Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తాం : చంద్రబాబు
సీఎం జగన్ అరాచకాల నుంచి వైకాపా నేతల్ని కూడా తామే కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎంపీ రఘురామ రాజు, సుబ్బారావు గుప్తాలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ప్రభుత్వ విధానాలను ఎవరు ప్రశ్నించినా అక్రమకేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అక్రమకేసులు బనాయించే పోలీసులను ఉపేక్షించేది లేదని, చేసిన తప్పులకు వారు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఈశాన్య రాష్ట్రాల సీఎంల ప్రమాణస్వీకారానికి మోదీ..!
ఈశాన్య రాష్ట్రాల్లో భాజపా తన ఉనికిని వేగంగా విస్తరించుకుంటోంది. ఇటీవల జరిగిన త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland), మేఘాలయ (Meghalaya) అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆయా రాష్ట్రాల్లో త్వరలోనే కాషాయ పార్టీ (BJP) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) త్వరలో ఆ రాష్ట్రాలకు వెళ్లనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ప్రజల్ని దోచుకునేందుకు ‘అదానీ’కి గుత్తాధిపత్యం.. కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు
దేశ ప్రజల్ని దోచుకునేందుకు అదానీ గ్రూప్‌నకు (Adani group) ప్రభుత్వం గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టిందని కాంగ్రెస్ పార్టీ (Congress) విమర్శించింది. ఎయిర్‌పోర్టులు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను వినియోగించే ప్రజల నుంచి ఆ గ్రూప్ భారీగా వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని దుయ్యబట్టింది. అదానీ వ్యవహారాన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసేందుకే జేపీసీని కోరుతున్నామని, అంతే తప్ప ప్రధానిని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. తుది జట్టులో మార్పు చేయడమే టీమ్‌ఇండియాకు నష్టం: హేడెన్
స్పిన్ పిచ్‌ల మీద ప్రత్యర్థి బ్యాటర్లను గింగిరాలు తిప్పేస్తున్న టీమ్‌ఇండియాకు (Team India).. ఇందౌర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో (IND vs AUS) మాత్రం ఆసీస్ చేతిలో ఓటమితప్పలేదు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. స్పిన్ మంత్రంలో భారత్ కొట్టుకుపోయింది. ఆసీస్ (Australia) బ్యాటర్లు రాణించిన చోట.. టీమ్‌ఇండియా తేలిపోవడంపై విమర్శలు రేగాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. తత్కాల్ బుకింగ్ టైమ్‌లో IRCTC చుక్కలు.. నెటిజన్ల ఆగ్రహం!
భారతీయ రైల్వేకు చెందిన టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ (IRCTC)లో శనివారం ఉదయం అంతరాయం తలెత్తింది. తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో వెబ్‌సైట్, యాప్ మొరాయించింది. దీంతో పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేశారు. తమకు కలిగిన అసౌకర్యానికి గానూ మండిపడుతున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌లో ఉదయం 10 గంటల నుంచి అంతరాయం తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ సైతం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఫ్లూ లక్షణాలివే.. ఈ పనులు చేయొద్దు..!
వేసవికాలంలో అడుగుపెడుతున్న సమయంలో జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు (Viral Fevers) ప్రజలను కంగారు పెడుతున్నాయి. కొవిడ్ (Covid) తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా (Influenza) కేసులు గత కొంతకాలంగా పెరుగుతున్నాయి. ‘ఇన్‌ఫ్లుయెంజా ఏ’ ఉప రకమైన ‘హెచ్3ఎన్2 (H3N2)’ అనే వైరస్ కారణంగా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని భారత వైద్య పరిశోధన మండలి (ICMR), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఇది ‘బాహుబలి’ బారియర్.. ప్రపంచంలోనే మొదటిది!
సాధారణంగా మనకు రహదారుల వెంబడి స్టీల్ బారియర్లు కనిపిస్తాయి. కానీ, ప్రపంచంలోనే మొట్టమొదటి వెదురు బారియర్(Bamboo Crash Barrier)ను మహారాష్ట్ర (Maharashtra)లోని ఓ హైవేపై ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రాపూర్, యావత్మాల్ జిల్లాలను కలిపే హైవేపై వణి- వరోరా పట్టణాల మధ్య 200 మీటర్ల మేర ఈ వెదురు క్రాష్ బారియర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కిమ్ రాజ్యంలో ప్రాణాల మీదకు తెస్తోన్న ఆహార కొరత..!
కరోనాతో సరిహద్దులు మూసివేత, కరవులు, వరదలతో ఉత్తర కొరియా మరో తీవ్ర ఆహార సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ ఆకలికేకలతో చావులు సంభవిస్తాయని అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. దీనిపై అక్కడి ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఇలాంటి సమావేశాలు నిర్వహించడం అరుదని, ఇది అక్కడి పరిస్థితిని తీవ్రతను వెల్లడిచేస్తోందని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. రష్యాలో మరో మిస్టరీ మరణం.. కరోనా వ్యాక్సిన్ శాస్త్రవేత్త దారుణ హత్య..!
రష్యా (Russia)లో ప్రముఖుల మరణాల వెనుక రహస్యమేంటో అంతుచిక్కట్లేదు. తాజాగా మరో ప్రముఖ శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యారు. కరోనా వ్యాక్సిన్ (Covid vaccine) అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న శాస్త్రవేత్త ఆండ్రీ బొటికోవ్‌ను ఓ వ్యక్తి తన అపార్ట్‌మెంట్‌లోనే హత్య చేశాడు. బెల్ట్‌ను గొంతుకు బిగించి చంపేశాడు. ఈ మేరకు రష్యా మీడియా కథనాలు శనివారం వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. షమీ వచ్చేస్తాడు.. పిచ్ తయారీపై ఎలాంటి సూచనల్లేవు: జీసీఏ
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) మార్చి 9 నుంచి భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య నాలుగో టెస్టు జరగనుంది. ఇందుకు అహ్మదాబాద్ వేదికగా నిలవనుంది. ప్రస్తుతం భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో టెస్టు మ్యాచ్‌కు దూరమైన టీమ్‌ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అహ్మదాబాద్ మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Karnataka Elections: రాహుల్ చెప్పినట్లే.. కుమారుడి స్థానం నుంచి సిద్ధరామయ్య పోటీ
-
Politics News
Ambati Rambabu: ఆ నలుగురిని శాశ్వతంగా బహిష్కరించే అవకాశం
-
General News
TSPSC Paper Leak Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్న సిట్..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
LB nagar flyover : ఇక సిగ్నల్ ఫ్రీగా ఎల్బీనగర్ కూడలి.. నేడు మరో పైవంతెన అందుబాటులోకి
-
Sports News
IPL: ‘బీసీసీఐ ఎలాంటి ఆదేశాలివ్వలేదు’ : దిల్లీ క్యాపిటల్స్ సీఈవో