Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తల కోసం క్లిక్‌ చేయండి

Updated : 21 Dec 2022 15:28 IST

1. Lockdown: వారం, పదిరోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు!

కరోనా కట్టడికి రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 30వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో, దీనిపై తదుపరి కార్యాచరణకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఆదివారంతో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో సోమవారం నుంచి లాక్‌డౌన్‌ను ఎలా అమలు చేయాలనే అంశంపై సీఎం కేసీఆర్‌ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల అభిప్రాయాన్ని ఇప్పటికే తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. PM CARES: కరోనా బాధితులకు భరోసా

కరోనా మహమ్మారి సృష్టించిన పెను విపత్తులో ఆప్తుల్ని కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు, తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని అనాథలుగా మారిన చిన్నారులకు సాంత్వన చేకూర్చే వివిధ చర్యల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. కన్నవారి మృతితో అనాథలైన చిన్నారుల జీవితానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు విద్యనందించే ఏర్పాటు చేయనున్నారు. బాధిత పిల్లలు 18 ఏళ్ల వయసుకు వచ్చే నాటికి వారి పేరున రూ.10 లక్షల మూల నిధిని పీఎంకేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ద్వారా ప్రభుత్వం సమకూర్చుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

స్టార్‌ హోటళ్లలో టీకాలు వద్దు : కేంద్రం

3. బడి ప్రాంగణంలో 215 అస్థిపంజరాలు

కెనడాలో దారుణం వెలుగు చూసింది. పేరు ప్రఖ్యాతులున్న ‘కామ్‌లూప్స్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌’ ప్రాంగణంలో ఒకేసారి 215 మంది పిల్లల అస్థి పంజరాలు బయటపడ్డాయి. మృతుల్లో కొందరు మూడేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. ఒక రాడార్‌ ద్వారా లభ్యమైన సమాచారంతో ఈ దారుణం వెలుగు చూసింది. పాఠశాల ప్రాంగణంలో మరిన్ని చోట్ల ఇంకా తవ్వకాలు జరగాల్సి ఉన్నందున అస్థి పంజరాల లెక్క ఎంతవరకు వెళ్తుందనేది తెలియడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఊరు కన్పించేది ఒక్క నెలే!

చాలామంది పండగకో, పబ్బానికో సొంత ఊరికి వెళుతుంటారు. కానీ గోవాలోని కుర్ది గ్రామానికి చెందిన ప్రజలు, మే నెలలో మాత్రమే ఆ ఊరికి వెళ్లగలరు. ఎందుకంటే ఆ గ్రామం కనిపించేది అప్పుడే మరి. కొన్ని సంవత్సరాల క్రితం కుర్ది మూడు వేల మంది జనాభాతో ఉండేది. 1986లో పక్కనే ప్రవహిస్తున్న సలౌలిం నదిపై ఆనకట్ట కట్టడంతో ఈ గ్రామం నీటిలో మునిగిపోయింది. దీంతో ఆ ఊరి ప్రజలు పునరావాస ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే ఏడాదిలో 11 నెలలు జలాశయంలో మునిగిపోయే ఈ కుర్ది గ్రామం వేసవిలో నీటి మట్టం తగ్గాక మే నెలలో పైకి తేలుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. UFO: అమెరికా యుద్ధనౌకను చుట్టుముట్టిన ఫ్లయింగ్‌ సాసర్లు?

గ్రహాంతరవాసుల వ్యోమనౌకలుగా భావిస్తున్న ‘ఫ్లయింగ్‌ సాసర్లు’ (యూఎఫ్‌వో)లు అప్పుడప్పుడూ భూమిని సందర్శించి వెళుతున్నాయా? అనాదిగా మనిషి బుర్రను తొలుస్తున్న ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా పరిశోధనాత్మక లఘు చిత్రాల దర్శకుడు జెరీమీ కార్బెల్‌ దీనిపై సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు చెందిన ఒక యుద్ధనౌకను కొన్ని యూఎఫ్‌వోలు చుట్టుముట్టినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన రాడార్‌ తెర దృశ్యాలను ఆయన విడుదల చేశారు. ఇందులో 9 వస్తువులు నౌకకు దగ్గరగా రావడం కనిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆందోళన వద్దు.. అందరికీ రాదు

కరోనా నుంచి కోలుకున్న తర్వాత 45 రోజులు దాటితే బ్లాక్‌ఫంగస్‌ బారిన పడే ప్రమాదం చాలా తక్కువని ఈఎన్‌టీ నిపుణులు డాక్టర్‌ మేఘనాథ్‌ తెలిపారు. ప్రస్తుతం మ్యూకార్‌మైకోసిస్‌(బ్లాక్‌ఫంగస్‌)తో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. మధుమేహం అదుపులో పెట్టుకోవడం, కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా పకడ్బందీగా మాస్క్‌ ధరించడం ద్వారా దాదాపు బ్లాక్‌ఫంగస్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చునని తెలిపారు. జూన్‌ నెలాఖరుకు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నోటి మాత్రతో బ్లాక్‌ ఫంగస్‌కు చికిత్స!

7. Suicide attempt: అతడికి 17.. ఆమెకు 20

అతడు 17 ఏళ్లు కూడా నిండని మైనర్‌. అంతలోనే ప్రేమ.. పెళ్లి అంటూ 20 ఏళ్ల యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టాడు. పెద్దలు వారించినా వినకుండా ఓ గది తీసుకుని యువతితో సహజీవనం చేస్తున్నాడు. అయినా తల్లిదండ్రులు చూసీచూడనట్లు వ్యవహరించారేమో తెలియదు కానీ.. ఇప్పుడు వారికి తీరని శోకమే మిగిలింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఎస్సై చంద్రశేఖర్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. లాహే లాహే... ఉర్రూతలూపేస్తున్నారు

ఆదిదంపతుల అనురాగం అద్భుతమైన పాటగా   యూట్యూబ్‌ను ఊపేస్తోంది... చిరంజీవి తాజా చిత్రంలోని ఈ పాట నెల రోజుల్లోనే 4.6 కోట్ల మందికి పైగా సంగీత ప్రియులను అలరించింది... ఆ పాట పాడిన యువ కెరటాలు సాహితి చాగంటి, హారికా నారాయణ్‌లు వసుంధరతో ముచ్చటించారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. OXYGEN CONCENTRATOR: భారీగా తగ్గిన ఆక్సిజన్‌ ధరలు

కొవిడ్‌ బాధితులకు ఊరట కలిగించే పరిణామమిది. ఏప్రిల్‌ మధ్య నుంచి విపరీతంగా పెరిగిన మెడికల్‌ ఆక్సిజన్‌, కాన్సన్‌ట్రేటర్ల ధరలు గణనీయంగా దిగివచ్చాయి. కేసులు తగ్గుముఖం పట్టడం, ఆక్సిజన్‌ అందుబాటు సదుపాయాలు మెరుగవ్వడం ఇందుకు కారణమని చెబుతున్నారు. పెద్ద సిలిండర్‌ రీఫిల్లింగ్‌ ధర రూ.2,000-3,000 నుంచి రూ.600కు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల ధర రూ.60,000-70,000 నుంచి రూ.15,000-25,000కు తగ్గాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆక్సిజన్‌ అధికమైనా ప్రమాదమే

10. ED: జగన్‌పై మరో కేసు

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో మరొకటి చేరింది. 11 సీబీఐ, 6 ఈడీ కేసులకు అదనంగా మరో ఈడీ కేసు నమోదు కావడంతో... కేసుల సంఖ్య 18కి పెరిగింది. ఉమ్మడి రాష్ట్ర ఏపీ హౌసింగ్‌ బోర్డు, ఇందూ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టిన హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గత ఏడాది దాఖలు చేసిన అభియోగ పత్రంపై ఇటీవల ఈడీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని