Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. సీఎం నిర్లక్ష్యం వల్లే అంకుర వ్యవస్థ ధ్వంసం: చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan) నిర్లక్ష్యం, నిరాసక్తత వల్ల రాష్ట్రంలో అంకుర సంస్థల వ్యవస్థ ధ్వంసమైందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. యువ పారిశ్రామికవేత్తల ఆకాంక్షలను జగన్ ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. ఈ పోటీ ప్రపంచంలో రాష్ట్ర యువత భవిష్యత్ తలచుకుంటే బాధగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. కేసీఆర్‌తో పలు రాష్ట్రాల నేతలు భేటీ.. భారాసలో చేరేందుకు సుముఖత
భారాసలో చేరేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు సంసిద్ధత వ్యక్తం చేశారు. భారాస అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు నాయకులు ప్రగతిభవన్‌లో కలిశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్ తదితరులు సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. మూడేళ్లలో జగన్ సర్కార్ చేసిన అప్పు రూ.1.34 లక్షల కోట్లే: మంత్రి బుగ్గన
ఏపీ ఆర్థిక అంశాలపై తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై యనమల నిరాధార ఆరోపణలు, అసత్య ప్రకటనలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ విషయంపై తెదేపా రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని మంత్రి బుగ్గన విమర్శిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
‘ఆనతి నీయరా హరా’, ‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘దొరకునా ఇటువంటి సేవ’, ‘తెలిమంచు కరిగింది’.. ఇలా ఎన్నో మధురమైన పాటలు ఆలపించి తెలుగువారి మదిలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు ప్రముఖ గాయని వాణీ జయరాం. దక్షిణాదికి చెందిన ఆమె వివాహం తర్వాత ముంబయికి వెళ్లి హిందీ సినిమాల్లో ఎన్నో పాటలు పాడి.. కొన్నేళ్లపాటు అక్కడ అగ్రస్థానంలో కొనసాగారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఆ యువ బౌలర్‌ను ఎదుర్కోవడం స్టీవ్ స్మిత్‌కు ఇబ్బందే: ఇర్ఫాన్ పఠాన్
భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌ని ఎదుర్కోవడం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు పెద్ద సవాల్ అని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. అయితే స్మిత్ బ్యాటింగ్‌ను ఎదుర్కోవడం భారత్‌కు సైతం అంత సులభం కాదని, అతడిని కట్టడి చేయాలంటే టీమ్‌ఇండియా సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించాడు. భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్ త్వరలోనే ప్రారంభమవనున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఆ పని రెగ్యులేటరీలు చూసుకుంటాయ్.. అదానీ షేర్ల పతనంపై నిర్మలమ్మ
అమెరికాకు సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూప్(Adani Group) షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ పతనం స్టాక్ మార్కెట్లో సృష్టించిన ఆందోళన అంతా ఇంతా కాదు. దీనిపై మరోమారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) స్పందించారు. నియంత్రణ సంస్థలు వాటి పని అవి చేస్తాయని శనివారం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఎట్టకేలకు కదిలిన కేంద్రం..! ఆ అయిదుగురి నియామకాలకు ఆమోదం
సుప్రీం కోర్టులో జడ్జీల నియామకానికి గత డిసెంబరులో కొలీజియం చేసిన అయిదు సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోద ముద్ర వేసింది. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ పంకజ్ మిత్తల్, పట్నా హైకోర్టు సీజే జస్టిస్ సంజయ్ కరోల్, మణిపుర్ హైకోర్టు సీజే జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ మిశ్రల పేర్లు తాజాగా ఆమోదించిన జాబితాలో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
ఉక్రెయిన్- రష్యా యుద్ధాని(Ukraine Crisis)కి ఏడాది సమీపిస్తోన్న వేళ అమెరికా(America) కీలక నిర్ణయం తీసుకుంది! తొలిసారి ఓ రష్యన్ వ్యాపారవేత్త ఆస్తులను ఉక్రెయిన్ సాయానికి వినియోగించనుంది. తమ ప్రభుత్వానికి ఈ మేరకు అధికారం ఇచ్చినట్లు అమెరికా అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ తాజాగా వెల్లడించారు. ఇటువంటి నిర్ణయం ఇదే మొదటిసారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఆర్మీ అగ్నివీరుల రిక్రూట్‌మెంట్‌లో కీలక మార్పు
కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కింద నిర్వహిస్తున్న అగ్నివీరుల (Agniveer recruitment) నియామక ప్రక్రియలో ఆర్మీ (Army) కీలక మార్పు చేసింది. ఆర్మీలో చేరాలనుకునే వారికి తొలుత ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేన్ (CEE) నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తర్వాతే ఫిట్‌నెస్, మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. హలో ఫ్రెండ్.. నీ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్ యాదవ్
లేటు వయసులో జట్టులోకి వచ్చినా తక్కువ కాలంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియాకు కీలక బ్యాటర్‌గా మారిపోయాడు సూర్యకుమార్ యాదవ్. వన్డేలు, టీ20ల్లో నిలకడగా పరుగులు సాధిస్తున్న సూర్య ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. సుదీర్ఘ ఫార్మాట్‌లో దేశం తరఫున ఆడాలనే అతడి కల అతి త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చేతులు నరుక్కున్నట్లే!: మంత్రి ధర్మాన
-
World News
Russia: చిన్నారి ‘చిత్రం’పై రష్యా కన్నెర్ర.. తండ్రిని బంధించి..బాలికను దూరం చేసి!
-
India News
ChatGPT: భారత్ వెర్షన్ చాట్‌జీపీటీ ఎప్పుడంటే..? మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిదే..!
-
Sports News
Labuschagne:ఐపీఎల్లో నా ఫేవరెట్ టీమ్ అదే.. అశ్విన్ బెస్ట్ స్పిన్నర్: లబుషేన్
-
Movies News
Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!
-
Politics News
Arvind Kejriwal: బాబోయ్ మీకో నమస్కారం.. అంతా మీ దయ వల్లే జరిగింది: భాజపాకు కేజ్రీవాల్ కౌంటర్