Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. ‘మీరు ఎలాగూ మారరు.. ప్రజలే మిమ్మల్ని మార్చేస్తారు’: చంద్రబాబు
మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ‘ఏదైనా మంచి పనికోసం వెనకడుగు వేయకుండా పోరాడితే దాన్ని పట్టుదల అంటారు. కానీ, కసితో ఇళ్లు కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తే దాన్ని సైకోతత్వం అంటార’ని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్నో రోడ్లు అధ్వానంగా ఉంటే.. ఈ ప్రభుత్వానికి ఇప్పటం రోడ్డు మాత్రమే ఎందుకు కనిపిస్తోందని ప్రశ్నించారు. వైకాపా నాయకులు ఎలాగూ మారరని.. ప్రజలే వారిని మార్చేస్తారని ట్విటర్ వేదికగా చంద్రబాబు హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర 35వ రోజు ఉత్సాహంగా సాగింది. ఎంజేఆర్ కళాశాల ఆగ్రహారం వద్ద అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. అగ్రహారం వద్ద తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, కార్యకర్తలు లోకేశ్‌తో కలిసి నడిచారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. 2024లో ‘అదానీ’ 2 బి.డాలర్ల బాండ్లకు చెల్లించాలి!
హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ (Adani Group).. 2024లో రెండు బిలియన్ డాలర్ల విలువ చేసే విదేశీ కరెన్సీ బాండ్లకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇటీవల నిర్వహించిన రోడ్‌షోల్లో ఇన్వెస్టర్లకు తెలియజేసింది. వీటికి నిధులు ఎలా సమకూర్చుకోనుందో వారికి వివరించింది. ఈ పరిణామం తర్వాత అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల షేర్లు పుంజుకున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సిసోదియాను మానసికంగా టార్చర్ చేస్తున్నారు: ఆప్
దిల్లీ మద్యం కుంభకోణం(Delhi liquor scam) కేసులో అరెస్టయిన సీబీఐ కస్టడీలో ఉన్న తమ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోదియా(Manish sisodia)ను మానసికంగా టార్చర్ పెడుతున్నారని ఆప్(AAP) ఆరోపిస్తోంది. తప్పుల్ని అంగీకరించేలా సంతకాలు చేయాలని సీబీఐ అధికారులు బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్ దిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. లాహోర్‌లో హైడ్రామా.. పాక్ సర్కార్‌పై ఇమ్రాన్ తీవ్ర ఆరోపణలు
పాకిస్థాన్(pakistan)మాజీ ప్రధాని, తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఇంటి వద్ద హైడ్రామా నడుస్తోంది. లాహోర్‌లో ఆయన్ను అరెస్టు చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు జమాన్ పార్క్ రెసిడెన్సీకి రావడం.. దీంతో ముందుగానే పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ షెహబాజ్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. 52 దేశాలు అప్పుల బాధల్లో..! ఐరాస విభాగం హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం(Recession) భయాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం 52 దేశాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు ఐరాస అభివృద్ధి కార్యక్రమం(UNDP) అధిపతి అచిమ్ స్టెయినర్ వెల్లడించారు. రుణ చెల్లింపు సమస్యల(Debt Distress)ను ఎదుర్కొంటున్న ఈ దేశాలకు సాయం చేసేందుకు అత్యవసర చర్యలు అవసరమని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. బ్యాట్‌తో దంచి.. బంతితో మెరిసి.. బెంగళూరుపై దిల్లీ ఘన విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023)లో దిల్లీ క్యాపిటల్స్ (DCw) బోణీ కొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBw)తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ.. కెప్టెన్ మెగ్ లానింగ్ (72; 43 బంతుల్లో 14 ఫోర్లు), షఫాలీ వర్మ (84; 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. అతడు లేనందుకు నిజంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి..
వరుసగా రెండు టెస్టుల్లోనూ విఫలం కావడంతో మూడో టెస్టుకు (IND vs AUS) అతడిని దూరం పెట్టారు. తీరా తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన జట్టు.. ఒక్కసారిగా మూడో టెస్టులో ఓటమిపాలైంది. ఇంతకీ ఆ జట్టు టీమ్‌ఇండియా (Team India) కాగా.. ఆ ఆటగాడు ఎవరనేదేగా..? మీ డౌటు.. అతడెవరో కాదు భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul). పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఫిలిప్పీన్స్ ద్వీపంపైకి చొచ్చుకెళ్లిన చైనా నౌకలు
చైనా(China) మరోసారి తన పొరుగు దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకొంది. ఈ సారి ఫిలిప్పీన్స్(Philippines) ఆధీనంలోని ఓ ద్వీపం వద్దకు చైనా నావికాదళానికి చెందిన నౌకలు, చేపలవేట ముసుగులో మిలీషియా పడవలు దూసుకెళ్లాయి. దీంతో ఇరు దేశాల మధ్య ప్రాదేశిక జలాల విషయంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయాన్ని ఫిలిప్పీన్స్ నేవీ కూడా ధ్రువీకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. DBTతో కేంద్ర పథకాల్లోనే.. రూ.2.2లక్షల కోట్ల ఆదా..!
వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు (Beneficiaries) ప్రయోజనాలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT)ను వినియోగిస్తున్నాయి. ఈ ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి వల్ల కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాల్లోనే (Schemes) సుమారు 27 బిలియన్ డాలర్లు ( రూ.2.2లక్షల కోట్లు) ఆదా అయినట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: ఇది ఆరంభమే.. వచ్చే సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయం: చంద్రబాబు
-
General News
TSRJC CET: మే 6న టీఎస్ఆర్జేసీ సెట్ ప్రవేశ పరీక్ష.. నోటిఫికేషన్ విడుదల
-
India News
Modi-Kishida: భారత పర్యటనలో జపాన్ ప్రధాని కిషిదా.. మోదీతో భేటీ..!
-
India News
Supreme court: ఇక సీల్డ్ కవర్లు ఆపేద్దాం: ఓఆర్ఓపీ కేసులో ఘాటుగా స్పందించిన సుప్రీం
-
World News
Saddam Hussein: నియంత విలాస నౌక.. నేటికీ సగం నీళ్లలోనే!
-
Sports News
Rohit Sharma: నన్ను పెళ్లి చేసుకుంటావా..? అభిమానికి రోహిత్ శర్మ సరదా ప్రపోజల్