Published : 11 Aug 2022 08:58 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. టోల్‌ కట్టినా.. గుంతల రోడ్లే దిక్కు!

జగదల్‌పూర్‌ వెళ్తున్న ఓ భారీ వాహనం అక్కడ మలుపు తిరగలేక ఇరుక్కుపోయింది. అంతే.. ఇరువైపులా ట్రాఫిక్‌ దాదాపు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. దీన్ని అక్కడి నుంచి తప్పించడానికి పోలీసులు క్రేన్లు దాదాపు 6గంటలవరకు శ్రమించాయి. వాహనాలు వెళ్లేందుకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో 6 గంటలు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. విజయవాడ-జగదల్‌పూర్‌ ఎన్‌హెచ్‌- 30 రహదారిపై ఈ సంఘటన జరగడం విశేషం.

2. కిలో బియ్యం 3 అణాలు.. తులం పసిడి రూ.42

ఇప్పుడైతే వంద.. రెండు వందలు ఖరీదు ఉన్నా సరే.. ఏ వస్తువునైనా కొనటానికి సంకోచించడం లేదు. ఎవరి చేతిలో చూసినా రూ.10వేలపైనే విలువ కలిగిన సెల్‌ఫోన్లు కనిపిస్తుంటాయి. స్వాతంత్య్రానికి పూర్వం ఇలా కాదు. రూపాయి చేతిలో ఉంటే అదే పెద్ద భాగ్యం. ఆ రోజుకు ఇళ్లు బ్రహ్మాండంగా గడిచేది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధకాలం (1939-1945).. అంటే భారత్‌కు స్వాతంత్య్రం రాక పూర్వం హైదరాబాద్‌ నగరంలో బంగారం నుంచి నిత్యావసర వస్తువుల వరకు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కొంత ఆసక్తే.

3. తగ్గిద్దాం ట్రాఫిక్‌ చిక్కులు

హైదరాబాద్‌ వాహనదారులు.. పాదచారులు రహదారులపై సాఫీగా ప్రయాణించేందుకు.. స్రాధ్యమైనంత వేగంగా గమ్యస్థానాలు చేరుకునేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రణాళిక రచిస్తున్నారు. ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న పైవంతెనల వద్ద ట్రాఫిక్‌ చిక్కులు తగ్గించేందుకు యత్నిస్తున్నారు. ఐటీ కారిడార్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్‌జాంలు అవుతుండడంతో దృష్టి కేంద్రీకరించారు.

4. విశాఖ జిల్లా కలెక్టర్లు...124

స్వాతంత్య్రం రాక మునుపే విశాఖ జిల్లా ఏర్పడింది. బ్రిటీష్‌, డచ్‌ పాలకులు తమ అవసరాల నిమిత్తం విశాఖను వాణిజ్య కేంద్రంగా వినియోగించుకొనేవారు. అప్పటిలో జిల్లా పాలన వ్యవహారాలు విశాఖ కేంద్రంగా సాగేవి. నాడు విశాఖను వైజాగ్‌పటంగా పిలిచేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలోని అయిదు జిల్లాలతో పాటు ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు విశాఖ జిల్లా పరిధిలో ఉండేవి. కాలక్రమేణ ఆయా ప్రాంతాలు విశాఖ నుంచి వీడి కొత్త జిల్లాలుగా అవతరించాయి.

5. చెరువు కనుమరుగైంది.. కాలువలా మారింది

హనుమకొండ 56వ డివిజన్‌లోని గోపాలపూర్‌ చెరువు పూడ్చివేత సమాప్తమైంది. భవిష్యత్తులో ఈ చెరువు కనిపించకపోవచ్చు. వందేళ్ల కిందట సర్వే నెంబరు.89లో 21.01 ఎకరాల భూమిలో చెరువు తవ్వినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. దీని కింద గోపాలపూర్‌, భీమారం, కోమటిపల్లి గ్రామాల పరిధిలో ఆయకట్టు ఉండేది. నాలుగేళ్ల కిందట మిషన్‌ కాకతీయ కింద చెరువులోని పూడికతీసి కట్ట పటిష్ఠం చేశారు.

6. మదనపల్లెపై విశ్వకవి ముద్ర..

భారతదేశ చరిత్రలో మదనపల్లెకు ఓ గుర్తింపు ఉంది. జాతి మొత్తం గర్వించే జనగణమన గీతాన్ని బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసిన ప్రాంతంగా, జనగణమన అని బాణి కట్టిన ప్రదేశంగా ఎంతో ప్రచుర్యం పొందింది. కోట్ల మంది తలెత్తుకుని పాడుకునే జాతీయ గీతం అనువాదానికి కేంద్రమైన మదనపల్లె చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచి పోయింది. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ నేషనల్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి హోదాలో 1919లో దక్షిణ భారదేశ పర్యటనలో భాగంగా బెంగళూరుకు వచ్చారు..

7. జాతీయ జెండా.. జాగ్రత్తలిలా

భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. భారతీయులు అందరూ గౌరవించే పతాకం. ఆ నిబద్ధతను శ్రద్ధాసక్తులతో నిర్వహించడం ప్రత్యేక బాధ్యత. జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేయడం జరుగుతోంది. జెండాను ఉపయోగించే సందర్భాల్లో పాటించే పద్ధతుల్లో జరిగే పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు పాల్పడకూడదు. అలా చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హం అవుతుంది.

8.  ‘సీతారామం’కు మాటిచ్చాడు.. మాటల రచయితగా రాణిస్తున్న కుర్రాడు

చిత్తూరు జిల్లా పెళ్లకూరు మండలం జీలపాటూరు గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ సినీరంగంలో రాణిస్తున్నాడు. తల్లిదండ్రులు కందమూడి శివకుమార్‌, యశోదలు. కొత్త ఆలోచనలకు పదనుపెడితే దూసుకెళ్లవచ్చని.. యువతకు ఈ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని నిరూపిస్తున్నాడు. ప్రాథమిక విద్య స్థానికంగా చదివిన యువకుడు ఇంటర్‌ నాయుడుపేటలో పూర్తిచేశాడు. ఇంజినీరింగ్‌ తిరుపతిలో పూర్తిచేశాక 2015లో ఉద్యోగం కోసం హైదరాబాద్‌ చేరాడు..

9. ఉచిత బస్సు ఎవరికో?పంద్రాగస్టు చిన్నారికి ‘ఆర్టీసీ’ అండ

స్వాతంత్య్ర వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక కార్యక్రమానికి నాంది పలికింది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15)రోజు జన్మించిన వారందరికి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఆయా లబ్ధిదారులు 12 ఏళ్లు వచ్చే వరకు రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా ఎలాంటి ఛార్జీ చెల్లించకుండా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

10. కలుపు పనుల్లో జీవితం మలుపు.. కాంతులీనుతున్న వజ్రపు రాయి

తుగ్గలి మండలం జి.ఎర్రగుడి పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న అదే గ్రామ రైతు కుటుంబానికి వజ్రం రూపంలో అదృష్టం వరించింది. టమాటా తోటలో బుధవారం కలుపు తీస్తుండగా రైతు కుమార్తెకు 10 క్యారెట్ల బరువున్న, విలువైన వజ్రం లభించింది. దాన్ని పెరవలి, జొన్నగిరి వ్యాపారులు కలిసి రూ.34 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని