Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. ఎన్నికల సమరానికి సై.. పవన్ ప్రచార వాహనం సిద్ధం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన కోసం ప్రచార వాహనం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఓ గ్యారేజీలో ప్రచార వాహనానికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు. సిద్ధమైన వాహనాన్ని, ట్రయల్ రన్‌ను పవన్ కల్యాణ్ ఇవాళ హైదరాబాద్‌లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కి కొన్ని ముఖ్య సూచనలను చేశారు. వాహనాన్ని తీర్చి దిద్దిన సాంకేతిక నిపుణులతోనూ చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసులు.. అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
గత ఐదేళ్లలో ప్రజాప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు డీఓపీటీ శాఖమంత్రి జితేంద్రసింగ్ ఈమేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2017-2021 మధ్య కాలంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 10 సీబీఐ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఆ తర్వాత స్థానంలో ఒక్కో రాష్ట్రంలో ఆరు కేసులతో ఉత్తరప్రదేశ్, కేరళ నిలిచాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. దిల్లీలో భాజపా ఏకఛత్రాధిపత్యానికి బ్రేక్.. ఓటమికి కారణాలివేనా?
దిల్లీ మున్సిపల్ ఎన్నిక (MCD Polls 2022)ల్లో భాజపాకు పరాభవం ఎదురైంది. గత 15ఏళ్ల పాటు వరుస విజయాలతో దిల్లీ నగర పాలికలపై కాషాయజెండాను రెపరెపలాడించిన కమలనాథులు ఈసారి మేయర్ పీఠాన్ని కోల్పోయారు. ఈ ఓటమితో భాజపాకు ఆప్ నుంచి తొలిసారి గట్టి షాక్ తగిలినట్టయింది. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో ఆప్ 134 స్థానాలు గెలుచుకోగా.. భాజపా 104సీట్లలో విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సిసోదియా, జైన్ ఇలాకాల్లో కాషాయ రెపరెపలే..
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో 134 చోట్ల విజయం సాధించింది. భాజపాను గద్దెదించి మేయర్ పదవి దక్కించుకుంది. కానీ, కీలక నేతల నియోజకవర్గాల్లో మాత్రం ఆమ్ ఆద్మీకి పరాభవం తప్పలేదు. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, మంత్రి సత్యేందర్ జైన్ నియోజకవర్గాల్లో కాషాయ జెండానే రెపరెపలాడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రోహిత్ ఒంటరి పోరాటం.. అయినా ఐదు పరుగుల తేడాతో భారత్ ఓటమి
చివరి ఓవర్లో 20 పరుగులు అవసరమైన సందర్భంలో రోహిత్ శర్మ (51*: 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. అయితే ముస్తాఫిజర్ స్లో బంతులు వేయడంతో ఈ ఓవర్లో 14 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో బంగ్లాదేశ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరికి భారత్ 50 ఓవర్లకు 266/9 స్కోరుకే పరిమితమైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లా 2-0 తేడాతో కైవసం చేసుకొంది. చివరి మ్యాచ్ చిట్టగాంగ్ వేదికగా శనివారం జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితా.. నిర్మలా సీతారామన్‌కు వరుసగా నాలుగోసారి చోటు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ (Forbes list) విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత (Powerful Women) 100 మంది మహిళల జాబితాలో మరోసారి చోటు సాధించారు. దేశంలో మొత్తం ఆరుగురికి చోటు దక్కగా.. అందులో నిర్మలా సీతారామన్ తొలి స్థానంలో నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మరింత విస్తరించనున్న యూపీఐ చెల్లింపుల పరిధి
కీలక వడ్డీరేట్ల పెంపుతో పాటు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం మరో కీలక ప్రకటన చేశారు. ‘భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్’, యూపీఐ పరిధిని విస్తరించే ప్రణాళిక గురించి కూడా ప్రస్తావించారు. పన్ను చెల్లింపులు, అద్దె నుంచి పాఠశాల ఫీజుల వరకు ఏ రకమైన చెల్లింపునైనా చేయడానికి వినియోగదారులు త్వరలో BBPSని ఉపయోగించుకోవచ్చని శక్తికాంత దాస్ తెలిపారు. అన్ని రకాల చెల్లింపులు, వసూళ్లను చేర్చడానికి BBPS పరిధిని మెరుగుపరచనున్నట్లు దాస్ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. 100మంది ఎంపీలు.. ఎంతో ప్రచారం.. అయినా మేమే గెలిచాం!
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (MCD Elections) సత్తా చాటిన ఆమ్ఆద్మీపార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది.ఈ నేపథ్యంలో భాజపాపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు విసిరింది. అపరిమిత శక్తి, ముఖ్యమంత్రులు, దర్యాప్తు సంస్థల బలం, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే భాజపా ఓ చిన్న పార్టీ చేతిలో ఓడిపోయిందని విమర్శలు గుప్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఆగిఉన్న రైలును ఢీ కొట్టిన మరో రైలు.. 150 మందికి గాయాలు
స్పెయిన్‌లో భారీ ప్రమాదం తప్పింది. బార్సిలోనాకు సమీప స్టేషన్లో ఆగిఉన్న ఓ ప్రయాణికుల రైలును వెనకనుంచి వచ్చిన మరో రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 155 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. వారిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా.. 39 మందిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రమాద సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటం వల్ల భారీ ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. దేశంలో 84,102 అంకుర సంస్థలు
ఈ ఏడాది నవంబరు 30 నాటికి దేశంలో 84,102 అంకుర సంస్థల్ని గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్‌సభలో బుధవారం ఓ సభ్యుడు అడిగి ప్రశ్నకు సమాధానం ఇస్తూ వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ ఈ వివరాలను వెల్లడించారు. ‘స్టార్టప్ ఇండియా’ పథకం 2016లో ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా ‘డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్’ అర్హతగల కంపెనీలను అంకుర సంస్థలుగా గుర్తిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: మైనర్ ఘాతుకం.. 58 ఏళ్ల మహిళపై అత్యాచారం.. ఆపై హత్య!
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Sports News
Harmanpreet Kaur: మా దృష్టి వేలంపై లేదు.. పాక్‌తో మ్యాచ్‌పైనే ఉంది: హర్మన్ ప్రీత్ కౌర్
-
India News
Assam: బాల్య వివాహాలు.. 3 రోజుల్లో 2,278మంది అరెస్టు
-
Politics News
Karnataka: ఇవే నా చివరి ఎన్నికలు.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం!
-
Movies News
NTR: నా భార్య కంటే ముందు మీకే చెబుతా.. దర్శక- నిర్మాతలపై ఒత్తిడి తేవొద్దు: ఎన్టీఆర్