Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 20 Oct 2022 08:58 IST

1. Hyderabad: అందరి చూపు.. 3బీహెచ్‌కే ఫ్లాట్ల వైపే..

రాజీవ్‌ స్వగృహకు సంబంధించి బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్లలో ఎక్కువ మంది 3బీహెచ్‌కె, 3బీహెచ్‌కె డీలక్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు 500 మంది టోకెన్‌ అడ్వాన్సుకు డీడీలు తీయగా... అందులో 300 మంది వరకు ఆ రెండు రకాల ఫ్లాట్లనే ఎంచుకున్నారు. గతంలో బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లకు లాటరీ నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 35 వేల మంది రూ.వేయి వంతున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఒక్కో సేవ.. పేదలకు చేరువ!

కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటైన సూపర్‌ స్పెషాలిటీ  ఆసుపత్రిలో పేదలకు ఖరీదైన వైద్య సేవలు అందుతున్నాయి.  రూ.150 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏర్పాటుచేసిన ఈ దవాఖానాలో ఇప్పుడు క్యాన్సర్‌ శస్త్రచికిత్సలూ అందుబాటులోకి వచ్చాయి. మహారాష్ట్ర నుంచీ రోగులు వచ్చి శస్త్రచికిత్సలు చేయించుకొని వెళ్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఉచితం.. కొనసాగిద్దాం

గ్రేటర్‌ ప్రజలకు జలమండలి అధికారులు ఉచిత తాగునీటి పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. నెలకు 20 వేల లీటర్ల వరకూ వినియోగించే వినియోగదారులకు అవకాశాన్ని ఇవ్వాలని అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి కనెక్షన్‌కు ఆధార్‌ను ఇంకా అనుసంధానించుకోని వినియోగదారులకు పథకాన్ని వివరించాలని సిబ్బందికి సూచించారు. వాస్తవానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో నివసిస్తున్న వారిలో నెలకు 20వేల లీటర్లు ఉచితంగా ఇవ్వాలని 2020వ సంవత్సరంలో సర్కార్‌ నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఊరుకొక ఎస్సై.. మండలానికో డీసీపీ!

మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం అధికార యంత్రాంగానికి, పోలీసులకు కత్తిమీద సాములా తయారైంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికల ఫలితాలు సంచలనం రేపనున్నాయి. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దేశం దృష్టిని ఆకర్షించే అవకాశముంది. పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కుటుంబ వైద్యునికి కుదరని లగ్నం

ప్రతి ఇంటికీ ప్రభుత్వ వైద్యసేవలు చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలనుకున్న ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమానికి లగ్నం కుదరడం లేదు. ఉద్దేశం మంచిదే అయినా ప్రాథమికంగా అవసరమైన వసతులు సమకూర్చకుండానే చేస్తున్న హడావుడితో పథక లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అంధకారంలో జగనన్న కాలనీ వాసులు

జగనన్న కాలనీలలో సొంత ఇంటి నిర్మాణం పూర్తిచేసుకుని దిగిన వారికి సరైన సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. సొంత ఇంటి నిర్మాణం కోసం బయట వడ్డీలకు అప్పులు తెచ్చుకుని మరీ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకుని, బయట అద్దెలు భరించలేక  ఇక్కడికి వచ్చిన వారికి ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. కొంతమంది ఇళ్లల్లో ఉండలేక తాళాలు వేసుకుని మళ్లీ అద్దె ఇళ్లకు వెళ్లిపోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సైజు మారదు.. కాలు దూరదు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. జగనన్న విద్యాకానుకలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు ఇస్తామన్నారు. వీటి సరఫరాలో జాప్యం జరిగింది. ఇప్పటికీ కొన్ని పాఠశాలలకు వస్తూనే ఉన్నాయి. ఇచ్చిన వాటిలో సైజులు సరిపోక విద్యార్థులు నానాపాట్లు పడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణాంకాల ప్రకారం 4,26,000 మందికి బూట్లు అందాలి. సరఫరాలో పలు లోపాలు తలెత్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గ్రామపంచాయతీలకు మళ్లీ షాక్‌!

వైకాపా ప్రభుత్వానికి నిధుల దాహం తీరడంలేదు. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం కింద మంజూరైన నిధులను విద్యుత్తు బకాయిలకు చెల్లించాలనే ఒత్తిళ్లు పెరిగాయి. ఇది వరకు ప్రభుత్వమే రెండు సార్లు గుట్టుచప్పుడు కాకుండా నిధులను మళ్లించుకుపోగా... విమర్శలకు జడిసి ఈ సారి ఆ పని సర్పంచుల చేతులమీదుగానే బలవంతంగా చేపట్టే ఎత్తుగడ వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఈ యాప్‌లో సగం ధరలకే కొనుక్కోవచ్చు

పుస్తకాలు, ఇతర వస్తువులను ఎప్పటికప్పుడు కొత్తగా కొనుక్కునే పరిస్థితి విద్యార్థులందరికీ ఉండదు. అలాగని అవసరాలను వాయిదా వేసుకోలేరు. అలాంటివారికి పాత వస్తువులను సగం ధరకే అందించే యాప్‌ అందుబాటులో ఉంది. ఉన్నత విద్య కోసం నగరాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు ఎంతోమంది ఉంటారు. వీరికి మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లెట్స్‌, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌, ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌ సెట్స్‌... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దీపావళికి పసిడి మెరుపులు

బంగారం-వెండి వంటి విలువైన లోహాల కొనుగోళ్లకు మంచిరోజుగా భావించే ధన త్రయోదశికి గిరాకీ బాగుంటుందనే ఆశాభావాన్ని విక్రయ సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో విక్రయాలు బాగా జరిగాయి. ధరలో కూడా పెద్ద మార్పు లేనందున, ఈసారి ఆ స్థాయిలోనే అమ్మకాలు జరుగుతాయని భావిస్తున్నారు. అయితే అధిక ద్రవ్యోల్బణం వల్ల జీవన వ్యయాలూ పెరగడం ఒక్కటే అవరోధమని పేర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని