి నిర్మాణాలు చేపట్టేందుకు ‘హిల్‌ రిసార్ట్సు’ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. ఈ మేరకు మాస్టర్‌ ప్లాన్‌ కూడా సిద్ధం చేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.27 కోట్లు కాగా అంతే మొత్తాన్ని అప్పటి తెదేపా ప్రభుత్వం వెంటనే మంజూరు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


10. ఊరంతా పెళ్లిసందడి..

వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో గురువారం జరగనున్న సామూహిక పెళ్లిళ్ల సందడి మొదలైంది. బుధవారం ఉదయం 6.30 గంటలకు బాజాభజంత్రీలతో వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ సుమారు 86 (43 జంటలు) పెళ్లి ఇళ్ల వద్ద పందిరాట అట్టహాసంగా నిర్వహించారు. పచ్చని కొబ్బరి కమ్మలతో పందిర్లు వేసి పెళ్లి పీటలను సిద్ధం చేశారు. అనంతరం డీజే సంగీతానికి యువకులు, చిన్నారులు, మహిళలు నృత్యాలు చేస్తూ రంగేళి ఆడారు.  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని