Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 02 Dec 2021 09:27 IST

1.‘ఒమిక్రాన్‌’పై ఆందోళన వద్దు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. కొవిడ్‌పై వదంతులతో ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని.. సరైన సమాచారాన్ని, సూచనలను ఎప్పటికప్పుడు అందించడమే ఇందుకు పరిష్కార మార్గమని చెప్పింది. గతంలో ఏర్పాటైన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పునరుద్ధరించి.. 24/7 విధానంలో పనిచేయించాలని నిర్ణయించింది.

2.ఏపీకి సహకరిస్తాం

ఆంధ్రప్రదేశ్‌కు తమ వంతు సహకారం అందిస్తామని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. విభజనతో హైదరాబాద్‌ నగరాన్ని కోల్పోయినందున ఆదాయం తగ్గిందన్న విషయం తమకు తెలుసని, రెవెన్యూ లోటు పూడ్చేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై మరోసారి సమగ్ర అధ్యయనం చేస్తే.. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు.

అఖండ రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

3.ఇసుక ఉంది కొంటారా?

ఇంటి నిర్మాణ పనులు మొదలైతే యజమానులు ఎక్కువగా ఆందోళన చెందేది ఇసుక గురించే. గతంలో అది దొరకడమే గగనంగా ఉండేది. దళారులు అడిగినంత ధర చెల్లించాల్సి వచ్చేది. కానీఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ఇసుక కొనేవారి కోసం అటు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ)తో పాటు విక్రయదారులు ఎదురుచూస్తున్నారు. గతంలో ఆన్‌లైన్‌లో పెట్టిన అరగంటలోపే బుకింగ్‌ అయిపోయేది. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ సమయంలో ప్రయత్నం చేసినా దొరుకుతోంది.

4.దేనికీ ప్లాన్‌!

రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో.. వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా భవనాల ప్లాన్ల వివరాలు సేకరిస్తున్నారు. విషయమేంటో స్పష్టంగా చెప్పకుండా ఉన్నట్టుండి ప్లాన్‌ కాపీలు ఎందుకు అడుగుతున్నారో తెలియక భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా అమల్లో ఉన్న అద్దె ఆధారిత పన్ను విధానాన్ని మార్చి, కొత్తగా మూలధన విలువ ఆధారిత పన్ను విధానం అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

5.వస్తున్నాయ్‌.. పోతున్నాయ్‌!

కరోనాలో కొత్త ఉత్పరివర్తనాలు వైద్య రంగానికి సవాలు విసురుతూనే ఉన్నాయి. డెల్టా, డెల్టాప్లస్‌, ఏవై.12 ఉత్పర్తివర్తనాల (మ్యుటేషన్ల) గురించి మరచిపోక ముందే తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ తెరపైకి వచ్చింది. వివిధ దేశాల్లో కొత్త ఉత్పరివర్తనం వెలుగులోకి వచ్చిన కొద్దికాలానికి మన రాష్ట్రంలోనూ ఆనవాళ్లు కనిపించాయి. అయితే... ఇప్పటివరకు బాధితులంతా సాధారణ జీవనాన్ని సాగిస్తున్నారని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు.

6.అయ్యర్‌ ఎవరి స్థానంలో..!

శ్రేయస్‌ అయ్యర్‌ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. కెప్టెన్‌ కోహ్లి స్థానంలో కాన్పూర్‌ టెస్టులో ఆడే అవకాశం దక్కించుకున్న అతడు.. సెంచరీ, అర్ధసెంచరీలతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు సాధించాడు. అయితే కెప్టెన్‌ కోహ్లి రెండో టెస్టుకు తిరిగి జట్టులోకి వస్తాడు. అంత గొప్ప ప్రదర్శన చేశాక శ్రేయస్‌ అయ్యర్‌ తప్పించే పరిస్థితి అయితే లేదు. మరి ఎవరిని తప్పిస్తారన్నది ప్రశ్న! ఈ నేపథ్యంలో అందరి దృష్టీ పేలవ ఫామ్‌లో ఉన్న అజింక్య రహానేపైనే.

7.డిసెం‘బరి’

డిసెంబర్‌లో అగ్ర తారల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం అరుదు. తెలుగు నాట సంక్రాంతి హడావిడి ముందే మొదలైపోతుంది కాబట్టి... డిసెంబర్‌ మొత్తం పెద్ద పండగకి వచ్చే సినిమాల హడావిడే ఎక్కువ. వాటికి సంబంధించిన ప్రచారం, వేడుకలతో చిత్రసీమ బిజీ బిజీగా గడుపుతుంటుంది. మహా అంటే క్రిస్మస్‌, జనవరి 1ని లక్ష్యంగా చేసుకుని ఒకట్రెండు సినిమాలు వస్తుంటాయంతే.

8.బానిసత్వం.. దైవదాస్యం

గగనంలో విహరించే మబ్బులు, సాగరంలో ఎగసిపడే కెరటాలు సర్వ స్వతంత్రాలు. వాటి స్వేచ్ఛా గమనాన్ని ఏ సంకెళ్లూ ఆటంకపరచలేవు. ఈ లోకంలో ఏ ప్రాణైనా అలాంటి స్వేచ్ఛనే కోరుకుంటుంది. తొలకరి పడగానే అబ్బురపరిచే నెమలి నాట్యం, చైత్రం రాగానే మధురంగా వినిపించే కోకిల గానం ప్రకృతిలో పులకించే జీవుల స్పందన.

9.ఐటీకి పండుగే

దేశీయంగా, అంతర్జాతీయంగా పలు రంగాల్లో చోటుచేసుకుంటున్న డిజిటలీకరణ, క్లౌడ్‌కు అనుగుణంగా సాంకేతిక వ్యవస్థల మార్పు వల్ల, ఐటీ వ్యయాలు ఎన్నడూ లేని గరిష్ఠస్థాయికి 2022లో చేరనున్నాయని పరిశోధనా సంస్థ గార్ట్‌నర్‌ అంచనా వేస్తోంది. ఇది భారత ఐటీ కంపెనీలకు కలిసొచ్చే పరిణామంగా తెలిపింది. వచ్చే మూడేళ్ల కాలం ఐటీ సేవల కంపెనీలకు భారీ అవకాశాలు లభిస్తాయనీ, అందుకే లక్ష్యాలను మించి ఫ్రెషర్లకు కంపెనీలు అవకాశాలిస్తున్నాయని పేర్కొంది.

10.20 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్‌

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్‌ గురించి తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూడటానికి ముందే... గత అక్టోబరులోనే ఈ కొత్త వేరియంట్‌ పలు దేశాలకు వ్యాపించినట్టు స్పష్టమవుతోంది. అయితే, దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది? టీకా వల్ల కలిగే రోగనిరోధక శక్తిని ఇది తప్పించుకుంటుందా? అన్న కీలక విషయాల్లో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని