Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
vvఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. ఆన్‌లైన్‌లో దిశా నిర్దేశం.. సందేహాలను తీర్చే సైట్లు
నేర్చుకునే క్రమంలో విద్యార్థులకు అనేక సందేహాలు వస్తుంటాయి. ఇంజినీరింగ్, సైన్స్, కామర్స్, పాలిటీ, వైద్య విద్య, మేనేజ్‌మెంట్.. సబ్జెక్టు ఏదైనా సరే, చదివేటప్పుడు పూర్తిగా బోధపడదు. తరగతిలో అయితే వెంటనే అధ్యాపకులను అడిగి సందేహ నివృత్తి చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంట్లో చదువుకునేప్పుడూ కొన్ని అనుమానాలు రావొచ్చు. వాటిని వెంటనే తీర్చుకోవడం వల్ల విషయం స్పష్టంగా అర్థమై సంబంధిత అంశంపై పట్టు సంపాదించడానికి వీలవుతుంది. ఇందుకు తోడ్పడే కొన్ని వెబ్‌సైట్ల వివరాలను క్లుప్తంగా తెలుసుకుందామా? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ధరణి దగాలో కొత్త కోణాలు?
తిమ్మిని బమ్మి చేయడంలో సిద్ధహస్తులమని నిరూపించారు. ఉన్నతాధికారులనే కంగుతినిపించారు. భూ మోసాల్లో కొత్త కోణాలను ఆవిష్కరించారు. కాసుల కక్కుర్తి కోసం ఉన్నతాధికారుల కళ్లుగప్పారు. జిల్లాలో సంచలనాన్ని రేకెత్తించిన ధరణి రికార్డులో పేరు మార్పిడి వ్యవహారంలో కొందరు అక్రమార్కుల తీరిది. రెవెన్యూ శాఖనే కంగు తినిపించేలా జరిగిన ఘోర తప్పిదాన్ని సరిదిద్దుకునే పనిలో ఉన్నతాధికారులున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. Hyderabad: అదీమ్ వెనుక భారీ నెట్‌వర్క్.. అతడి ఫోన్లో 49,900మంది యువతుల చిత్రాలు
మహ్మద్ అదీమ్(31) అలియాస్ అర్నవ్, అభయ్, అర్నబ్, అర్నాఫ్, అరోరా, ఆశవ్, అతీఫ్, నిఖిల్.. సంచలనం సృష్టించిన అంతర్జాతీయ వ్యభిచార ముఠా కేసులో ప్రధాన నిందితుడి మారు పేర్లు ఇవి! భారీ నెట్‌వర్క్‌తో పెద్దఎత్తున వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న ఇతడు ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులకు దొరికాడు. దర్యాప్తులో భాగంగా ఇతని గురించి తెలుసుకుని పోలీసులే విస్తుపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Video: ఇంగ్లీష్‌తో పాటు ఇతర విదేశీ భాషల్లోనూ రిక్షా కార్మికుల ప్రతిభ
4. జగనన్న కాలనీ ఇళ్లకు బీటలు!
విజయవాడ నగర పాలక సంస్థ పరిధి గుబ్బలగుట్ట కొండ ప్రాంతంలో జరుగుతున్న బాంబు పేలుళ్ల ప్రభావం జగనన్న కాలనీలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లపై పడింది. కొండ శిథిలాలను భారీ వాహనాల్లో లేఔట్‌లోని ఇళ్ల మధ్యగానే తరలిస్తుండటంతో వాహనాల రాకపోకల ధాటికి ఇళ్ల గోడలు దెబ్బతింటున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికే పలు ఇళ్ల గోడలకు బీటలు పడటంతో వారంతా ఏం చేయాలో తెలియక అధికారులకు తమ గోడు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. Hyderabad: సిటీ బస్సులుగా ‘సూపర్ లగ్జరీ’లు
కిక్కిరిసిన బస్సుల్లో ఇబ్బంది పడుతూ ప్రయాణిస్తున్న వారికి కాస్త ఊరటనిచ్చేలా టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది 300 ఎలక్ట్రిక్ బస్సులు సమకూరేలోపు అదనంగా 700 బస్సుల వరకూ సమకూర్చాలని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొత్తగా వచ్చిన వాహన చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన బస్సు తుక్కుగా మారాల్సిందే. 2023 నుంచి 300 సిటీ బస్సులు తుక్కుగా మారనున్నాయి. అందుకే అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు పిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. గృహప్రవేశానికి ధరల సెగ
నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లు పథకానికి ఈ ఏడాది డిసెంబర్ 25తో రెండేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఈనెల 21న ప్రభుత్వం పెద్దఎత్తున సామూహిక గృహప్రవేశాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీన్లో భాగంగా జిల్లాలో తొమ్మిది వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది లక్ష్యం. అయితే గడువు నాటికి జిల్లాలో లక్ష్యం మేర ఇళ్ల నిర్మాణాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Video: రష్యాలోని కుర్స్క్ విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడి
7. మన మెట్ల బావులనూ బాగు చేద్దాం
రాజధాని నగరం సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలో చెత్తతో నిండిన మెట్ల బావిని ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది. రూ.10 కోట్లు కేటాయించి అందులోని 3900 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు. మంత్రులు కేటీఆర్ దీన్ని సోమవారం ప్రారంభించారు. ఓరుగల్లు నగరంలోనూ ఇలాంటి మెట్ల బావులు అయిదు ఉన్నాయి. వీటినీ పర్యాటక ప్రాంతాలుగా మారిస్తే రాజధానిని మించి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఒకే ప్లాన్.. 184 దేశాల్లో సేవలు: ఎయిర్‌టెల్
కొవిడ్-19 పరిణామాల తర్వాత అంతర్జాతీయ పర్యటనలు పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ‘ఎయిర్‌టెల్ వరల్డ్ పాస్’ ప్లానును ప్రారంభించినట్లు భారతీ ఎయిర్‌టెల్ వెల్లడించింది. ఒకే ప్లాన్‌తో 184 దేశాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా సేవలను అందుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. ప్రస్తుత ఛార్జీలతో పోలిస్తే, ఈ దేశాల్లో రోమింగ్ ఛార్జీలను దాదాపు 99 శాతం తగ్గించినట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Sridevi Drama Company: ఇంద్రజ స్టెప్పేస్తే... స్టేజంతా ఊగిపోవాల్సిందే మరి..!
9. బాలిక దత్తత కోసం.. ఇటలీ నుంచి గుంటూరుకు!
ఇటలీ దేశానికి చెందిన భార్యాభర్తలు మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుంటూరులోని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయానికి వెళ్లేందుకు ఓ వాహనంలో వచ్చారు. నేరుగా బాలల పరిరక్షణ విభాగానికి వెళ్లి అక్కడున్న బాలికను ప్రేమతో ముద్దాడారు. ఆ బాలిక కూడా అదేవిధమైన అనురాగంతో వారిద్దరి ఒడిలోకి చేరింది. చూసే వారికి అక్కడ ఏం జరుగుతోందో కొద్దిసేపు అర్థం కాలేదు. ఎందుకంటే విదేశీయులు ఇక్కడి బాలికను ఆప్యాయంగా చూడటం ఆశ్చర్యానికి గురి చేసింది. తీరా విషయం తెలిశాక వారిని అభినందించారు. వివరాలివీ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. దరఖాస్తుకు రూ.వెయ్యి.. ఓటుకు రూ.10 వేలు!
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మూతపడిన విద్యాసంస్థల నుంచి దరఖాస్తుల రావడమే కాకుండా ముసాయిదా ఓటర్ల జాబితాలోనూ చోటుచేసుకుంటున్నాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.1,000 చెల్లించగా, ఓటుకు రూ.10 వేలు ఇస్తామనే హామీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ రకంగా ఎన్నడూ లేనంతగా గురువుల ప్రతిష్ఠకు భంగం కలిగేవిధంగా చోటుచేసుకున్న పరిణామాలపై విస్తృత చర్చ జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Amritpal Singh: అశ్లీల సందేశాలు.. పాక్ నుంచి ఆయుధాలు.. అమృత్‌పాల్ నేరాల చిట్టా..!
-
Sports News
Suryakumar Yadav: మూడుసార్లు గోల్డెన్ డక్.. సూర్యకుమార్ పేరిట ఓ చెత్త రికార్డు
-
Movies News
NTR 30: యంగ్ టైగర్ కొత్త సినిమా షురూ.. బ్యాక్‌డ్రాప్ చెప్పేసిన కొరటాల శివ
-
Politics News
Amaravati: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్.. ఓటేసిన సీఎం జగన్
-
Sports News
IPL: ఇకపై టాస్ గెలిచాకే.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు చేసిన బీసీసీఐ
-
Movies News
Kalyan Ram: ఆయనతో నన్ను పోల్చవద్దు.. అంత పెద్దవాణ్ని కాదు: కళ్యాణ్‌రామ్