Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు

Published : 18 Aug 2022 08:58 IST

1. ఇంటింటికీ బియ్యం కాదు.. నగదే..!

‘అదేంటి కేజీ రూ.10 చొప్పున ఇస్తున్నారు కదా..! నువ్వేంటి రూ7 అంటున్నావు’ ‘చాలా రిస్క్‌ అవుతుంది. అయినా బియ్యంలో నూక ఎక్కువగా ఉంది. నీ ఇష్టం అయితే ఇవ్వు. లేకపోతే లేదు’ ఇదీ ఎండీయూ ఆపరేటర్‌కు, లబ్ధిదారు రాలకు మధ్య జరిగిన సంభాషణ తరువాత లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా వేలిముద్ర వేయించుకుని నగదు ఇచ్చేశారు. ఇది ఒక చోట జరిగే తంతు కాదు.. రెండు జిల్లాల్లో చాలాచోట్ల జరుగుతోంది..

2. కానివ్వొద్దు..జంక్షన్లు జామ్‌

రాజధానిలో లక్షలమంది వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చేయూత ఇవ్వడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ముందుకు వచ్చారు. తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్న జంక్షన్లలో బస్టాప్‌లను వేరే చోటుకు మార్చడం, బస్సులు ఆగే ప్రాంతాలు జరిపే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం సంయుక్త కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు హామీ ఇచ్చారు.

3. ‘హయగ్రీవ’లో... పెద్దలకు విల్లాలు

విశాఖలోని ‘హయగ్రీవ’ స్థలాల వ్యవహారాలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. జీవీఎంసీ నుంచి పూర్తిస్థాయి అనుమతి రావాల్సి ఉన్నా... ఆలోపే అక్కడ పనులు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆయా భూ కేటాయింపులు, ప్రభుత్వానికి కలెక్టర్‌ రాసిన లేఖ, ఇతర అంశాలపై నిఘా వర్గాలు కన్నేసినట్లు తెలుస్తోంది.

4. పుస్తకాలు గప్‌చిప్‌..!!

శాస్త్ర, సాంకేతిక నిపుణులు రచించిన లక్షలాది పుస్తకాలకు మరింత భద్రత కల్పించేలా వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌)లోని గ్రంథాలయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. ఇందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీని అమలు చేశారు. ఎస్‌ఆర్‌.రంగనాథన్‌ జయంతి సందర్భంగా ఇటీవల జరిగిన జాతీయ గ్రంథాలయ దినోత్సవం రోజున ఈ సాంకేతికతతో పూర్తి స్థాయిలో అనుసంధానం చేసిన లైబ్రరీని డైరెక్టర్‌ ఆచార్య రమణారావు ప్రారంభించారు.

5. సింగపూర్‌ తెలుగు నారీ ‘నిషిత’

సింగపూర్‌లో తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఈనెల 13న నిర్వహించిన ‘శ్రీమతి సింగపూర్‌ తెలుగు నారీ-2022’ పోటీల్లో గాజువాకకు చెందిన కూచిపూడి నాట్యగురువు నిషిత యాబాజీకి మొదటిస్థానం దక్కింది. తుది పోటీలకు పది మంది మహిళలు ఎంపికవ్వగా, మొదటి స్థానం సాధించిన నిషిత ‘తెలుగు నారీ కిరీటం’ సొంతం చేసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా, సినీగాయని సునీత చేతుల మీదుగా నిషితకు కిరీటం, జ్ఞాపిక అందించారు.

6. ప్రభుత్వ ఉద్యోగులకు కేరాఫ్‌.. సర్వారం

ఆమెకు మొత్తం 9 మంది సంతానం. ఒక్కరు మినహా అందరూ ఆడవాళ్లే. ఒక్కగానొక్క కుమారుడు కలెక్టర్‌ కావాలన్నది ఆ తల్లి ఆశ. ఐఏఎస్‌ కావాలన్న కన్నతల్లి ఆశయాన్ని సాధించేందుకు ఆ కుమారుడు ఎంతో కష్టపడ్డారు. ఏకంగా 8 కొలువులు దక్కించుకున్నారు. చివరకు ఐఏఎస్‌గా ఎంపికై తల్లి నమ్మకాన్ని నిలబెట్టారు.  ఆయన పట్టుదల ఆ ఊరికే స్ఫూర్తిగా నిలిచింది. సర్వారం విజయబావుటాపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

7. బాదుడు ప్రభుత్వాన్ని సాగనంపండి

లేపాక్షి, న్యూస్‌టుడే: ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసి సామాన్య ప్రజల నడ్డి విరిచారని.. అటువంటి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రతిఒక్కరూ సైనికులై పనిచేయాలని  హిందూపురం  ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. లేపాక్షిలో బుధవారం తెదేపా మండల కన్వీనర్‌ జయప్ప ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.

8. సరిలేరు ఈ కాలనీవాసులకెవ్వరూ

మనమంతా సుఖ సంతోషాలతో, స్వేచ్ఛా వాతావరణంలో ఉన్నామంటే అందులో క్రియాశీలకమైన పాత్రను పోషిస్తోంది దేశ రక్షణ విభాగం. సరిహద్దుల్లో ఎండనకా, వాననకా, చలనకా, శరీరం మంచుతో గడ్డలు కడుతున్నా.. ఇలా ఎన్నో కష్టాలనెదుర్కొంటూ నిత్యం పహారా కాస్తున్నారు సైనికులు. అలాంటి అరుదైన రంగమైన ఆర్మీలో ఒకే కాలనీకి చెందిన వారు అధికంగా ఉండడం విశేషం.

9. బస్సు ఆగిందా.. ప్రయాణం గోవిందా..!

విజయవాడ నగరం, సబర్బన్‌ ప్రాంతాల్లో తిరిగే సీఎన్జీ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. మరమ్మతులు చేసి రోడ్డెక్కించాలంటే ఆర్టీసీ అధికారులకు తలప్రాణం తోకకు వస్తోంది. వీటికి విడిభాగాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఫలితంగా రోజుల తరబడి గ్యారేజీలకే పరిమితం అవుతున్నాయి.

10. అసలేం జరుగుతోంది?

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన తెలంగాణ విశ్వవిద్యాలయంలో మరోసారి అనూహ్య పరిణామం చోటు చేసుకొంది. ప్రస్తుత రిజిస్ట్రార్‌ ఆచార్య శివశంకర్‌ స్థానంలో తాత్కాలికంగా ఆచార్య విద్యావర్ధిణిని నియమిస్తూ వీసీ ఆచార్య రవీందర్‌ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. గతేడాది మేలో వీసీగా వచ్చినప్పటి నుంచి ఆయన..

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని