Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 05 Feb 2023 21:05 IST

1. భారాసకు అధికారమిస్తే.. జలవిధానం పూర్తిగా మార్చేస్తాం: కేసీఆర్‌

చిన్న చిన్న దేశాలు కూడా అద్భుతంగా ప్రగతి సాధిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) అన్నారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడమే భారాస(BRS) లక్ష్యమని పునరుద్ఘాటించారు. నాందేడ్‌ (Nanded)లో నిర్వహించిన భారాస బహిరంగ సభ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రజలకు సరిపడా సహజ వనరులు ఉన్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణలో రాష్ట్రపతి పాలన.. కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈనెల చివరినాటికి శాసనసభ రద్దయ్యి.. రాష్ట్రపతి పాలన రానుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి పాలనలో ముందస్తు ఎన్నికలు జరపాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. రాహుల్‌గాంధీ పాదయాత్రతో దేశంలో కాంగ్రెస్‌ గాలి వీస్తోందన్నారు. భాజపా మతపరంగా దేశాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో ఎస్సై రాత పరీక్ష.. హాల్‌టిక్కెట్ల కోసం క్లిక్‌ చేయండి

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్‌ వచ్చింది. ఈ పరీక్షకు హాల్‌ టిక్కెట్లను ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు నేటి సాయంత్రం 5గంటల నుంచి ఫిబ్రవరి 15 సాయంత్రం 5గంటల వరకు తమ అధికారిక వెబ్‌సైట్‌ https://slprb.ap.gov.in/UI/index నుంచి  హాల్‌టిక్కెట్లు  డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రేవంత్‌ పాదయాత్ర.. షెడ్యూల్‌ ఇదే

ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ (Congress) సిద్ధమవుతోంది. ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ (Hath se Hath jodo Abhiyan)లో భాగంగా సోమవారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పాదయాత్ర చేపట్టనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘నీ హెయిర్‌ స్టైల్‌ బాగుంది ధోనీ.. జుట్టు కత్తిరించుకోవద్దు’

పాకిస్థాన్‌(Pakistan) మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ (79)(Pervez Musharraf) కన్నుమూశారు. గత కొంతకాలంగా అమైలాయిడోసిస్‌ అనే రుగ్మతతో బాధపడుతోన్న ఆయన.. దుబాయిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ముషారఫ్‌ మంచి క్రికెట్‌ ప్రేమికుడు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగే క్రికెట్‌ పోటీలను ఆస్వాదించేవాడు. ఆయన ఓ సారి మన మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్. ధోనీ (MS Dhoni) హెయిర్‌ స్టైల్‌ని చూసి ఫిదా అయిపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సాయం కోరినందుకు క్యాన్సర్‌ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!

విమానాల్లో ప్రయాణికుల అసభ్య ప్రవర్తన, విమాన సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య వాగ్వివాదం వంటి ఘటనలు ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా సిబ్బంది సాయం కోరినందుకు మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి దింపేసిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. జనవరి 30న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘జెలెన్‌స్కీని చంపబోమని పుతిన్‌ హామీ ఇచ్చారు!’

ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభంలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీని హతమార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ పనికి ఒడిగట్టనని రష్యా అధినేత పుతిన్‌ తనకు మాట ఇచ్చినట్లు ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉక్రెయిన్‌ సంక్షోభం మొదట్లో ఇరుదేశాల మధ్య శాంతి చర్చలకు బెన్నెట్‌ సైతం కొంతకాలం మధ్యవర్తిత్వం వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. విమానంలో కూర్చొనే.. ప్రభుత్వాన్ని కూల్చిన ముషారఫ్‌!

అది అక్టోబర్‌ 12, 1999. సమయం సాయంత్రం 6:45. విమానం ఎయిర్‌బస్‌ పీకే805. మొత్తం 198 మంది ప్రయాణికులతో పాక్‌కు వస్తోంది. అందులో స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. మరో 10 నిమిషాల్లో విమానం దిగాల్సి ఉంది. కానీ, సమయం గడుస్తున్నా.. ల్యాండ్‌ చేయడానికి పైలట్‌కు అనుమతులు మాత్రం రావడం లేదు. కారణం అందులో నాటి పాక్‌ ఆర్మీ చీఫ్‌ పర్వేజ్‌ ముషారఫ్‌  ఉండడమే! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్‌ యాప్‌లపై కేంద్రం కొరడా!

దేశంలో అడ్డగోలుగా పుట్టుకొస్తూ ప్రజలను ఆకర్షించి ఆ తర్వాత వారి మానసిక వేదనకు కారణమవుతున్న రుణ(Loan apps), బెట్టింగ్‌ యాప్‌(Betting apps)లపై కొరడా ఝళిపించేందుకు కేంద్రం రంగం సిద్ధమైంది. ఈ యాప్‌ల ద్వారా చిన్న మొత్తంలో రుణాలు పొందిన సామాన్యుల్ని ఘోరంగా దోపిడీకి, వేధింపులకు గురిచేసి అనేకమంది ఆత్మహత్యలకు దారితీస్తోన్న ఈ దా‘రుణ’ యాప్‌ల వ్యవహారంపై కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇంతకీ అశ్విన్‌ బౌలింగ్‌ శైలి ఏంటి‌..? వైరల్‌గా మారిన ‘ఎడిటెడ్‌ బయో’

 టీమ్‌ఇండియా (team india) టాప్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ (ravichandran ashwin) బౌలింగ్‌ శైలి ఏంటో అందరికీ తెలుసు. విభిన్నంగా బంతులను సంధించి ప్రత్యర్థులతో ఆటాడుకొనే అశ్విన్‌.. మాటల్లోనూ తనదైన దూకుడు ప్రదర్శిస్తాడు. కానీ, వికీపిడియాలో అశ్విన్‌కు చిన్న ఝలక్‌ తగిలింది. తన బయోడేటాను ఎవరో పొరపాటుగా ఎడిట్‌ చేసిన ఇమేజ్‌ను సోషల్‌ మీడియాలో షేర్ చేసిన అశ్విన్‌ నెట్టింట్లో వైరల్‌గా మారాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు