Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. రాయలసీమ కష్టాలు చూశా.. కన్నీళ్లు తుడుస్తా: నారా లోకేశ్
యువగళం పాదయాత్రలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడపలో ‘మిషన్ రాయలసీమ’ పేరుతో రాయలసీమ సమస్యలపై చర్చా వేదిక నిర్వహించారు. ప్రొఫెసర్ రాజేశ్ చర్చా వేదికలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ‘సీమ కష్టాలు చూశా.. సీమ కన్నీళ్లు తుడుస్తా’నని ప్రకటించారు. రాయలసీమలో తెదేపాకు తక్కువ సీట్లు వచ్చినా తక్కువగా చూడలేదన్న లోకేశ్.. మొత్తం రాయలసీమను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రూ.లక్ష పేరుతో సీఎం కేసీఆర్ బీసీలను మోసం చేస్తున్నారు: లక్ష్మణ్
మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... లక్షా 27వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న మంత్రి కేటీఆర్ .. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజాధనంతో విదేశీ పర్యటనలు చేశారు.. టీఎస్‌ఐపాస్ ద్వారా ఎన్ని కంపెనీలు వచ్చాయో చెప్పాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. వైకాపా విధానాల వల్లే ఏపీలో విద్యారంగం నాశనం: చంద్రబాబు
వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల ఏపీలో విద్యారంగం నాశనం అయిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సిటీల ర్యాంకింగ్ పడిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వర్సిటీలకు ర్యాంకులు కేటాయిస్తూ కేంద్ర ఉన్నత విద్యా శాఖ విడుదల చేసిన నివేదికను ప్రస్తావిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. జేడీఎస్.. భాజపాకు దగ్గరవుతోందా..?
ఇటీవల జరిగిన కర్ణాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ సెక్యులర్(JDS) ఆశించిన సీట్లను పొందలేకపోయింది. ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్‌గా వ్యవహరిద్దామనుకున్న ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. 224 అసెంబ్లీ స్థానాలకుగానూ 19 మాత్రమే దక్కించుకుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ పార్టీ ఇప్పుడు భాజపా వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. అదే జరిగితే.. 2024 ఎన్నికల్లో మార్పు తథ్యం: శరద్ పవార్
దేశంలో ప్రస్తుతం భాజపా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. ఇదే కొనసాగితే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (General elections) ప్రజలు మార్పును తప్పకుండా చూస్తారని తెలిపారు. ఔరంగాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ హత్య.. లాయర్ దుస్తుల్లో వచ్చి కాల్పులు
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ(Lucknow)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోర్టు ఆవరణలో పట్టపగలు అందరూ చూస్తుండగానే గ్యాంగ్‌స్టర్(gangster) సంజీవ్ జీవా దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు న్యాయవాదుల దుస్తుల్లో వచ్చి అతడిపై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. లఖ్‌నవూ సివిల్ కోర్టు(Lucknow civil court) గది బయట జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మణిపూర్ హింస.. నేనేం తప్పు చేశాను.. నన్నెందుకు చంపారు అంకుల్!
మణిపూర్‌లో కాంగ్‌చుప్‌కు చెందిన ఎనిమిదేళ్ల టోన్సింగ్ హాంగ్సింగ్‌కు అమ్మ, నాన్నే లోకం. రోజూ తన తోటి పిల్లలతో కలిసి స్కూలుకు వెళ్లడం.. ఆడుకోవడమే దినచర్య. గత నెల రోజుల క్రితం వరకు సజావుగా సాగిన అతని జీవితం.. రాష్ట్రంలో చెలరేగిన హింసతో ఒక్కసారిగా తలకిందులైంది. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో హింస చెలరేగడంతో వారి కుటుంబం మొత్తం కాంగ్‌చుప్ దగ్గర్లోని అస్సాం రైఫిల్స్ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. అనురాగ్‌తో 6 గంటల పాటు చర్చ.. నిరసనలకు రెజ్లర్లు తాత్కాలిక బ్రేక్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్, భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన నిరసనలో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు ఆయనతో రెజ్లర్ల సుదీర్ఘ భేటీ ముగిసింది. దాదాపు 6గంటల పాటు జరిగిన చర్చల్లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వంగా పలు హామీలు ఇచ్చినట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఈదురుగాలులకు కదిలిన గూడ్స్ రైలు బోగీలు.. ఆరుగురి మృతి
ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడి ఝాజ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గూడ్స్ రైలుకు చెందిన నిరూపయోగ బోగీ చక్రాల కింద నలిగి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. రైల్వే స్టేషన్‌లో కొంతకాలంగా ఇంజిన్ లేని గూడ్స్ రైలు నిలిపి ఉంది. బుధవారం రైల్వే మరమ్మతులు చేయడానికి కార్మికులు రాగా.. ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం పడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఖెర్సాన్‌ను ముంచుతున్న ముప్పు..!
ఉక్రెయిన్‌లోని నోవా కఖోవ్కా డ్యాం దిగువ ప్రాంతాలు మెల్లగా జలమయం అవుతున్నాయి. దీంతో నీపర్ నది పరీవాహక ప్రాంతంలోని 42,000 మంది ప్రజల జీవితాలు ప్రమాదంలో పడినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నాటికి వరద తీవ్రస్థాయిలో రావచ్చని అంచనావేసింది. వచ్చే 20 గంటల్లో ఖెర్సాన్‌లో మూడు అడుగుల మేరకు నీరు చేరవచ్చని భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/10/2023)
-
Rahul Gandhi: నేను చెప్పింది మోదీ అంగీకరించారు: రాహుల్ గాంధీ
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!