Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఈనెల 11న యథాతథంగా జరగనుంది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా గతేడాది అక్టోబరులో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. కేబినెట్ సమావేశం తర్వాత పీఆర్సీపై ప్రకటన
2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు బుధవారం నిర్వహించనున్న కేబినెట్ భేటీలో ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ అధికారులు భేటీ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. రైలు దుర్ఘటన ఎఫెక్ట్: 19 రైళ్లు రద్దు.. పూర్తి లిస్ట్ ఇదే..
ఒడిశాలోని బాలేశ్వర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన(Odisha train accident) పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోర ప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోగా.. రైలు పట్టాలు ధ్వంసం కావడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో నిన్న రాత్రికి యుద్ధప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసిన అధికారులు ప్రస్తుతం పరిమితంగా రైళ్లను నడుపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం.. మమత ప్రకటన
ఒడిశాలోని బాలేశ్వర్‌లో మూడు రైళ్లు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదం(Odisha Train Accident)లో బాధిత కుటుంబాలను ఆదుకొనే విషయంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. చనిపోయాడని ట్రక్కులో ఎక్కించారు.. కానీ!
ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Accident) ఎందరో జీవితాల్లో విషాదం నింపింది. ఇప్పటికీ, కొంత మంది తమ కుటుంబసభ్యుల ఆచూకీ కోసం మార్చురీలో వెతుకున్న ఘటనలు అక్కడున్న వారిని కలచివేస్తున్నాయి. ప్రమాదం జరిగిన రోజు పశ్చిమబంగాల్ (West Bengal)కు చెందిన బిశ్వజిత్ మాలిక్ (Biswajit Malik) కూడా షాలిమర్ స్టేషన్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ‘15 ఏళ్లుగా కవర్ చేసుకుంటున్నా.. ఇక నా వల్ల కాదు’.. అతడిని నేనే చంపేశా!
మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం ఓ హత్య (Mexico Murder) చేశాడు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చివేశాడు. చనిపోయిన వ్యక్తి ఆచూకీ లభించకపోవడంతో కొన్నేళ్లపాటు దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు ఆ కేసును మూసివేశారు. కానీ, హత్య చేసిన వ్యక్తి మాత్రం తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎన్నో అబద్ధాలు ఆడుతూనే ఉన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. చేయని నేరాలకు ‘సీరియల్ కిల్లర్’గా ముద్ర.. 20 ఏళ్లకు క్షమాభిక్ష!
దశాబ్ద కాలంలో వేర్వేరు సందర్భాల్లో తన నలుగురు పిల్లలను పొట్టన పెట్టుకుని.. ఆస్ట్రేలియా (Australia)లో క్రూరమైన ‘మహిళా సీరియల్ కిల్లర్ (Serial Killer)’గా ముద్రపడిన ఓ మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఇటీవల శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా చేపట్టిన విచారణలో ఆమె తన చిన్నారులను హత్య చేయలేదని తేలింది. దీంతో అధికారులు ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించడంతో.. 20 ఏళ్ల తర్వాత జైలు జీవితం నుంచి బయటకు వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. నిలకడగా కోరమాండల్ లోకోపైలట్ల ఆరోగ్యం
ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన ఇంజిన్ డ్రైవర్ గుణనిధి మహంతి, ఆయన అసిస్టెంట్ హజారీ బెహరా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. వారిద్దరికి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స అందుతోంది. ‘ఇద్దరు డ్రైవర్ల ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉంది. వారిలో మహంతిని సోమవారం ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. బెహరాకు మాత్రం తలకు శస్త్రచికిత్స జరగాల్సి ఉంది’ అని ఆగ్నేయ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అదిత్య చౌధురీ మీడియాకు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ప్లేస్టోర్‌లో మరో కొత్త మాల్‌వేర్.. ఈ 100 యాప్స్‌తో జాగ్రత్త!
ఆండ్రాయిడ్ యూజర్లను వరుస మాల్‌వేర్ భయాలు వెంటాడుతున్నాయి. స్పిన్‌వీల్ వంటి గేమింగ్ యాప్‌లతో రివార్డు పాయింట్లు, బహుమతుల పేరుతో యూజర్ల వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం సేకరిస్తున్న కొత్త యాప్‌ను డాక్టర్ వెబ్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. స్పిన్ ఓకే పేరుతో ఈ వైరస్ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌లోని సుమారు 100 యాప్‌లలో ఉన్నట్లు డాక్టర్ వెబ్ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. విమానాన్ని వెంబడించిన ఫైటర్ జెట్.. సానిక్ బూమ్‌తో హడలిన వాషింగ్టన్
అమెరికా (USA) రాజధాని వాషింగ్టన్ (Washington) గగనతలంలో ఓ చిన్న విమానం తీవ్ర కలకలం సృష్టించింది. అనుమానాస్పదంగా కన్పించిన ఆ విమానాన్ని ఎఫ్-16 యుద్ధ విమానం (Fighter Jet) వెంబడించింది. అయితే ఈ ఫైటర్ జెట్ అత్యంత వేగంగా జనావాసాలపై నుంచి ప్రయాణించడంతో భారీ స్థాయిలో శబ్దాలు వినిపించాయి. దీంతో వాషింగ్టన్ ప్రజలు హడలిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.