Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 Jun 2024 09:17 IST

1. ఆ కిడ్నాప్‌.. ఇప్పటికీ ఓ మిస్టరీ!

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ ఘటన రాష్ట్రంలోనే సంచలనం రేపింది. ఆ కిడ్నాప్‌ జరిగి ఏడాది పూర్తయింది. రౌడీషీటర్‌ హేమంత్‌కుమార్, మరో ఇద్దరితో కలిసి చేసిన ఈ కిడ్నాప్‌ నేటికీ మిస్టరీగానే మిగిలింది. పూర్తి కథనం.

2. గుల్ల చేసినోళ్లు.. గుట్టు తేల్చాల్సిందే!

జగనన్న కాలనీల పేరు చెప్పి.. కొండలు కొల్లగొట్టారు.. అటవీ భూములు తవ్వారు.. ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు తవ్వారు.. పోలవరం కట్టలను కరిగించేశారు.. ఆఖరికి చెరువులనూ ఊడ్చేశారు.. ఉమ్మడి జిల్లాలో అయిదేళ్లలో జరిగిన మట్టి దందా ఇది. కొన్ని లక్షల కోట్ల ఘనపు మీటర్ల మట్టి మెక్కేశారు. ఇంత మట్టితో ఏ జగనన్న కాలనీ మెరక చేశారు.? ఏ జాతీయ ప్రాజెక్టుకు తరలించారు.? ఎక్కడ రాష్ట్ర రోడ్లు వేశారు? చిన్న వర్షం పడితే.. జగనన్న కాలనీలన్నీ చెరువులనే తలపిస్తున్నాయి. పూర్తి కథనం. 

3. అంతా మా ఇష్టం.. వీడీసీఏలో ఏసీఏ హెడ్‌కోచ్‌ పెత్తనం

విశాఖ జిల్లా క్రికెట్‌ సంఘం (వీడీసీఏ) కార్యవర్గంలో కొందరు ఏళ్ల తరబడి పదవులు అనుభవిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారుల ఎంపికలో పారదర్శకత లోపిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో క్రికెట్‌ వ్యవస్థ నిర్వహణకు సంబంధించి లోధా కమిటీ వివిధ ప్రమాణాలతో కూడిన నియమావళి రూపొందించింది. క్రీడా సంఘంలో ఒకే వ్యక్తి తొమ్మిదేళ్లకు మించి బాధ్యతలు చేపట్టకూడదని కమిటీ స్పష్టం చేసింది. పూర్తి కథనం.

4. పేదోడి పేరు చెప్పి.. పెద్దలు దోచేశారు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో పేదోడి పేరు చెప్పి వైకాపా పెద్దలు భారీగా అవినీతికి పాల్పడ్డారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అరోపించారు. సోమవారం యు.కొత్తపల్లి మండలంలోని కొమరగిరి జగనన్న లేఅవుట్‌ను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. పూర్తి కథనం.

5. మల్లన్న క్షేత్రంలో చంద్రన్న ప్రక్షాళన చేపట్టాలి

తిరుమల తర్వాత భక్తుల తాకిడి ఎక్కువ ఉండే క్షేత్రం శ్రీశైలం.. రెండో జ్యోతిర్లింగం, ఆరో అష్టాదశ శక్తిపీఠం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు శ్రీగిరిని సందర్శిస్తుంటారు. పర్వదినాల్లో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. శ్రీశైల మల్లికార్జునుడి క్షేత్రం చెంత గత ఐదేళ్లు జగన్‌ ప్రభుత్వం రాజకీయం చేసింది. భక్త జన సమస్యలు పట్టించుకోకుండా వైకాపా నేతలు, అధికారులు సొంత లాభాలు చూసుకున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో అవినీతి, అక్రమాలను పెంచి పోషించారు. పూర్తి కథనం.

6. అంతా జగన్నాటకం.. వైకాపా హయాంలో ఆబ్కారీ వ్యవస్థ అస్తవ్యస్తం

రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం తీసుకొచ్చే మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ అస్తవ్యస్తంగా మారింది. తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలుచేస్తామటూ నాటకమాడిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ శాఖను నిర్వీర్యం చేశారు. ఉద్యోగులను ముప్పుతిప్పలు పెట్టటంతోపాటు ఇటు మందుబాబులను నిలువు దోపిడీ చేశారు. నాసిరకం మద్యంతో పలువురి ప్రాణాలు తీశారు. కనీసం బాధిత కుటుంబాలకు సాయం చేయడంలోనూ నిర్లక్ష్యం వహించారు. పూర్తి కథనం.

7. పోలవరానికి పునరంకితం

‘పోలవరం ఆంధ్రుల జీవనాడి..దీని ద్వారా నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలన్న లక్ష్యంతో నిరంతరం పని చేస్తా..ప్రాజెక్టు నాకు ప్రాణంతో సమానం’ అంటూ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించడంతో పోలవరానికి పూర్వవైభవం రానుందని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సోమవారం పోలవరంలో మొట్టమొదటి క్షేత్ర పర్యటన చేశారు. ప్రాజెక్టును పరిశీలించి.. నిర్మాణంపై విస్తృత స్థాయిలో అధికారులతో సమీక్షించారు. పూర్తి కథనం.

8. నూడుల్స్‌.. సబ్బుల ధరలు పెరుగుతున్నాయ్‌!

నూడుల్స్, సబ్బులు, బాడీవాష్‌ల వంటి ఉత్పత్తుల ధరలను పెంచేందుకు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచేశాయ్‌ కూడా. ముడి పదార్థాల వ్యయాలు పెరగడంతో, మార్జిన్లను కాపాడుకునేందుకు, ఉత్పత్తుల ధరల పెంపు తప్పట్లేదని కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నాయి. సబ్బులు, బాడీ వాష్‌ల ధరలు 2-9%, కేశ సంరక్షణ నూనెల ధరలు 8-11%, ఎంపిక చేసిన ఆహార పదార్థాల ధరలు 3-17% పెరుగుతున్నాయని సమాచారం. ఫలితంగా కుటుంబ నెలవారీ వ్యయాలు అధికమవుతున్నాయి. పూర్తి కథనం.

9. రక్షణకవచ్‌ ప్రశ్నార్థకం!

కాజీపేట- సికింద్రాబాద్‌ మార్గంలో కవచ్‌ ప్రతిపాదన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2022 సంవత్సరం మార్చి 4న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వికారాబాద్‌- లింగంపల్లి మధ్య ప్రయోగాత్మకంగా కవచ్‌ వ్యవస్థను పరిశీలించి విజయవంతం చేశారు. ఆ తర్వాత కాజీపేట- సికింద్రాబాద్‌ మార్గంలో కవచ్‌ను అభివృద్ధి చేస్తారని ప్రకటించారు. కానీ, ఆర్థిక భారంతో మూడేళ్లుగా కవచ్‌ జాడ కనిపించడం లేదు. పూర్తి కథనం.

10. 60 ఏళ్లా.. 64 ఏళ్లా?

రాష్ట్రంలో వైద్య విద్య డైరెక్టర్‌(డీఎంఈ) పోస్టుకు గరిష్ఠ వయోపరిమితిగా ఏ వయసును ప్రాతిపదికగా తీసుకోవాలనే అంశంపై పీటముడి వీడటం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి రెగ్యులర్‌ డీఎంఈని నియమించడంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తర్జన భర్జన పడుతోంది. త్వరగా నియామకం జరపాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. పూర్తి కథనం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని