Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 03 Oct 2023 21:12 IST

1. Purandeswari: భాజపా- జనసేన పొత్తు.. పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

జనసేనతో పొత్తుపై భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) స్పందించారు. తమ పార్టీతో పొత్తు విషయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రకటనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ఆలోచనల గురించి పవన్‌ కల్యాణ్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశారని ఆమె తెలిపారు. తమది జాతీయ పార్టీ అని.. పవన్‌ అభిప్రాయంపై తాము వెంటనే స్పందించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెప్పారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి

2. Disney+Hotstar: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్‌ గుడ్‌న్యూస్‌.. కొత్త ఫీచర్లతో రెడీ

క్రికెట్ ప్రపంచకప్‌ ఫీవర్‌ (World cup) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వేళ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+Hotstar) ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను మొబైల్‌ యాప్‌లో ఫ్రీగా తిలకించేందుకు అవకాశం కల్పిస్తున్న ఈ సంస్థ.. తాజాగా కొన్ని కొత్త ఫీచర్లను జోడించింది. వీక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు తన ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యాప్‌లను అప్‌డేట్‌ చేసింది. వార్త కోసం క్లిక్‌ చేయండి

3. KTR: మోదీ యాక్టింగ్‌కు ఆస్కార్‌ ఖాయం: కేటీఆర్‌

ప్రధాని మోదీ యాక్టింగ్‌కు ఆస్కార్‌ అవార్డు తప్పకుండా వస్తుందని మంత్రి కేటీఆర్‌ (KTR) ఎద్దేవా చేశారు. ఆయన స్క్రిప్టు రాస్తే సినిమా బాగా విజయవంతమవుతుందన్నారు. నిజామాబాద్‌ సభలో మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మంత్రి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి గురించి తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ఆయన మాట్లాడారని చెప్పారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అబద్ధాలు మాట్లాడటం బాధాకరమన్నారు. వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Revanth Reddy: మోదీ నోట.. చీకటి మిత్రుడి మాట: రేవంత్‌

ప్రధాని మోదీ నోటి నుంచి చీకటి మిత్రుడి మాట బయటకొచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ‘ముసుగు తొలగింది.. నిజం తేలింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని మోదీ చేసిన ఘాటు వ్యాఖ్యలపై రేవంత్‌ స్పందించారు. మోదీ- కేసీఆర్‌ది విడగొట్టలేని బంధమంటూ కాంగ్రెస్‌ చెప్పిన మాట వాస్తవమేనని తేలిందన్నారు. వార్త కోసం క్లిక్‌ చేయండి

5. TS Assembly Elections: బీఎస్పీ అభ్యర్థుల జాబితా విడుదల.. ప్రవీణ్‌ కుమార్‌ పోటీ ఎక్కడి నుంచంటే..?

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly polls) పోటీకి బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP) సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డా.ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌తో పాటు మొత్తం 20 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ప్రవీణ్‌ కుమార్‌ సిర్పూర్‌ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Chandrababu: ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఆ తర్వాత సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు కొనసాగించారు. అనంతరం చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగించిన ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Vivek Ramaswamy: వివేక్‌ పిల్లల.. ‘కేర్‌ టేకర్‌’ జీతం రూ.80లక్షలు..?

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడి అభ్యర్థిత్వం రేసులో కొనసాగుతోన్న వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) నుంచి ఓ బంపర్‌ ఆఫర్‌ వెలువడింది. తన పిల్లల సంరక్షణ చూసుకునేందుకు ‘నానీ’ (Nanny) ని నియమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం సంరక్షకురాలికి జీతం ఏడాదికి లక్ష డాలర్లు  (సుమారు రూ.80లక్షలు) ఇవ్వనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓ జాబ్‌ పోర్టల్‌లో ప్రకటన వెలువడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Maharashtra: మహారాష్ట్ర సచివాలయం ఎదుట దుస్తులు విప్పి మహిళ నిరసన

మహారాష్ట్ర (Maharashtra) సచివాలయం ఎదుట ఓ మహిళ తన దుస్తులు విప్పి నిరసన తెలిపిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవీ ముంబయికి చెందిన ఆ మహిళ విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం కారణంగా తన ఇంటికి విద్యుత్‌ సరఫరా లేదని వాపోయినట్లు తెలిసింది. ముఖ్యమంత్రిని కలిసే వరకు తన పోరాటం కొనసాగిస్తానని చెప్పింది. అలా జరగని పక్షంలో ఆత్మాహుతి చేసుకుంటానని బెదిరించింది. వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Asian Games 2022: ఆసియా క్రీడలు.. అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాల వర్షం

ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాల వర్షం కురిసింది. మహిళల 5000 మీ ఫైనల్‌లో పారుల్ చౌదరీ పసిడి పతకాన్ని పట్టేసింది. రేసు ఆరంభంలో నెమ్మదిగా పరుగెత్తిన చివర్లో వేగం పెంచి మొదటి స్థానంలో నిలిచింది. మొదటి నుంచి వేగంగా పరుగెత్తిన రిరికా హిరోనకా (జపాన్‌) చివర్లో శక్తిని కోల్పోయి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో పారుల్‌కిది రెండో పతకం. వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Rolls Royce: యువకుడి నైపుణ్యం.. మారుతి కారుని రోల్స్ రాయిస్‌గా మార్చేశాడు

కొందరు బీఎమ్‌డబ్ల్యూ, రోల్స్‌ రాయిస్‌ వంటి లగ్జరీ కార్లలో తిరగాలని ఆశపడుతుంటారు. వీటి ధర ఎక్కువగా ఉండడంతో కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తుంటారు. కానీ, ఓ యువకుడు అతి తక్కువ ఖర్చుతో రోల్స్‌ రాయిస్‌ తరహా కారు (Rolls Royce)ను స్వయంగా తయారు చేశాడు. ఇంతకీ అది ఎలా సాధ్యమైందంటే.. వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని