Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 29 Sep 2022 09:02 IST

1. గుండె గోస విందాం.. యువతలో పెరుగుతున్న సమస్యలు

ఏటా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి నగరంలో 10 వేల వరకు బైపాస్‌ శస్త్ర చికిత్సలు చేస్తుంటారనేది అంచనా. హృద్రోగ సమస్యలతో వైద్యుల వద్దకు వచ్చే వారిలో 30-39 ఏళ్ల వారే 56 శాతం మంది వరకు ఉంటున్నారని ఓ ప్రముఖ హెల్త్‌కేర్‌ సంస్థ తన అధ్యయనంలో తేల్చింది. హైదరాబాద్‌ లాంటి మహానగరాల నుంచే గుండె సమస్యలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు ఉంటున్నాయని పేర్కొంది. గురువారం ప్రపంచ హృద్రోగ దినం సందర్భంగా కథనం..  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. సత్వర అవకాశాలకు.. ఫిజియో థెరపీ దారి!

ప్రమాదాలు, రుగ్మతలతో ఇబ్బంది పడుతున్నవారు ఫిజియోథెరపీతో సాంత్వన పొందుతున్నారు. ఆధునిక జీవన శైలి, వివిధ వృత్తుల పనివిధానం దీని ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి. నొప్పులు, శస్త్ర చికిత్సల నుంచి కోలుకోవడానికి వైద్యులు సిఫారసు చేస్తుండటంతో ఫిజియోథెరపిస్టులకు గిరాకీ పెరిగింది. ఏదో ఒక ఇబ్బందితో ఫిజియో థెరపిస్టులను సంప్రదించడం ఇప్పుడు సాధారణమైంది. ఇంటర్‌ తర్వాత ప్రాధాన్యమున్న కోర్సుల్లో ఒకటైన ఫిజియోథెరపీపై ఆసక్తి ఉన్నవారు దీనిలో శిక్షణ పొందడానికి అడుగులేయవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. సికింద్రా‘బాధ’ లేకుండా పార్కింగ్‌.. రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నారిలా..

 సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ 1 వైపు ప్రయాణికుల కోసం వచ్చే వాహనాలు ఎక్కడ నిలపాలో తెలియని గందరగోళానికి దక్షిణమధ్య రైల్వే చెక్‌ పెడుతోంది.  రూ.600కోట్లతో స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్న క్రమంలో పార్కింగ్‌ ఇబ్బందులు తొలగించడానికి సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. తొడలు కొట్టినంత మాత్రాన నాయకులు కాలేరు: ఎంపీ కేశినేని

ఇళ్లలో కూర్చుని మాట్లాడుతూ, ఎక్కడో ఉండి తొడలు కొట్టినంత మాత్రాన నాయకులు కాలేరని విజయవాడ ఎంపీ, తెదేపా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త కేశినేని నాని వ్యాఖ్యానించారు. బుధవారం విజయవాడ పాతబస్తీ జెండా చెట్టు వీధిలో నూతనంగా నిర్మించిన తెదేపా పశ్చిమ నియోజకవర్గ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని ప్రారంభించారు. కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారాకరామారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. Video game: సైక్లింగ్‌ చేస్తూ.. వీడియో గేమ్‌ ఆడేయొచ్చు!

ఇంట్లో వ్యాయామ సాధన చేసేందుకు బైక్‌లు అందుబాటులో ఉంటాయి. నిత్యం వాటిపై సైక్లింగ్‌ చేయాలంటే కొందరు అనాసక్తి ప్రదర్శిస్తుంటారు. అందుకే వ్యాయామానికి డుమ్మా కొడుతుంటారు!. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి జోష్‌ ఇలియాస్‌ జాయ్‌ వినూత్న ఆలోచన చేశాడు. వ్యాయామ బైక్‌పై సైక్లింగ్‌ చేస్తూ వీడియోగేమ్‌ ఆడుతూ.. ఎంతో ఆసక్తితో కసరత్తులు చేయవచ్చని భావించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఏదొకటి చెప్పెయ్‌... కాలం గడిపెయ్‌

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) చుట్టూ కాళ్లరిగేలా ప్రజలు తిరుగుతున్నా పనులు కావడం లేదు.కలెక్టరు మల్లికార్జున ఇన్‌ఛార్జి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రతి సోమవారం ‘స్పందన’ నిర్వహించి వినతులు స్వీకరిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు వాటిపై స్పందించడం లేదనే విమర్శలొస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌... ఇలా అవ్వొచ్చు!

ఆర్థికరంగంపై అవగాహన ఉన్నవారికి... స్వశక్తితో ఎదగాలనే ఆసక్తి ఉన్నవారికి... ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ చక్కని కెరియర్‌ ఆప్షన్‌. గ్రాడ్యుయేషన్‌, ఆపైన అర్హతతో ప్రవేశించే అవకాశం ఉన్న ఈ రంగంలో... మంచి నైపుణ్యాలు కలిగిన వారిప్రయాణం నల్లేరుపై బండి నడకే! ప్రతిరోజూ కొత్త సవాళ్లతో ఉత్సాహంగా అనిపించే ఈ విభాగంలో అడుగుపెట్టాలంటే... పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ఆకట్టుకున్న ఆయుధ బలం

ఎన్‌ఎస్‌టీఎల్‌ (నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజికల్‌ లేబొరేటరీ- నావిక సమరశాస్త్ర సాంకేతిక ప్రయోగశాల)లో ‘ఎలక్ట్రో కెమికల్‌ ఎనర్జీ కన్వర్షన్‌ అండ్‌ స్టోరేజ్‌-2022(ఈకోస్‌-2022)’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సముద్రం అడుగు భాగంలో వినియోగించే వాహనాల బ్యాటరీలతో సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. వాటిల్లో కొన్నింటి పనితీరు ఇలా.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ప్రశాంతత.. గుండె భద్రత

ఒకప్పుడు 40-50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే గుండెపోటు.. ప్రస్తుతం  చిన్న వయసుల వారికీ  వస్తోంది. సంప్రదాయ ఆహార  పద్ధతులు విస్మరించడం.. నోటికి రుచికరమైన ఆహారం దొరకగానే మోతాదుకు మించి తీసుకోవడం.. తీసుకున్న ఆహారం ఖర్చు అయ్యేలా వ్యాయామం చేయకపోవడం.. దానికితోడు చెడు అలవాట్లు.. చేసిన పొరపాట్లపై  ఒత్తిడికి గురికావడం వంటి కారణాలతో గుండె సంబంధిత వ్యాధిగ్రస్థులు పెరుగుతున్నారు. కొవిడ్‌ అనంతరం హృద్రోగుల సంఖ్య పెరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. చేపా.. చేపా.. ఎందుకు చిక్కలేదు?

ఆక్వా హబ్‌లు అందుబాటులోకి రాలేదు. మినీ రిటైల్‌ ఔట్‌లెట్లు తెరుచుకోలేదు. వెరసి వినియోగదారులకు తాజా చేపలు.. రొయ్యలు అందుబాటులోకి రాలేదు. ఇదండీ.. ఫిష్‌ ఆంధ్ర ప్రాజెక్టు పరిస్థితి. కాకినాడ జిల్లాలో రెండు ఆక్వా హబ్‌లు, 294 మినీ ఔట్‌లెట్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ ఏడాది జూన్‌ 22 నాటికి వీటిని ప్రారంభించాల్సి ఉంది. ప్రచారం లేకపోవడం, మత్స్యకారుల నుంచి ఆదరణ లభించకపోవడంతో ముందడుగు పడలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని