Published : 01/12/2021 09:03 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.‘సిరివెన్నెల’కు  ప్రముఖుల నివాళి

ప్రముఖ గీత రచయిత ‘సిరివెన్నెల’ మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిల్మ్‌ ఛాంబర్‌కు తీసుకొచ్చారు. దర్శకులు త్రివిక్రమ్‌, రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి ‘సిరివెన్నెల’భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అభిమానుల సందర్శనార్థం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని ఉదయం 10.30గంటల వరకూ ఫిల్మ్‌ ఛాంబర్‌లోనే ఉంచనున్నారు. అనంతరం 11గంటల సమయంలో మహాప్రస్థానానానికి తరలిస్తారు.

2.ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్‌తో చర్చకు సై

ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద  సీనియర్‌ పాత్రికేయుల సమక్షంలో ముఖ్యమంత్రి కోరినట్లు చర్చలకు సిద్ధమేనన్నారు. నాగరిక భాషలో మాట్లాడతాననే షరతుకు కేసీఆర్‌ అంగీకరిస్తే తను చర్చకు వస్తానని స్పష్టం చేశారు.

3.కళాశాలలకు చెల్లించాల్సిన బాధ్యత తల్లులదే

‘జగనన్న విద్యాదీవెన కింద బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన బోధన రుసుముల్ని వారం.. 10 రోజుల్లో కళాశాలలకు చెల్లించాల్సిన బాధ్యత విద్యార్థుల తల్లులపై ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన ఫీజులు అందినా చెల్లించకపోతే తదుపరి విడతలో నేరుగా కళాశాలలకే ఇవ్వక తప్పదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని వినయపూర్వకంగా కోరుతున్నా’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తల్లులు ప్రతి 3 నెలలకోసారి కళాశాలకు వెళ్లి ఫీజులు చెల్లించి.. పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుంటారని చెప్పారు.

4.ప్రభుత్వ వర్సిటీల్లోనూ చదువుకొనాల్సిందే!

ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా ప్రైవేటు కళాశాలలు, వర్సిటీల మాదిరిగా అధిక ఫీజుల వసూళ్లకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు పెంచుకోవడానికి అనుమతించడంతో..రెగ్యులర్‌ కోర్సుల్లోని సీట్లను కూడా సెల్ఫ్‌ ఫైనాన్స్‌గా మార్చి విద్యార్థుల నుంచి వీలున్నంత పిండుకునేందుకు సిద్ధమయ్యాయి.

5.ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు?

ఉత్తరాంధ్ర, పరిసర జిల్లాలకు తుపాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఈ నెల 4 నాటికి తుపానుగా మారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో డిసెంబరు 3, 4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని వాతావరణ విభాగం హెచ్చరించింది.

6.మహమ్మారి దశ ముగియనుందా!

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొవిడ్‌-19 ఉపశమించనుందా? ‘మహమ్మారి’గా ఉన్న ఈ వ్యాధి తీవ్రత తగ్గనుందా? ఎప్పటికీ ఉండిపోయే సాధారణ ఇన్‌ఫెక్షన్‌ (ఎండెమిక్‌)లా ఇది మారిపోతుందా? ఈ ప్రశ్నలకు కొందరు శాస్త్రవేత్తలు ఔననే సమాధానమిస్తున్నారు. కరోనాలో కొత్తగా వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇందుకు దోహదపడొచ్చని వారు చెబుతున్నారు.

7.ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయింది

పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో ప్రత్యేక కేటగిరీ హోదా అంశం ముగిసిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పటిలోగా ప్రత్యేక హోదా ప్రకటిస్తారు? విభజన చట్టంలోని హామీలను ఎంతవరకు అమలుచేశారంటూ తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు.. మంత్రి సమాధానమిచ్చారు.

8.ఒమిక్రాన్‌పై భయం వద్దు.. భారతీయులు దీన్ని తట్టుకోగలరు

ఒమిక్రాన్‌ కానీ, మరేదైనా కొత్త వేరియంట్‌ను కానీ తట్టుకునే శక్తి అత్యధిక భారతీయులకు ఉన్నందున ఎవరూ భయాందోళనలు చెందనక్కర్లేదని సుప్రసిద్ధ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ షాహిద్‌ జమీల్‌ భరోసా ఇచ్చారు. అయితే, మాస్కులు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఒమిక్రాన్‌తో ఆగమాగం

9.కొవాగ్జిన్‌ను ఒమిక్రాన్‌పై పరిశోధిస్తున్నాం: భారత్‌ బయోటెక్‌

కొత్తగా వెలుగులోకి వచ్చిన కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ‘కొవాగ్జిన్‌’ టీకా ఎలా పనిచేస్తుందో పరిశోధిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ మంగళవారం వెల్లడించింది. ‘చైనాలోని వుహాన్‌లో పుట్టిన కొవిడ్‌ వైరస్‌ను నిరోధించేలా కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాం. ఈ టీకా డెల్టా సహా ఇతర వేరియంట్లపైనా సమర్దంగా పని చేసింది.

10.27 మంది ముద్దు

ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రక్రియ పూర్తయింది. ఎనిమిది ఫ్రాంఛెజీల్లో ఒక్కోటి నలుగురి చొప్పున కలిపి గరిష్ఠంగా 32 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉండగా.. 27 మంది క్రికెటర్లే పాత ఫ్రాంఛైజీలతో కొనసాగనున్నారు. అనుకున్నట్లే సన్‌రైజర్స్‌ డేవిడ్‌ వార్నర్‌ను వదులుకోగా.. రషీద్‌ ఖాన్‌ ఆ జట్టుకు దూరమయ్యాడు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని