Gujarat-Himachal: రికార్డులు బ్రేక్‌.. సంప్రదాయ పరంపర.. ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక కథనాలు..

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 08 Dec 2022 21:08 IST

1. ప్రజల ఆశీర్వాదం ఉంటే అద్భుతాలు జరుగుతాయి: ప్రధాని మోదీ

ప్రజల ఆశీర్వాదం ఉంటే అద్భుతాలు జరుగుతాయని, గుజరాత్‌ ప్రజలు తమను మరోసారి ఆశీర్వదించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయం వద్ద  ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుజరాత్‌లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ కార్యకర్తల శ్రమకు ఫలితం లభించిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 37ఏళ్ల రికార్డ్‌ బ్రేక్‌.. భాజపా గుజరాత్‌ స్కోర్‌ 156

తమ కంచుకోట అయిన గుజరాత్‌ (Gujarat)లో కమలనాథులు మళ్లీ విజయనాదం మోగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly election Results) వరుసగా ఏడోసారి విజయం సాధించడంతో పాటు 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టి అత్యధిక స్థానాలతో భాజపా (BJP) సరికొత్త చరిత్ర లిఖించింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాషాయ పార్టీ ఏకంగా 156 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీ ఈ స్థాయిలో సీట్లు దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చక్‌ దే బీజేపీ...వరుస విజయాలు.. ఎలా సాధ్యం?

గుజరాత్‌ (Gujarat)లో మరోసారి కమలం వికసించింది. వరుసగా ఏడోసారి భాజపా ప్రభంజనం సృష్టించింది. అధికారం కోసం కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీల యత్నాలను తుత్తునియలు చేసి, 156 స్థానాల్లో గెలుపొంది రికార్డు స్థాయి విజయం సాధించింది. గుజరాత్‌ చరిత్రలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ (Congress) పేరిట (1985లో 149 స్థానాల్లో విజయం) ఉన్న రికార్డును చెరిపేసింది. ఇలా వరుస విజయాలు సాధించడం ఏపార్టీకైనా అంత సులభమేం కాదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జాతీయ పార్టీగా అవతరించాం.. థాంక్యూ గుజరాత్‌..!

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Election2022)ల్లో సాధించిన ఓట్లతో ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP)కి జాతీయ పార్టీ హోదా దక్కిందని ఆ పార్టీ కన్వీనర్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) వెల్లడించారు. తమ పార్టీకి ఓట్లు వేసి గొప్ప అవకాశాన్ని కల్పించడంలో సహకరించిన గుజరాత్‌ ప్రజలు, ఆప్‌ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఎన్నికల్లో గుజరాత్‌లో భాజపా కోటను ఢీకొట్టామన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రెండో దఫా విజయమే కష్టం.. మరీ వీళ్లు ఇన్నేళ్లు ఎలా గెలుస్తున్నారు?

దేశంలో సుదీర్ఘ కాలంపాటు అధికారంలో ఉన్న కొన్ని పార్టీలు క్రమంగా తమ ప్రాభవాన్ని కోల్పోతుండగా.. మరికొన్ని మాత్రం ఆయా రాష్ట్రాల్లో ఏళ్లపాటు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఐదేళ్లపాటు పాలించి మరోసారి అధికారంలోకి రావాలంటే ఎంతో శ్రమించాల్సి వస్తోన్న తరుణంలో.. సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడమే కాకుండా ప్రజావ్యతిరేకతను దాటుతూ అధికారాన్ని భద్రపరచుకుంటున్నాయి. ఇదివరకు త్రిపుర, సిక్కింలలో ఇటువంటి పరిణామం చూడగా.. తాజాగా గుజరాత్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో ఈ తరహా రాజకీయం కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘జాడూ’ ఊడ్చలేకపోయినా.. జాతీయపార్టీ హోదా దక్కింది..!

2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి తర్వాత దేశంలో భాజపా(BJP) ప్రత్యామ్నాయం లేదా? అనే సందేహాలు పుట్టుకొచ్చాయి. సరిగ్గా అదే సమయంలో తెరపైకి వచ్చింది ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP). దశాబ్దం క్రితం అన్నాహజారే ప్రారంభించిన జన్‌లోక్‌పాల్‌ ఉద్యమం ద్వారా ప్రాచుర్యం పొందిన కేజ్రీవాల్‌ ఆప్‌ను స్థాపించారు. దిల్లీ గల్లిలో పుట్టిన ఈ పార్టీ.. అంచెలంచెలుగా ఎదుగుతూ పలు రాష్ట్రాలకు విస్తరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘పద్మ’వ్యూహంలో ప్రతిపక్షాలు కకావికలం..!

2017 ఎన్నికల సమయంలో గుజరాత్‌ కాంగ్రెస్‌ దివంగత నేత అహ్మద్‌ పటేల్‌, అప్పటి గుజరాత్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి అశోక్‌ గహ్లోత్‌ చురుగ్గా వ్యూహరచన చేయడంతో భాజపా గట్టిపోటీని ఎదుర్కొంది. భాజపా 99 సీట్లు దక్కించుకోగా.. కాంగ్రెస్‌ ఆ మేరకు మెరుగుపడి 77 స్థానాలు గెలుచుకుంది. ఈ పరిణామం భాజపాలో ప్రమాదఘంటికలను మోగించింది. దీంతో ఈ సారి కమలనాథులు మొదటి నుంచే అప్రమత్తమై వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కాంగ్రెస్‌ను వెంటాడుతున్న ఆప్‌.. ‘గుజరాత్‌’ ఆశలకూ గండి!

అది 2017 డిసెంబర్‌ 18. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Gujarat election 2022) వెలువడుతున్న రోజు. ప్రధాన పోటీ భాజపా- కాంగ్రెస్‌ (BJP- congress) మధ్యే. ఓ దశలో కాంగ్రెస్‌ (Congress) గెలుస్తుందన్నంత పనిచేసింది. భాజపాకు (BJP) ఆ స్థాయిలో చెమటలు పట్టించింది. అయినా కొద్ది సీట్ల తేడాతో అధికారం చేజార్చుకుంది. ఓ 10 సీట్లు అటూ ఇటూ అయితే కాంగ్రెస్‌ను అధికారం వరించేదే! ఐదేళ్లు గిర్రున తిరిగాయ్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గుజరాత్ ఫలితాలు.. ప్రముఖుల గెలుపోటములు ఇలా

గుజరాత్‌(Gujarat) అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly election Results) కాషాయ జెండా మళ్లీ రెపరెపలాడింది. గతంలో ఎన్నడూ లేనంతగా అఖండ మెజార్టీతో భాజపా ఘన విజయం సాధించింది. కాగా.. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పోటీ చేశారు. కొందరు అంచనాలకు తగ్గట్లుగానే జయకేతనం ఎగురవేయగా.. మరికొందరికి పరాభవం తప్పలేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖుల ఫలితాలు ఇలా ఉన్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మైన్‌పురి ములాయం కోడలిదే.. డింపుల్‌ ఘన విజయం

సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi party) వ్యవస్థాపకుడు, దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి కంచుకోటగా పేరొందిన మైన్‌పురి (Mainpuri) లోక్‌సభ నియోజకవర్గంలో మామ రాజకీయ వారసత్వాన్ని కోడలు డింపుల్‌ యాదవ్ (Dimple Yadav) నిలబెట్టారు. ఈ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక (By polls)ల్లో పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్ సతీమణి డింపుల్‌ ఘన విజయం సాధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని