Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 07 Oct 2022 08:59 IST

1. హైదరాబాద్‌ శివారులో స్టేషన్లున్నా.. ఆగని రైళ్లు

హైదరాబాద్ శివారులో చాలా రైల్వే స్టేషన్లున్నాయి. ఆ స్టేషన్లలోనూ దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఆగితే వేల మంది ప్రయాణికులకు వెసులుబాటుగా ఉంటుంది. కానీ ఆగకపోవడంతో ప్రయాణికులు ప్రధాన స్టేషన్లకు వెళ్తుండటంతో అక్కడ ఒత్తిడి పెరుగుతోంది. ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ దూరప్రాంతాల రైళ్లను ఎందుకు ఆపరో అర్థం కావడం లేదని జంటనగరాల ప్రయాణికుల సంఘం ప్రధానకార్యదర్శి నూర్‌మహ్మద్‌ అన్నారు. ఇదే పరిస్థితి మల్కాజిగిరి, మౌలాలి స్టేషన్లదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. దసరా ముగిసినా.. దోపిడీ ఆగలే!

రాజధానికి చెందిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు దసరా పండుగ తర్వాత కూడా టిక్కెట్ల ధరల దోపిడీని ఆపడం లేదు. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పటికీ విమానం టిక్కెట్‌ రేట్లతో సమానంగా రేట్లను పెంచి వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు సాధారణ రోజుల్లో రూ.800 ఉండే టిక్కెట్‌ ధర ఈనెల 9న వచ్చేందుకు బుక్‌ చేసుకుంటే ఏకంగా రూ.3200 వసూలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. రూ.28 కోట్లు తాగేశారు

తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగ వచ్చిందంటే చాలు సంబరాలు అంబరాన్నంటుతాయి. రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకోలేదు. ఈ సారి మాత్రం ఏ గ్రామంలో చూసినా సంబరాలు ఘనంగా సాగాయి. ఈ ఏడాది అక్టోబర్‌ మొదటి వారంలోనే దసరా రాగా అనుకున్నదాని కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. పన్ను వసూళ్లకు చెత్త మార్గం

చెత్తపన్నుపై వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. పలు మర్గాల్లో ప్రజలపై ఒత్తిడి తెస్తూ వాలంటీర్లు, వార్డు కార్యదర్శులకు లక్ష్యాన్ని నిర్దేశించి మరీ ముక్కుపిండి వసూలు చేస్తోంది. చెత్త పన్నును ఎలాగైనా వసూలు చేసేందుకు సామ, దాన, దండోపాయాలను వినియోగిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ఎంత పనిచేసిందబ్బా గొర్రె!

గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేసినప్పటికీ దాన్ని తీసుకునే వీల్లేకుండా చేయడంతో కొందరు లబ్ధిదారులు నిరాశ చెందుతుండగా, దళారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఈ పథకం కింద గతంలో పశువైద్యుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు జీవాలను కొనుగోలు చేసి ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో మోసాలు జరిగినట్టు సర్కారుకు ఫిర్యాదులు వచ్చాయి.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. నేటి నుంచి మునుగోడులో నామినేషన్లు

మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం శుక్రవారం(7వతేదీ) నుంచి 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. శుక్రవారం ఉదయం ఎన్నికల అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. సిమ్‌ మార్చకుండానే ‘5జీ’ సేవలు

వినియోగదార్లు కనుక 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడుతుంటే, సిమ్‌ను మార్చకుండానే 5జీ సేవలను పొందొచ్చని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పుర్, వారణాసి వినియోగదారులు 5జీ ప్లస్‌ సేవలను దశలవారీగా పొందొచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నెట్‌వర్క్‌ నిర్మాణాన్ని కొనసాగిస్తుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. ‘సూపర్‌ ఫాస్ట్‌’ కాల్‌ కనెక్ట్‌తో 20-30 రెట్ల అధిక వేగం ఉంటుందని వెల్లడించింది. ‘ఏ 5జీ మొబైల్‌తోనైనా, ప్రస్తుతమున్న సిమ్‌పై 5జీ సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విత్తల్‌ తెలిపారు.

8. అను‘మతిలేని’ నిర్ణయం..!

కాణిపాకంలోని సుప్రసిద్ధ వరసిద్ధి వినాయక ఆలయంలో పంచామృతాభిషేకం టికెట్‌ ధర పెంపు నిర్ణయం వివాదాస్పదంగా మారింది. స్వామి మూలవిరాట్టుకు నిత్యం మూడు విడతలుగా పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. ఆ టికెట్‌ ధరను ఏకంగా రూ. 700 నుంచి రూ. 5,000కు పెంచాలని నిర్ణయించారు. అలాగే రోజుకు ఒక్కసారే అభిషేకం నిర్వహించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. నీరుగారుతున్న ‘నాడు-నేడు’!

ఆసుపత్రిలోని ప్రసూతి గది కురుస్తుంటే.. అందులోని గర్భిణి తడవకుండా పురుడు పోసేందుకు సిబ్బంది నానా కష్టాలుపడ్డారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ‘నాడు-నేడు’ పనులు చేపట్టారు. బిల్లులు రాలేదని గుత్తేదారు పనులు ఆర్నెల్ల కిందట వదిలేశారు. ఆసుపత్రి పైకప్పు పెచ్చులు పెకలదీసి, శిథిలాలను అక్కడే ఉంచారు. వర్షాలకు పైకప్పు నుంచి నీరు లీకవుతోంది. ప్రసవాలు చేసే గదీ కురుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. కమిటీ ఏర్పాటు ఊసే లేదు.. సాగర్‌ ప్రక్షాళన జాడే లేదు

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన, కాలుష్య నియంత్రణ, వ్యర్థ జలాల శుద్ధి ప్రక్రియపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు అమలు కావడం లేదు. పట్టణాభివృద్ధిశాఖ, అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని సంయుక్త కమిటీ పర్యవేక్షించాలని నెలలోపు సమావేశమై ఆరు నెలల ప్రణాళిక సిద్ధం చేయాలని జులైలో ఆదేశించింది. ఇప్పటివరకూ కమిటీ సమావేశమైన దాఖాలాలు లేవు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని