Updated : 29/10/2021 11:34 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.హుజూరాబాద్‌లో ఓట్లు.. నోట్లు.. పాట్లు

ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం కాగా..ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీల నాయకులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తమకు డబ్బులు అందడం లేదని పలు చోట్ల మహిళలు ధర్నాలు చేయడం విశేషం.శనివారం జరగనున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక  ముఖచిత్రమిది. ప్రచార గడువు ముగియడంతో గురువారం ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు లోలోపల మంత్రాంగాల్ని నడిపించారు.

2. ఆంధ్రాలో తెరాస పార్టీ పెట్టడం ఎందుకు?

‘ఆంధ్రాలో కొత్తగా తెరాస పార్టీ పెట్టాల్సిన పని ఏముంది? ఏపీ, తెలంగాణను కలిపేస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి, రెండు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా! ఉమ్మడి రాష్ట్రంగా ఉందాం. అక్కడ ఇక్కడ ఒకే పార్టీ ఉంటుంది. కొత్తగా పార్టీ పెట్టే పనే ఉండదు’ అని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. సచివాలయంలో గురువారం మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను వెల్లడించిన అనంతరం ఆయన మాట్లాడారు.

ఆంధ్రాలో తెరాస.. రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌

3.ఫ్రాన్స్‌లో కేటీఆర్‌ పర్యటన .. మిస్సైల్స్‌, ఎంబీడీఏ ప్రతినిధులతో భేటీ

ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర బృందం రెండో రోజు పలు కంపెనీల సీఈవోలు, అధిపతులతో సమావేశమైంది. మిస్సైల్‌,  మిస్సైల్‌ సిస్టమ్స్‌లో ప్రఖ్యాతిగాంచిన పారిస్‌కు చెందిన ఎంబీడీఏ కంపెనీ డైరెక్టర్లు బోరిస్‌ సోలోమియాక్‌, పాల్‌ నీల్‌ లే లివెక్‌, ఇతర ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్‌.. తెలంగాణలో తయారీ రంగం అవకాశాలను వివరించారు.

4.రజనీకాంత్‌ ఆరోగ్యంగానే ఉన్నారు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆసుపత్రిలో చేరారు. ఏటా నిర్వహించే సాధారణ హెల్త్‌ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రికి వెళ్లారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన సతీమణి తెలిపారు. రెండ్రోజుల క్రితం దిల్లీ నుంచి వచ్చిన రజనీకాంత్‌ బుధవారం రాత్రి తాను నటించిన ‘అన్నాత్తే’ చిత్రాన్ని కుటుంబ సభ్యుల మధ్య తిలకించారు.

5.భాజపా ఎటూ వెళ్లిపోదు.. రాహుల్‌కే అది అర్థంకావట్లేదు: పీకే

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు కాంగ్రెస్‌తో సంబంధాలు పూర్తిగా చెడినట్లేనా..?ప్రస్తుత పరిణామలు చూస్తుంటే అలాగే కన్పిస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కిన పీకే.. తాజాగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశ రాజకీయాల నుంచి భాజపా ఇప్పుడప్పుడే దూరంగా వెళ్లిపోదని, ఆ విషయం రాహుల్‌కే ఇంకా అర్థమవ్వట్లేదంటూ ఎద్దేవా చేశారు. 

6.ఫేస్‌బుక్‌ మాతృసంస్థ కొత్త పేరు ‘మెటా’

‘ఫేస్‌బుక్‌’ కంపెనీ పేరు మారింది. ఇకపై దాన్ని ‘మెటా’గా పిలవనున్నారు. ఈ మేరకు పేరు మార్పు విషయాన్ని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ గురువారం వెల్లడించారు. భవిష్యత్తులో వర్చువల్‌ రియాలిటీ సాంకేతికత (మెటావర్స్‌)కు పెరగనున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫేస్‌బుక్‌ కంపెనీ అధీనంలోని సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, వాట్సప్‌ల పేర్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు.

7.వితరణలో అజీమ్‌ ప్రేమ్‌జీది అగ్రస్థానం

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం విప్రో వ్యవస్థాపక ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ దాతృత్వంలో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2020-21లో ఆయన రూ.9,713 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే సగటున రోజుకు రూ.27 కోట్లను వితరణగా అందించారు. ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రోపీ రూపొందించిన 2021 జాబితాలో హెచ్‌సీఎల్‌ శివ్‌నాడార్‌ రూ.1,263 కోట్ల విరాళంతో రెండో స్థానంలో నిలిచారు.

మీ పెట్టుబడి బంగారం కానూ..!!

8.‘డిజిటల్‌’ దొంగలొస్తున్నారు.. తస్మాత్‌ జాగ్రత్త

ఒకప్పుడు దొంగలు ఇళ్లకు కన్నాలేసి.. బీరువాలు పగలగొట్టి, అయినకాడికి ఎత్తుకెళ్లేవారు. ఇప్పుడు ఉన్నచోటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా సొత్తు దోచేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. మనతోనే తాళాలు (పాస్‌వర్డ్‌లు) ఇప్పించుకుని, మనం కళ్లు తెరిచి చూసేలోగా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఫోన్‌ చేసి నాలుగు మాయమాటలు చెప్పి, డెబిట్‌కార్డుకు ఉండే నాలుగంకెల పిన్‌ నెంబరు తెలుసుకుని.. గుల్ల చేస్తున్నారు.

9. మోకాలిపై కూర్చుంటా.. మళ్లీ ఆడతా

దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ డికాక్‌ వివాదానికి తెరదించాడు. క్షమాపణలు చెప్పిన అతను.. ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ (బీఎల్‌ఎమ్‌)’ ఉద్యమానికి మద్దతుగా మోకాలిపై కూర్చుంటానన్నాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఆడే మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. మంగళవారం వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు మోకాళ్లపై కూర్చుని బీఎల్‌ఎమ్‌ ఉద్యమానికి సంఘీభావం తెలపాలని ఆ రోజు ఉదయమే తమ ఆటగాళ్లను దక్షిణాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ) ఆదేశించింది.

10.ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్తున్నారా..? మొబైల్‌ పట్టుకెళ్లడం మరిచిపోకండి!!

ఏటీఎంల వద్ద జరిగే మోసాలను నివారించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వ‌ర్డ్‌) విధానాన్ని తీసుకొచ్చింది. ఏటీఎంల వ‌ద్ద జ‌రిగే అన‌ధికారిక లావాదేవీల‌ను నుంచి ఖాతాదారుల‌కు ఈ విధానం ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. రూ.10 వేలు, అంత‌కంటే ఎక్కువ మొత్తంలో న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డుతో పాటు ఓటీపీని ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని