Top ten News @ 9 AM: టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

Top News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం...

Updated : 14 Mar 2022 09:04 IST


1. పోలీసు శాఖ నుంచే తొలి ప్రకటన!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి తొలి ప్రకటన పోలీసుశాఖ నుంచి వచ్చే అవకాశం ఉంది. జోన్ల వారీగా ఉద్యోగాల ఖాళీల జాబితాతో ఇప్పుటికే సిద్ధంగా ఉన్న అధికారులు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టి.ఎస్‌.ఎల్‌.ఆర్‌.బి.) కసరత్తు మొదలుపెట్టింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


 ఖాళీలు మిగలకుండా.. పక్కా ప్రణాళిక


2. నట్టింట్లోకి సూరీడు

గటిపూట విద్యుత్తుతో పని లేకుండా భవనాల్లోని సెల్లార్లు, చీకటి గదుల్లో సహజ వెలుగులు ప్రసరిస్తే? ఏసీ మాదిరి గొట్టాల ద్వారా సూర్యరశ్మిని గదుల్లోకి తీసుకురాగలిగితే? కరెంటు ఖర్చు ఎంతో ఆదా. ఆరోగ్యమూ బాగుంటుంది. ఇదే ఆలోచనతో డే లైట్‌ హార్వెస్టింగ్‌ సాంకేతికతను అభివృద్ధి చేసింది హైదరాబాద్‌లోని స్కైషేడ్‌ డే లైట్స్‌ అంకుర సంస్థ. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


3. ‘స్లాబ్‌’ లేకుంటే ఫీజుల మోతే!

ప్రైవేట్‌ పాఠశాలల ఫీజుల పెంపు ఏటా 10 శాతం మించరాదని మంత్రుల కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో స్లాబ్‌ విధానం లేకుంటే తల్లిదండ్రులకు రుసుముల భారం గుదిబండగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటా ప్రతి తరగతికి 10 శాతం పెంచితే సగటున ఏడాదికి 15-20 శాతం భారం తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి తరగతికి ఒక ఫీజు కాకుండా రెండు లేదా మూడు స్లాబ్‌లుగా నిర్ణయించాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


4. రష్యా బాంబులు.. సింగరేణికి బాధలు

రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఉరిమి ఉరిమి మంగళంపై పడినట్లైంది. ఆ రెండు దేశాల నుంచి మన దేశానికి పెద్ద ఎత్తున దిగుమతయ్యే అమ్మోనియం నైట్రేట్‌ (ఎన్‌హెచ్‌4ఎన్‌ఓ3) సరఫరాలు మందగించాయి. పేలుడు పదార్థాల్లో ప్రధాన ముడిసరకైన దీని దిగుమతులు తగ్గడంతో దేశంలోని బొగ్గుగనుల తవ్వకాలపై ప్రభావం పడుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


5. కాలుష్యంతో గుండె ‘చెరువు’

పచ్చని చెట్లు.. పక్షుల ఆవాసాలు.. పైర్లకు నీరందించే తటాకాలు విషతుల్యంగా మారుతున్నాయి. ఒకనాడు మత్స్య సంపదకు నిలయమైన చెరువులు నేడు ప్లాస్టిక్‌, చెత్తాచెదారం, మురుగుతో నిండి దుర్వాసనను వెదజల్లుతున్నాయి. రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల నుంచి విడుదలయ్యే మురుగునీరు అధికభాగం సమీప చెరువుల్లోకి చేరుతోంది. ఇలా ఒక్కచోట చేరడంతో భూగర్భ జలాలు, పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


6. బాలాజీ జిల్లాలో అధికంగా 746 బస్సులు

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆర్టీసీలో బస్సు సర్వీసులు, డిపోలు, జిల్లా కార్యాలయాల్లోకి సిబ్బంది సర్దుబాటు కొలిక్కి వచ్చింది. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న రీజినల్‌ మేనేజర్‌కు బదులు జిల్లాకు ఓ మేనేజర్‌ పోస్టు, జోనల్‌ పరిధిలో మార్పులు చేస్తూ ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వానికి పంపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


► విద్యుత్‌ వినియోగదారులకు వాయిదా పద్ధతిలో గృహోపకరణాలు


7. మార్పులొచ్చాయ్‌... మార్కులూ రావాలోయ్‌!

పదో తరగతి పరీక్షల్లో రెండేళ్ల క్రితమే సంస్కరణలు ప్రవేశపెట్టారు. 2019-20 విద్యా సంవత్సరంలో ప్రతి సబ్జెక్టులోనూ అంతర్గత మార్కులు, బిట్లు లేకుండా మొత్తం ప్రశ్నలే ఉండేలా మార్పు చేశారు. అయితే కరోనా కారణంగా ఆ ఏడాది పరీక్షలు పెట్టలేదు. గతేడాది 11 పేపర్లను ఏడుకు కుదించినా పరీక్షలు నిర్వహించలేదు. ఈ మార్పులకు అదనంగా ఈ ఏడాది పదిలో మార్కుల విధానాన్ని తీసుకొచ్చారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


8. శుచి లేదు.. శుభ్రతా లేదు! మినరల్‌ వాటర్‌ పేరుతో దందా

గ్రేటర్‌ నగరంలో మినరల్‌ వాటర్‌ పేరుతో భారీదందా నడుస్తోంది. శుచి.. శుభ్రత లేకుండా మురికి వాడలు, చిన్నచిన్న గల్లీల్లో వాటర్‌ ప్లాంట్లు పెట్టి రూ.కోట్లు దండుకుంటున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న ఈ ప్లాంట్లపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా... అనేక ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేవని తేలింది. తాగునీటి వ్యాపారం చేయాలంటే భారతీయ ప్రమాణాల బ్యూరో(బీఐఎస్‌) లైసెన్సు తీసుకోవాలి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


9. చెత్తను అమ్మేయండి

ఇంట్లో పోగయిన చెత్తను సొమ్ము చేసుకోవచ్చని చెబుతున్నాయి నగరానికి చెందిన ఎన్జీవోలు, అంకుర సంస్థలు. ఫోన్‌కాల్‌ లేదా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వెంటనే ఇంటి ముందు ప్రత్యక్షమై బరువు ఆధారంగా ధర చెల్లించి తీసుకెళ్తున్నారు. పొడి వ్యర్థాలను వేరుచేసి రీసైక్లింగ్‌ యూనిట్లకు తరలించి వ్యాపారంతో.. పాటు పరోక్షంగా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


10. జాగ్రత్తగా ట్రేడింగ్‌..!

ఈ వారంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ నిర్ణయాల కోసం వారు వేచిచూస్తుండడం ఇందుకు నేపథ్యం. 17న వెలువడే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ నిర్ణయాలూ  కీలకమే. నేడు వెలువడే ఫిబ్రవరి నెల దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా సెంటిమెంటుపై ప్రభావం చూపవచ్చు. నిఫ్టీకి 16,700-16,800 వద్ద నిరోధం ఎదురుకావొచ్చని; 16,400 వద్ద మద్దతు లభించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


 భారత్‌ చేతుల్లో.. గులాబి టెస్టులో ఆధిపత్యం


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని