Updated : 26 May 2022 09:01 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు


1.అడుగడుగునా నిఘా

ఆందోళనలు.. ఉద్రిక్తతలు.. విధ్వంసాల సెగ చల్లారినా.. కోనసీమ జిల్లాలో ఉత్కంఠకు మాత్రం తెరపడలేదు. తాజా పరిణామాలతో వివిధ జిల్లాల పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. అమలాపురం.. అన్ని మండలాల్లో పరిస్థితిపై నిఘా ఉంచారు. ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వ ఆస్తులకు భద్రత పెంచారు. అదనపు డీజీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో కాకినాడ, తూ.గో., ప.గో., గుంటూరు, కృష్ణా జిల్లాల ఎస్పీల సారథ్యంలో ప్రత్యేక బృందాలుగా భద్రత కట్టుదిట్టం చేసి.. అల్లర్లకు పాల్పడిన వారిని సాంకేతికత ఆధారంగా వెతికిపట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


2. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పార్టీలపై ఈసీ చర్యలు

సేకరించిన విరాళాల వివరాలు సమర్పించకపోవడం, పేరు, చిరునామా, కార్యవర్గ సభ్యుల మార్పు తదితరాలను వెల్లడించకుండా నిబంధనలు ఉల్లంఘించిన రాజకీయ పార్టీలపై చర్యలకు ఉపక్రమించినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం వెల్లడించింది. పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ గుర్తింపు పొందని 2,100కు పైగా రాజకీయ పార్టీలపై ఈ చర్యలను తీసుకోబోతున్నట్లు తెలిపింది.  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


3. పటీదార్‌ ఫటాఫట్‌

రజత్‌ పటీదార్‌!  ఈ లీగ్‌ దశలో వచ్చిన కొన్ని అవకాశాల్లో తన ఉనికిని చాటుకున్న ఈ బ్యాట్స్‌మన్‌ అసలు పోరులో విశ్వరూపం చూపించాడు. విధ్వంసక విన్యాసాలతో శతక్కొట్టేశాడు. ఫలితంగా బెంగళూరు ఎలిమినేటర్‌లో లఖ్‌నవూను మట్టికరిపించి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. పటీదార్‌ ఊచకోతతో కొండంత స్కోరు చేసిన బెంగళూరు..  బంతితో లఖ్‌నవూను కట్టడి చేసింది. లఖ్‌నవూ కెప్టెన్‌ రాహుల్‌ పోరాటం వృథా అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


4. ఒంగోలు.. పసుపువర్ణ శోభితం

తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు ఒంగోలులోని మండువవారిపాలెం వద్ద చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2018 తర్వాత నిర్వహిస్తున్న మహానాడు కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇనుమడించిన ఉత్సాహంతో ఉన్నారు. మొత్తం 83 ఎకరాల్లో సభావేదిక, ప్రాంగణం ఇప్పటికే పూర్తయ్యాయి. 20 వరకు భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి కుడివైపున ఫొటో గ్యాలరీ, రక్తదాన శిబిరం, మీడియా పాయింట్‌, వీఐపీల భోజనాలకు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


5. పదవులే పరమావధి కాదు

‘‘వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయమే అందరి ధ్యేయం కావాలి. ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. అందరికీ ఒకేసారి అవకాశాలు రావు. సమయానుకూలంగా వస్తాయి. పదవులే పరమావధి కాదు. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యమిస్తాం’’అని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. విపక్షాలు కాకమ్మ కబుర్లు చెబుతూ విషప్రచారం చేస్తున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


6.తప్పైపోయింది.. క్షమించండి: బోరిస్‌ జాన్సన్‌

 కొవిడ్‌-19 నిబంధనలు ఉల్లంఘించి.. తాను, తన ప్రభుత్వంలోని నేతలు, అధికారులు పాల్గొన్న మద్యం విందులపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ బుధవారం పార్లమెంట్‌లో క్షమాపణ చెప్పారు. ‘పార్టీగేట్‌’ కుంభకోణంగా పిలిచే ఈ విందులపై ఏర్పాటు చేసిన స్యూ గ్రే కమిషన్‌ తన తుది నివేదికను సమర్పించింది. ఇందులో ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


7. ఆనందో బ్రహ్మ

ఒకరికి భక్తిలో ఆనందం. ఇంకొకరికి సేవలో ఆనందం. మరొకరికి కర్తవ్య నిర్వహణలో ఆనందం. వేరొకరికి ఇహంలో ఆనందం. మరొకరికి మరోదాంట్లో ఆనందం. మొత్తానికది అపురూపం. ఆనందాన్వేషణ మార్గాలు వేరైతేనేం..  అదే జీవన పరమార్థం.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


8. మార్పును ఆహ్వానించగలరా?

కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగంలో చేరినవారు ఏకకాలంలో ఎన్నో వైవిధ్యభరితమైన లక్ష్యాలపై పని చేయాల్సి ఉంటుంది. ఎదురయ్యే సమస్యను బట్టి ఆలోచనా తీరు, మానసిక స్థాయి సవరించుకోవలసి ఉంటుంది. ఇందుకు కొత్త ఆలోచనా పద్ధతులు, కొత్త వాతావరణంలో సులభంగా ఒదిగిపోయే లక్షణాలు అలవాటు చేసుకోవాలి. మార్పు సహజమనీ, అనివార్యమనీ గ్రహించి దాన్ని స్వాగతించగలగాలి!  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


9. వేగానికి గొళ్లెం.. దూకుడుకు కళ్లెం

నగర రహదారులపై వేగంగా దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులకు కళ్లెం వేసేందుకు రవాణా శాఖ చర్యలు ప్రారంభించింది. ప్రమాదాల నివారణే లక్ష్యంగా కాలనీ రోడ్లు; రహదారులను విభాగినులు ఉన్నవి, లేనివి రెండుగా విభజించి వేగ పరిమితిని ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


10. గ్రెటా ఎలక్ట్రిక్‌ కొత్త విద్యుత్‌ స్కూటర్‌

గ్రేటా ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ సంస్థ సరికొత్త విద్యుత్‌ స్కూటర్‌ను విపణిలోకి విడుదల చేసింది. గ్రేటా హార్పర్‌ జెడ్‌ఎక్స్‌ సిరీస్‌-1గా వ్యవహరించే దీని ప్రారంభ ధర రూ.41,999 (ఎక్స్‌ షోరూం). బ్యాటరీ, ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వినియోగదారుడు తమ వినియోగం ఆధారంగా బ్యాటరీని, ఛార్జర్‌ను ఎంపిక చేసుకోవచ్చు.   క్యూయిజ్‌ కంట్రోల్‌, వైర్‌లెస్‌ కంట్రోలర్‌, హైవే లైట్స్‌, సైడ్‌ ఇండికేటర్‌ బజర్‌, ఎల్‌ఈడీ మీటర్‌ లాంటి ప్రత్యేకతలు ఈ కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో ఉన్నాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


 

 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని