Updated : 12/11/2021 09:08 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.ఉద్యోగులకు త్వరలోనే డీఏ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే కరవు భత్యం(డీఏ) విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కొత్త జోనల్‌ విధానం అమలు ప్రక్రియను సత్వరమే పూర్తి చేస్తామని, ఉద్యోగులను సర్దుబాటు చేసిన తర్వాత శాఖల్లో ఏర్పడే ఖాళీల భర్తీకి అతి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు.

2.మూడు రాజధానులకు నిధులివ్వండి
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఆదివారం తిరుపతిలో జరగనున్న దక్షిణాది ప్రాంతీయ మండలి 29వ సమావేశంలో 26 అంశాలపై చర్చించనున్నారు. మొదట 23 అంశాలతో సమావేశం ఎజెండాకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన మూడు అంశాల్ని స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ అనుమతితో ఎజెండాలో చేర్చారు.

3.రోదసిలోకి మన రాజాచారి!
తెలుగు మూలాలున్న అమెరికా వ్యోమగామి రాజాచారి గురువారం విజయవంతంగా రోదసిలోకి చేరారు. మరో ముగ్గురితో కలిసి ఆయన ‘ఎండ్యూరెన్స్‌’ వ్యోమనౌక ద్వారా ఈ ఘనత సాధించారు. వీరు 6 నెలల పాటు భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో విధులు నిర్వర్తిస్తారు. చారికి ఇది తొలి రోదసి యాత్ర.

4. కొవాగ్జిన్‌తో 93.4 శాతం రక్షణ

కొవిడ్‌ తీవ్ర లక్షణాలు సోకకుండా కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ 93.4 శాతం కాపాడుతుందని భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను లాన్సెట్‌ వెల్లడించిన నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ ప్రకటన చేసింది. క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో 0.5 శాతం కంటే తక్కువ మందిలో మాత్రమే తీవ్ర దుష్పరిణామాలు తలెత్తినట్లు తెలిపింది.

5.గుండెకు చలి
చలి క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్‌ సహా నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో 13 డిగ్రీలకు పడిపోయింది. రానున్న రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

6.ఉన్నత చదువులకు ఆర్థిక భరోసా
పిల్లల చదువుల కోసం పెట్టుబడి.. తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచించే విషయం ఇదే. విద్యా ద్రవ్యోల్బణం ఏటా పెరుగుతుండటంతో.. ఎంత దాచినా.. ఖర్చులకు సరిపోని పరిస్థితి చూస్తూనే ఉన్నాం. మదుపు చేసినప్పుడు ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడిని ఆర్జించినప్పుడే ఆర్థికంగా తట్టుకోగలం. ఇదే సమయంలో రాబడి హామీ ఉండే పథకాలను ఎంచుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు.

7.పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా రహస్య సర్వే..!

భారత వ్యూహకర్తల నోటివెంట తరచూ వినిపించే పదం ‘టూఫ్రంట్‌ వార్‌’. అంటే ఏకకాలంలో చైనా, పాక్‌ సైన్యాలను భారత్‌ ఎదుర్కోవాల్సిరావడం. ఇటీవల కాలంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు మన వ్యూహకర్తల అంచనాలకు తగ్గట్లే ఉంటున్నాయి. పాక్‌-చైనాల మధ్య సైనిక సహకారం పెరిగిపోయింది. ఇటీవలే చైనా అత్యాధునిక ఫ్రిగేట్‌ను పాకిస్థాన్‌కు బహూకరించింది.

8.మరో మైలురాయిని అధిగమించిన హైదరాబాద్‌ మెట్రో

హైదరాబాద్‌ మెట్రోరైలు మరో మైలురాయిని అధిగమించింది. విద్యుత్తు అవసరాల్లో లక్ష్యాన్ని మించి సౌర విద్యుత్తును వినియోగిస్తోంది. తమ విద్యుత్తు అవసరాల్లో 15 శాతం సౌర విద్యుత్తు నుంచి సమకూర్చుకోవాలని నిర్దేశించుకుకోగా 2020-21లో 17.5 శాతం అవసరాలు తీర్చుకుంది.

9.వారెవ్వా వేడ్‌..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ కీలక పాత్ర పోషించాడు. 17 బంతుల్లోనే 41 పరుగులు చేయడంతో ఆసీస్‌ సులభంగా గెలుపొందింది.

ఔరా ఆసీస్‌

10.మీరు జాప్యం చేసి.. కేంద్రంపై నిందలా?
కృష్ణా జల వివాద పరిష్కారం కోసం కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసువేసి అనవసర జాప్యానికి కారణమై..ఇప్పుడు కేంద్రాన్ని బాధ్యులను చేయడం ఏమిటని ప్రశ్నించారు. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని