Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు..

Published : 03 Dec 2022 20:59 IST

1. సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. దిల్లీ మద్యం కుంభకోణంపై కేంద్రహోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్‌ ప్రతులు ఇవ్వాలని సీబీఐని కోరారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా సమాధానాలు ఇచ్చేందుకు వీలవుతుందని తెలిపారు. పత్రాలు అందిన తర్వాత హైదరాబాద్‌లో విచారణ తేదీ ఖరారు చేయవచ్చని లేఖలో పేర్కొన్నారు. దిల్లీ మద్యం కేసులో సీబీఐ శుక్రవారం ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నేను పరాజయం పొందిన రాజకీయ నేతను: పవన్‌ కల్యాణ్‌

తాను పరాజయం పొందిన రాజకీయ నాయకుడినని, ఓడిపోయానని చెప్పుకోవడానికి ఏ మాత్రం మొహమాట పడనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా సదస్సులో పవన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఫేసింగ్‌ ది ప్యూచర్‌’ అంశంపై  సీఏ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సైబర్‌ నేరగాళ్ల చేతిలో ఐటీ ఉద్యోగులూ మోసపోవడం బాధాకరం: కేటీఆర్‌

అవగాహన లోపం వల్లే సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని, మోసపోతున్న వారిలో చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులు కూడా ఉండటం బాధాకరమని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సైబరాబాద్‌లో తెలంగాణ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ సైబర్‌ సేఫ్టీని ఆయన శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్‌ అలీ, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌, తదితరులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శ్రీశైలం విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం: ఆర్కే పిళ్లై

శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్స్‌లో మార్పులు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయని కృష్ణా యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై వెల్లడించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూల్‌ కర్వ్స్‌ విషయంలో ఇంకా స్పష్టత రాలేదన్న ఆయన.. మరింత స్పష్టత కోసం కేంద్ర జలసంఘం అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించినట్టు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దీదీ.. మీ గేమ్స్‌ మాకూ వచ్చు!..: భాజపా

పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరచూ వాడే ‘ ముందుంది అసలైన ఆట’ నినాదాన్ని ఈసారి భాజపా అందుకుంది. రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలు ఆట ఆడతాయని, అయితే ఈ ఆట చాలా భయకంరంగా ఉంటుందని పశ్చిమ్‌బెంగాల్‌ భాజపా అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ వ్యాఖ్యానించారు. తృణమూల్‌ కాంగ్రస్‌ ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టెస్టులు, వన్డేలను వదిలేసి టీ20 క్రికెట్‌నే ముందుకు తీసుకెళ్లలేం: సెహ్వాగ్ 

ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరుగుతుండటంతో వన్డే ఫార్మాట్‌ను రద్దు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన వన్డే సిరీస్‌ తర్వాత ఈ వాదనలు ఎక్కువ కావడం గమనార్హం. ఎందుకంటే ఆసీస్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌కు అభిమానుల ఆదరణ కరువైంది. ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులు లేక స్టేడియాలు బోసిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎయిర్‌టెల్‌ క్రికెట్‌ ప్లాన్స్‌.. డిస్నీ+ హాట్‌స్టార్‌ స్థానంలో ఇకపై ప్రైమ్‌

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel) తన ప్రీపెయిడ్‌ (prepaid) క్రికెట్‌ ప్లాన్లలో (Cricket plans) మార్పులు చేసింది. డిస్నీ+ హాట్‌స్టార్‌ (Dinesy+ Hotstar) స్థానంలో కొత్తగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime video) సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. వేర్వేరు ధరల్లో వేర్వేరు వ్యాలిడిటీలతో ఈ ప్యాక్స్‌ లభిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘హిట్లర్‌ గొప్పవాడు’.. ఇజ్రాయెల్‌ రాయబారికి విద్వేష సందేశాలు!

ఇటీవల ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంపై ‘ఇఫి’ జ్యూరీ హెడ్‌, ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రంగా పేర్కొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనపై ఆగ్రహం వ్యక్తమైంది. లాపిడ్‌ వ్యాఖ్యలను భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి నావొర్‌ గిలాన్‌ ఖండించారు. భారత ప్రభుత్వానికి ఆయన క్షమాపణలు కూడా తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శాంతించని ‘మౌనా లోవా’.. ఎగసిపడుతోన్న లావా!

ప్రపంచంలోనే అతి పెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ‘మౌనా లోవా’.. భీకరంగా మారుతోంది. క్రమంగా పెద్దఎత్తున లావా వెల్లగక్కుతోంది. రెండుమూడు చోట్ల నుంచి ఫౌంటెయిన్ల మాదిరిగా.. దాదాపు 20 నుంచి 25 అడుగుల ఎత్తువరకు లావా ఎగజిమ్ముతోండటం గమనార్హం. పసిఫిక్‌ మహాసముద్రంలోని హవాయి ద్వీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం.. గత నెల 27 నుంచి విస్ఫోటం చెందుతోన్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఈ ఏడాది గూగుల్‌ టాప్‌ యాప్స్‌ ఇవే..

ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌.. ఈ ఏడాది ఉత్తమ యాప్స్‌ జాబితాను ప్రకటించింది. భారత్‌లో ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్‌ అప్లికేషన్ల జాబితాను వెలువరించింది. సాధారణ యాప్స్‌, గేమింగ్‌ యాప్స్‌ అందులో ఉన్నాయి. ఆయా యాప్‌ డెవలపర్లను ఇటీవల సత్కరించింది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన షాప్సీ (Shopsy) ఈ ఏడాది ఎక్కువ ఆదరణ పొందిన యాప్‌గా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు