Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..
1. దిల్లీ బయల్దేరిన కవిత.. ఈడీ విచారణపై ఉత్కంఠ
దిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam)కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) దిల్లీ బయల్దేరారు. ఇప్పటికే షెడ్యూల్ కార్యక్రమాలు చాలా ఉన్నందున.. ఆమె గురువారం ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. శుక్రవారం దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహిళా బిల్లు ఆమోదం కోసం ఆమె దీక్ష చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. తెలంగాణ ప్రజలు సెంటిమెంట్‌ను పట్టించుకునే స్థితిలో లేరు: బండి
మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత భారాసకు లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భారాసలో మహిళా విభాగమే లేదన్నారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్సీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. తొలి ఐదేళ్ల పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. భారాస మహిళా అధ్యక్షురాలు ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. మే15 నుంచి ఏపీఈఏపీసెట్
ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్-2023 పరీక్ష తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మే 15 నుంచి 18 వరకు ఇంజినీరింగ్.. మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈఏపీసెట్ దరఖాస్తుకు ఈనెల 11 నుంచి వచ్చే నెల 15 వరకు గడువు ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. జడేజాతో కష్టం.. ప్రతి బంతికి అప్పీల్ చేయమంటాడు: రోహిత్ శర్మ
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మొదటి రెండు టెస్టుల్లో విజయం సాధించి మంచి ఊపు మీదున్న టీమ్ఇండియా (Team India)కు మూడో టెస్టులో కంగారులు షాకిచ్చారు. స్పిన్ అస్త్రంతో చెలరేగి భారత్‌ను ఓడించారు. ఈ మ్యాచ్‌లో స్వయం తప్పిదాలు కూడా టీమ్‌ఇండియా ఓటమికి కారణమయ్యాయి. మూడో టెస్టులో డీఆర్‌ఎస్ (DRS)లను సరిగ్గా వినియోగించుకోలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. మరో 27 నగరాల్లో జియో 5జీ సేవలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పట్టణాల్లోనే..
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Jio) తన 5జీ సేవల్ని శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 5జీ సేవల్ని(Jio 5G services) అందుబాటులోకి తీసుకొచ్చిన జియో.. తాజాగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని మరో 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ముందస్తు బెయిల్ విచారణ అంత త్వరగానా..? సీజేఐకు న్యాయవాద సంఘం లేఖ
లంచం కేసులో ఏ1గా ఉన్న కర్ణాటక భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్పకు ముందస్తు బెయిల్ పిటిషన్ త్వరగా విచారణకు రావడంపై బెంగళూరు న్యాయవాద సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విషయంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాసింది. వీఐపీలకు సంబంధించిన అంశాలు రాత్రికి రాత్రే విచారణకు రావడాన్ని ప్రధానంగా ప్రస్తావించిన న్యాయవాద సంఘం.. అందరికీ సమన్యాయం ఉండాలంటూ అందులో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. కనుచూపు మేరలో వినాశనమే..!
ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) దాడులు మొదలుపెట్టిన నాటి నుంచి ఊహించని వినాశనం చోటు చేసుకొంది. కళ్లముందే మేరియుపోల్ వంటి నగరాలు నేలమట్టమయ్యాయి. తాజాగా డొనెట్స్క్ ప్రాంతంలోని ఓ పట్టణం ఏ స్థాయిలో ధ్వంసమైందో తెలియజేస్తూ ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ ఓ ట్వీట్ చేసింది. డ్రోన్ నుంచి దీనికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. అస్సాంలో గూఢచర్యం.. పాక్ ఏజెంట్లకు సిమ్‌కార్డుల సరఫరా..!
పాకిస్థానీ ఏజెంట్లకు సిమ్‌కార్డులు సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అస్సాంలో అరెస్టు చేశారు. నాగౌన్, మోరిగాన్ జిల్లాల్లోని ఈ అరెస్టులు జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. వీరి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ఇతర ప్రమాదకర మెటీరియల్ స్వాధీనం చేసుకొన్నారు. విదేశీ దౌత్యకార్యాలయానికి రక్షణశాఖ కీలక సమాచారం చేరవేసేందుకు వినియోగిస్తున్న ఓ హ్యాండ్ సెట్ కూడా దీనిలో ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. అలా చేయడం కేఎల్‌ను బాధించే ఉంటుంది: గౌతమ్ గంభీర్
గతకొంతకాలంగా విఫలమవుతూ వస్తున్న టీమ్‌ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై (KL Rahul) ఆసీస్‌తో మూడో టెస్టుకు వేటుపడింది. అంతకుముందు వరుసగా అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోకపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి. దీంతో మూడో టెస్టులో (IND vs AUS) అతడిని తొలగించి శుభ్‌మన్‌గిల్‌కు జట్టు మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. కానీ, గిల్ కూడా నిరాశపరిచాడు. దీంతో మళ్లీ కేఎల్‌కు ఛాన్స్ ఇస్తే బాగుంటుందనే వాదన తెరమీదకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఇకపై వాట్సాప్‌లో గ్రూప్‌లు తాత్కాలికమే!
స్కూల్, కాలేజ్, ఆఫీస్ లేదా అపార్ట్‌మెంట్.. ఇలా ప్రతి చోటా ఒకే విషయాన్ని ఎక్కువ మందికి తెలియజేసేందుకు వాట్సాప్ (WhatsApp) గ్రూప్‌లను క్రియేట్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో బర్త్‌డే పార్టీ, కాలేజ్ టూర్ లేదా పండుగ సంబరాలు వంటి వాటి గురించి స్నేహితులు, సహోద్యోగులు తాత్కాలిక గ్రూప్‌లను క్రియేట్ చేసి చర్చిస్తారు. తర్వాత వాటిని డిలీట్ చేయడం మర్చిపోతుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Venkatesh: ఇప్పుడు టర్న్ తీసుకున్నా.. ‘రానా నాయుడు’పై వెంకటేశ్ కామెంట్
-
Sports News
IPL:ఆటగాళ్ల పనిభార నిర్వహణ.. అవసరమైతే ఐపీఎల్లో ఆడటం మానేయండి: రవిశాస్త్రి
-
General News
Hyderabad : విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా.. ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
-
India News
Rahul Gandhi: జైలు శిక్ష తీర్పు తర్వాత.. లోక్‌సభకు రాహుల్ గాంధీ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC paper leak case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో 19 మందిని సాక్షులుగా చేర్చిన సిట్..